Movies

పవన్ + తొమ్మిది

పవన్ + తొమ్మిది

తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఇప్పటివరకు ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే ఇకపై తన దశ మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. దానికి కారణం ఆమెకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో నటించే అవకాశం రావడమే. పవన్ కల్యాణ్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మాణంలో డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో నిధి ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొంది.ఈ సినిమా గురించి నిధి తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడింది. `అవును.. నేన పవన్ కల్యాణ్‌గారి సినిమాలో నటిస్తున్నాను. ఇలాంటి సినిమాలో అవకాశం రావడంతో నా కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఇది నా తొమ్మిదో సినిమా. ఇది నా కెరీర్లో గొల్డెన్ ఫిల్మ్ అవుతుంది. ఇక, పవన్‌గారు అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేద`ని నిధి పేర్కొంది.