Movies

బాలీవుడ్‌లో రష్మిక

Rashmika Gets Into Bollywood In A Lead Role In Bollywood Movie

టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్నరష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన ఈ చార్మింగ్‌ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సరసన హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్‌ రోల్‌ పోషించనుంది. ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు బాలీవుడ్‌ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్‌ చేశారు.