Fashion

కుంకుమ కొనండి. రసాయనాలు కాదు.

Choose Wisely - DO NOT Buy Chemical Kumkum

స్నానం చేయడంతోనే కుంకుమను నుదుటన పెట్టుకోవడం మన సంప్రదాయం. ఒకప్పుడు కుంకుమతో ఎర్రెర్రగా బొట్టుపెట్టుకోవడం నేడు తగ్గిపోయినా పెళ్లయిన వారు మాత్రం నుదుటిపై కుంకుమను ధరించడం ఆనవాయితీ. కొందరు పండుగలు, పబ్బాలప్పుడు మాత్రమే కుంకుమను వాడుతుంటాయి. ముఖ్యంగా పూజల సమయంలో కుంకుమ లేకుండా పూజ పూర్తికాదు. సంప్రదాయాలప్పుడు అంతగా ఉపయోగపడే ఈ సింధూరంలోనూ రసాయనాల వాడకం మితిమీరిపోతోందని హెచ్చరిస్తోంది అమెరికా తాజా అధ్యయనం. అక్కడ న్యూజెర్సీ నగరంలో ఉన్న ఆసియా దేశాలకు చెందిన దుకాణాల్లో నుంచి సేకరించిన 95నమూనాలు,మన ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన 23నమూనాలను పరీక్ష చేశారు. వీటిల్లో ఎనభై శాతం వాటిల్లో సీసం వాడకం పరిమితికి మించి ఉంటోందని నిపుణులు తేల్చారు. ముఖ్యంగా కుంకుమలో ఎరుపుదనం కొట్టొచ్చేలా కనిపించడానికి ‘లెడ్ టెట్రాక్సైడ్’ ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. దీన్ని ఎక్కువగా వాసన చూసినా, ఇది పొరబాటున జీర్ణవ్యవస్థలోకి వెళ్లినా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయంటోంది ఈ పరీక్ష చేసిన అమెరికాలోని ఆహార, ఔషధ శాఖ(్ఫడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్- ఎఫ్డీ ఏ). మోతాదు మించితే మెదడుకి సంబంధించి యాక్యుట్ ఎనె్సఫలోపతి, తీవ్ర గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటోంది. ఇంతకీ ఏమిటా మోతాదు? ఎఫ్డీఏ ప్రకారం అలంకరణకి వాడే ఒక గ్రాము మేకప్ వస్తువుల్లో సీసం 20మిల్లీగ్రాములకంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఈ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో చాలావరకు ఆ మోతాదు మీరిపోయి ఉన్నాయట. మనం వాడేది కొద్దిగానే కదా.. అనుకోవడానికి కూడా లేదు. రోజువారి వాడేది తక్కువైనా సరే.. దీర్ఘకాలంలో వీటి దుష్ప్రభావం ఉంటుంది చెబుతోంది ఈ అధ్యయం. కాబట్టి మార్కెట్లో సీసం వాడని కుంకుమనే ఎంచుకోవాలి.