Politics

రాములమ్మకు కాంగ్రెస్ బుజ్జగింపులు

టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం సాయంత్రం విజయశాంతి ఇంటికి వెళ్లారు. సుధీర్ఘంగా ఆమెతో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. ఠాగూర్‌కు స్పష్టంగా వివరించారు. రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా..తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారు.