Politics

కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్ ఏరియల్ సర్వే

కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్ ఏరియల్ సర్వే

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఏరియల్‌ సర్వే. సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని.
– కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.
– నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించిన సీఎం.
– భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం.
– సర్వే అనంతరం అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
– భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయండి: సీఎం వైయస్‌.జగన్‌
– వీలైనంత వేగంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వండి.
– సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే.. రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి.
– ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్‌ అందిస్తున్న ప్రభుత్వం.
– మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశం.