Movies

₹15కోట్లతో కొత్త ఇల్లు కొనుక్కున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులు రూ.15 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. నడింపల్లి సత్యశ్రావణి నుంచి ఆయన ఈ ఇల్లు ఫిబ్రవరి 11,2021న కొనుగోలు చేసినట్లు జాప్‌కీ డాట్ కామ్( Zapkey.com) వెబ్‌సైట్ చెప్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్థులు కలిగిన ఈ భవంతి మొత్తం 9395 చదరపు అడుగుల్లో బిల్టప్ ఏరియా ఉంది. ఈ భవంతిని బాలయ్యబాబు దంపతులు ఇద్దరి పేరిట జాయింట్‌గా కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని బట్టి తెలుస్తోంది. మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.82.5లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7.5లక్షలు.