Sports

డిగో మారడోనా అస్తమయం

డిగో మారడోనా అస్తమయం

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌ కప్‌ అందించారు. మెరుపు గోల్స్‌ కొడుతూ ఫుట్‌బాల్‌ ఆటలో ‘ది గోల్డెన్‌ బాయ్‌’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన ప్రపంచస్థాయి కీర్తి గడించారు.