Sports

చికెన్ వ్యాపారం ప్రారంభించిన ధోనీ

Dhoni Begins KadakNath Chicken Business

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సిరులు కురిపించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘కడక్‌నాథ్‌’ పెంపకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ  పరిశ్రమను నెలకొల్పేదిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ధోని బృందం ఆర్డర్‌ చేసిన 2 వేల కోడి పిల్లలు, డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ గిరిజన రైతు వినోద్‌ మెండాతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఈ విషయం గురించి మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్‌ ముర్గా రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఐఎస్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించాడని, అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.