Politics

హరీష్‌రావుకు షాక్ – కేటీఆర్ వేదాంతం!

హరీష్‌రావుకు షాక్ – కేటీఆర్ వేదాంతం!

దుబ్బాక దంగల్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు పూర్తైన ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టించింది. ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. హరీష్ రావు దత్తత గ్రామమైన చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది.

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఏ ఎన్నిక అయినా..గెలుపు మావైపే నిలించింది..విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోము..గతంలో ఇదే చెప్పాం..ఇప్పుడు ఇదే చెప్తున్నాం..దుబ్బాక లో టిఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి ఓక్కరికి కృతజ్ఞతలు..పార్టీ కోసం పనిచేసిన హరీష్ రావు తో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు..మేము ఆశించిన ఫలితం రాలేదు..ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది .మా నాయకులకు ఓక హెచ్చరికలా ఈ ఓటమి ని భావిస్తాం..మేము అప్రమత్తం కావడానికి ఈ ఎన్నిక తోడ్పడుతుంది…ఓటమి కి గల కారణాలు సమీక్షించంకుంటాం..ఓటమి తో కుంగిపోకుండా..సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాం..తెలంగాణా ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు.. ఏ ఎన్నిక వచ్చినా.. అనితర సాధ్యమయిన విజయాలను నమోదు చేసాం…విజయాలకు పొంగిపోమ్.. అపజయాలకు కృంగి పాము..దుబ్బాకలో మాకు ఓటు వేసిన వాళ్లకు ధన్యవాదాలు..