Movies

రాజీవ్ కపూర్ మృతి

రాజీవ్ కపూర్ మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. చిత్ర పరిశ్రమకు మూలస్తంభంలాంటి కపూర్‌ కుటుంబంలో మరో నటుడు తుదిశ్వాస విడిచారు. గతేడాది ప్రముఖ నటుడు రిషీ కపూర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన చిన్న సోదరుడు రాజీవ్‌కపూర్‌(58) కన్నుమూశారు. ఆయన మరణ వార్తను రిషీ కపూర్‌ సతీమణి నీతూ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. రాజీవ్‌కపూర్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె తెలిపారు. ‘నా చిన్న సోదరుడిని కోల్పోయాను. ఆయన ఇకలేరు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. అయినా.. కాపాడలేకపోయాం’ అని ఆయన సోదరుడు రణ్‌ధీర్‌కపూర్‌ అన్నారు.