Devotional

తితిదే పాలకమండలి సమావేశ వివరాలు

Vykunta Dwara Darshan 2020 - TTD EC Meeting

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

కమిటీ నివేదిక ప్రకారం ద్వారాలను తెరుస్తున్నామని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు.‘‘దేశవ్యాప్తంగా టీటీడీకి 1,128 ఆస్తులు ఉన్నాయి. టీటీడీకి 8,088 ఎకరాల స్థలాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కమిటీ.

త్వరలో ఈహెచ్‌ఎస్‌ స్కీంను అమలు చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్‌ బస్సుల స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామన్నారు.

పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ చేస్తామన్నారు.

ఏపీలోని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు పునఃప్రారంభిస్తామని చెప్పారు.

బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ భవనంను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు