Politics

మంత్రి కొడాలి పిటీషన్ హైకోర్టులో రేపటికి వాయిదా-తాజావార్తలు

Kodali Nani vs SEC Nimmagadda Case Adjourned To Monday

* మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులు సమర్పించాలని ఎస్​ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.మంత్రి కొడాలి నాని మాట్లాడిన వీడియో టేపులు సమర్పించాలని ఎస్​ఈసీని హైకోర్టు ఆదేశించింది.మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

* ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కలిశారు.బంగారు అడిగలర్ ఆది పరాశక్తి చారిటబుల్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షుడు. ఆయన అనుచరులు ఆయనను ‘అమ్మ’ అని పిలుస్తారు.ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచరులు, భక్తులు ఉన్నారు.ఆయన ఆది పరాశక్తి అవతారమని ఆయన అనుచరులు, భక్తులు విశ్వసిస్తారు.దేవాలయాలు, ఆధ్యాత్మికతలలో ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

* రాష్ట్ర బి జె పి అధ్యక్షులు సోము వీర్రాజు కామెంట్స్.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కు బి జె పి , జనసేన కృషి.చెల్లి, తల్లి అక్క కుటుంబ పార్టీల కు స్వస్తి పలకడ మే బి జె పి లక్ష్యం.కేంద్ర ప్రభుత్వం సహకారం తోనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తమ గొప్పని రంగులు వేసుకుని డప్పు కొట్టుకుంటుంది.గురజాల లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కాసు డప్పాలు కొట్టుకుంటున్నారు.వాస్తవానికి మెడికల్ కాలేజీ కి నిధులు యాభై కోట్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే.పల్నాడులో అరాచక పాలన నడుస్తుంది . అభ్యర్దులు నామినేషన్ యేసే పరిస్థితి కూడా లేదు.పల్నాడు నేతలు తొడలు కొట్టుకోవడం మీసాలు తిప్పడం తప్ప అభివృద్ది శూన్యం.ఏపి లో నడి కూడి -కాళహస్తి నూతన రైల్వే లైన్ ఎక్స్ప్రెస్ హైవే వంటి రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యం.

* మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.పార్లమెంట్‌లో హైదరాబాద్ సహా ఇతర నగరాలను యూటీ చేస్తారని వ్యాఖ్యానించిన అసదుద్దీన్ తాము సమాధానం చెప్పేలోపే బయటకు వెళ్లారని విమర్శించారు.హైదరాబాద్‌తో సహా ఏ నగరాన్ని యూటీ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటును భాజపా గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.తెరాస నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమయిందని, భాజపా పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

* రేపటి నుండి దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజా ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ తప్పని సరి కేంద్రం ఉత్తరువులు జారీ చేసింది.

* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైకాపా చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి పనులు చేయడం అత్యంత దారుణమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి రాజకీయాలకు తెరలేపే పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు గంటన్నర పాటు ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులను సమర్పించాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.

* నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులందరూ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి ఉందని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.

* ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు.

* మహమ్మారి కరోనా మరింత విజృంభించకుండా.. కేసులు, మరణాల సంఖ్య మరింతగా పెరగకుండా అడ్డుకున్న అస్త్రాలు మాస్క్‌లే. వృత్తి, విద్య వంటి కారణాల వల్ల బయటకు వెళ్లాల్సిన వ్యక్తులకు మాస్కులు రక్షణ కల్పిస్తాయనే సంగతి తెలిసిందే. ఐతే వీటి వల్ల మరో లాభం కూడా ఉందని అమెరికాలో జరిగిన తాజా పరిశోధనలో వెల్లడైంది. మాస్కును ధరించటం వల్ల మనం విడిచిన ఊపిరిలోని తడి.. శ్వాస వ్యవస్థను కూడా పొడిబారకుండా ఉంచుతుందని పరిశోధకులు తెలిపారు.

* కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. అసోం ఒప్పందాన్ని మార్చేందుకు, లేదా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా, వారికి కాంగ్రెస్‌ పార్టీతో పాటు అసోం ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా, శివసాగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, ‘నో సీఏఏ’ పేరుతో ఉన్న కండువాను కప్పుకుని ప్రచారం నిర్వహించారు.

* దాఖలు చేసిన జీఎస్టీ విక్రయాల రిటర్నుల్లో లేదా జీఎస్‌టీఆర్‌-1ఫారమ్‌లో ఏమైనా తేడా లేదా అవకతవకలు ఉంటే వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేస్తారు. వారి సరఫరాదారుల రిటర్నులతో పోల్చిచూస్తే ఎటువంటి తేడాలు ఉండ కూడదు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ‘స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌’ను జారీ చేసింది.

* ప్రపంచంలోని వాహనాల్లో ఒక శాతం వాటా కలిగిఉన్న భారత్‌.. రహదారి ప్రమాద బాధితుల్లో మాత్రం ఏకంగా పది శాతం వాటా కలిగి ఉందని ప్రపంచబ్యాంక్‌ నివేదిక ఒకటి వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఒక శాతం భారత్‌లో ఉండగా, రహదారి ప్రమాద బాధితులు పది శాతం వరకు ఉంటున్నారు. దీనిపై మనం దృష్టి పెట్టాలి’’ అని ప్రపంచ బ్యాంక్‌ దక్షిణాసియా విభాగం ఉపాధ్యక్షుడు హాట్వింగ్‌ స్కాఫర్‌ శనివారం పీటీఐ ముఖాముఖిలో తెలిపారు.

* చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ధాటికి ఇంగ్లాండ్‌ 134 పరుగులకే కుప్పకూలింది. యాష్‌ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అయితే ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను 200 సార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. అతడి చేతిలో లెఫ్ట్‌ హ్యాండర్‌ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్‌ అత్యధికంగా పది సార్లు ఔటవ్వడం గమనార్హం.

* కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన న్యూజిలాండ్‌, అందులో విజయం సాధించి ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. ఇందుకోసం తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే, తాజాగా అక్కడ అధిక జనాభా కలిగిన ఆక్లాండ్‌ నగరంలో మూడు కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ నగరంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

* ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడిగించామన్నారు. మరోవైపు ఫాస్టాగ్‌ ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ అమర్చకపోతే సదరు వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

* కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన న్యూజిలాండ్‌, అందులో విజయం సాధించి ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. ఇందుకోసం తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే, తాజాగా అక్కడ అధిక జనాభా కలిగిన ఆక్లాండ్‌ నగరంలో మూడు కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ నగరంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

* చైనాకు వెళ్లి వెతకడం అంటే.. చీకట్లో తడమడం వంటిదే. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాగా తెలిసొచ్చింది. కరోనా పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొంటామంటూ చైనాకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి మొదటి నుంచి డ్రాగన్‌ చుక్కలు చూపించింది. చివరికి ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా వట్టి చేతులతో వెనక్కి పంపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చేసేదేం లేక.. ఆ వైరస్‌ పుట్టుక వూహాన్‌లో జరిగిందనే ప్రచారం చాలా దురదృష్టకరం అంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్‌ ఓ కథనంలో పేర్కొంది. వాస్తవానికి చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు చెందిన ముడి సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ డేటా ఆధారంగా అసలు వైరస్‌ పుట్టుకను నిర్ధారించవచ్చు. స్వతంత్ర దర్యాప్తు బృందానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి, చైనా శాస్త్రవేత్తలకు మధ్య చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఒక దశలో ఇరు వర్గాల శాస్త్రవేత్తల మధ్య బిగ్గరగా వాగ్వాదం చోటుచేసుకొంది.

* ప్రేమికుల దినోత్సవం ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ఈ రోజును ప్రేమికులంతా ఎంతో గొప్పగా జరుపుకొంటారు. నచ్చిన వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేస్తారు.. ప్రేమించిన వ్యక్తికి బహుమతులు ఇచ్చి ఇంప్రెస్‌ చేస్తుంటారు. బహుమతులంటే సాధారణంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంటాయి. కానీ, ఓ వ్యక్తి తన భార్యకు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కిడ్నీని గిఫ్ట్‌గా ఇచ్చాడు.

* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైకాపా చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి పనులు చేయడం అత్యంత దారుణమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి రాజకీయాలకు తెరలేపే పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకొచ్చారని.. అందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. మొదటి రెండు దశల్లో జరిగిన ఓట్ల శాతాన్ని చూస్తే.. వైకాపా పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్‌లో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. అందులో ట్రంప్‌ గట్టెక్కారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గేందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఆ బలం లేకపోవడంతో ఆయనపై అభియోగాలు వీగిపోయాయి. సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉండగా… ట్రంప్ పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో అభిశంసన నుంచి ట్రంప్‌ బయటపడ్డట్లయింది. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్లూ ఓటేయడం గమనార్హం.