Health

థైరాయిడ్ “చింత” తీరుస్తుంది

Tamarind Solves All Thyroid Problems - Telugu Health News

చింతపండు కంటేచింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి. . చింత చిగురును ఆహారంలో కలిపితీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఇది సహజ సిద్ధమైనలాక్సేటివ్‌ గా పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి మంచి కొలెస్ట్రా ల్‌‌నుపెంచుతుంది. ఈ చిగురు ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట,వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ ఫ్లేమటరీ గుణాలుచింత చిగురులో ఉండడమే ఇందుకు కారణం. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్నచిన్ నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.జీర్ణాశయ సంబంధసమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. తరచు చింత చిగురు తింటే ఎముకలు గట్టి పడతాయి. థైరాయిడ్‌ తోబాధపడేవారు చింత చిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులకు కూడా చింతచిగురు మంచి ఔషదమట. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కి అవసరమైన పోషకాలను అందించడమేకాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురునుపేస్ట్‌‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.