DailyDose

విజయవాడలో ప్రముఖ క్రీడాకారుడి ఇంట్లో నలుగురు మృతి-నేరవార్తలు

విజయవాడలో ప్రముఖ క్రీడాకారుడి ఇంట్లో నలుగురు మృతి-నేరవార్తలు

* ప్ర‌ముఖ న్యాయ‌వాది, ఆంధ్ర‌ప్ర‌దేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు ‌ముసావి ఇంట తీవ్ర విషాదం నెలకుంది..విజయవాడలో మొగలరాజపురం లో నివసించే ఆకుటుంభం లో కరోనా వైరస్ తీవ్ర విషాదాన్ని నింపింది..10 రోజుల వ్య‌వ‌ధిలో కుటుంబంలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు…ముసావీతో పాటు త‌ల్లి, భార్య‌ మృతి చెందగా ఈరోజు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు… కూతురు ఆస్ట్రేలియాలో వుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.కరోనా వైరస్ ఒకే ఇంట10 రోజుల వ్యవధిలో నలుగురిని పొట్టన పెట్టుకున్న ఘటన స్థానికులను కలచి వేసింది*

* చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆవేదనతో కన్నతల్లి మృతిపొలం పనులకు వెళ్తున్న తన కుమార్తెను ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసులు తీసుకెళ్లడంపై తల్లి మనస్థాపానికి గురైంది. అక్కడికక్కడే కుప్పకూలి కన్నుమూసింది.  కృష్ణా జిల్లా వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామంలో ఈ విషాదం జరిగింది.  కొమరగిరి కోటేశ్వరమ్మ(35), ఆమె కుమార్తె మానస(10) సోమవారం సమీప బంధువులతో కలిసి  పొలం పనులకు బయల్దేరింది.అదే సమయంలో పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం కింద..ఆ బాలికను అడ్డుకున్నారు. పనికి వెళ్లొద్దంటూ వత్సవాయి పోలీసుస్టేషన్ కు  తరలించారు.బంధువుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.ఆధార్, రేషన్ కార్డు ఇతర గుర్తింపు పత్రాలు తీసుకుని వెంటనే స్టేషన్ కి రావాలని సమాచారం ఇచ్చారు.

* మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి ఎర్ర చెరువు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలానికి వీఆర్వో వేదాంతరావు ఎన్ ఓసి ఇచ్చారు.పైగా ఇచ్చిన సమయంలో ఆయన రామచంద్రాపురం విఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.బాధితులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) దృష్టికి తీసుకెళ్లటంతో అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆర్కే విచారణ జరిపి బాధ్యునిపై చర్యలు తీసుకొని భాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.విచారణ నిగ్గు తేలడంతో సదరు విఆర్వో ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తాజాగా ఉత్తర్వ్యులు జారీ చేశారు.ప్రస్తుతం ఆ విఆర్వో తాడేపల్లి ఒకటవ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే

* 10 మంది బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం..చిత్తూరు జిల్లాలోని సదాశివకోన జలపాతానికి విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగులు..నిన్నటినుంచి విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్..వీరిలో ముగ్గురు నెల్లూరుకు చెందినవారు..ఆందోళనలో ఉద్యోగుల తల్లిదండ్రులు..బ్యాంకువద్ద టెన్షన్ టెన్షన్..అందరూ నెల్లూరు జిల్లా వాసులే. ఎవరి ఫోన్లు పనిచేయకపోవడంతో అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్న పోలీసులు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పుత్తూరు ద్స్ప్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం.

* భావనిపురం ఐరన్ యార్డులో అగ్నిప్రమాదం బుగ్గిపాలైన పరుపులు కంపెనీ.రూ 50 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం రెండు ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

* నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదువరలక్ష్మి కుటుంబానికి రూ 10 లక్షలు చెక్కు అందించిన హోంమంత్రి సుచరితమహిళల భద్రత కు వైసిపి అత్యధిక ప్రాధాన్యతగాజువాక శ్రీనగర్ లోని ప్రేమోన్మాది కర్కసానికి భలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ర్ట హోంమంత్రి మేకపాటి సుచరిత సోమవారం ఉదయం పరామర్శించారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలతో పది లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాధరావులకు అందజేసారు.ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మోది అఖిలసాయిని అతని సహకరించిన వారిని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చెస్తామని హమి ఇచ్చారు.ఇప్పటికే ఈ కేసును దిశాకు అప్పగించనట్లు తెలిపారు.

* అమరావతి ఆందోళనకారులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు.జైల్ భరో కార్యక్రమంలో అరెస్టైన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు.- గుంటూరులో శనివారం ఆందోళన చేసిన 122 మందిపై కొవిడ్‌ మార్గదర్శకాలు, సెక్షన్‌ 144 నిబంధనల్ని అతిక్రమించారంటూ కేసులు నమోదు చేశారు.రైతులకు సంకెళ్లు వేయటాన్ని నిరసిస్తూ గుంటూరులో శనివారం ఆందోళన చేసిన 122 మందిపై కొవిడ్‌ మార్గదర్శకాలు, సెక్షన్‌ 144 నిబంధనల్ని అతిక్రమించారంటూ… అరండల్‌పేట స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.అమరావతి రైతు ఐకాస, దళిత రైతు ఐకాస, రాజకీయేతర ఐకాస నేతలతో పాటు తెదేపా, సీపీఐ పలు ప్రజా సంఘాలకు చెందిన నాయకులపై కేసులు పెట్టారు.