DailyDose

నూజివీడులో మరో బ్యాంకు కుంభకోణం-నేరవార్తలు

నూజివీడులో మరో బ్యాంకు కుంభకోణం-నేరవార్తలు

* కృష్ణా జిల్లా బోర్డు తిప్పేసిన మరో బ్యాంక్.చిన్నచిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ గా ఎంచుకున్న ప్రైవేట్ బ్యాంక్.సుమారు 50 లక్షల వరకు బాధితుల నుండి వసూలు చేసిన ప్రైవేట్ బ్యాంక్.కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో అమరావతి క్యాపిటల్ తో ఒక ప్రైవేటు బ్యాంకు వెలిసింది చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబం లక్ష్యంగా వీళ్ళు వ్యాపారం సాగించారు. ఈ ప్రైవేట్ బ్యాంక్ కొంతమంది ఏజెంట్లను స్థాపించి ఏజెంట్ల ద్వారా తెలిసిన వారి దగ్గర నుండి వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబాల వద్దనుండి రోజుకి వంద రూపాయల నుండి ఎంతవరకైనా కట్టుకోవచ్చని నమ్మబలికారు.రోజుకు సుమారు ఒక వ్యక్తి 500 కడితే ఒక సంవత్సరం పాటు కట్టాలని అతని టర్మ్ అయిన తర్వాత 21 రోజులు దాటిన తర్వాత 8 శాతం వడ్డీ తో అసలు వడ్డీ తిరిగి చెల్లిస్తామని ఏజెంట్ల ద్వారా నమ్మబలికారు దీంతో జనం సుమారు 150 మంది నుండి 200 మంది వరకు ఈ సంస్థలో పని చేసినట్లు తెలుస్తోంది.ఎక్కువగా బాధితులు రోజుకు 500 చొప్పున ఒక సంవత్సరం పాటు చెల్లించడం జరిగింది 8 శాతం వడ్డీ తో కలుపుకుని సంవత్సరం పాటు కడితే సుమారు ఒక లక్షా 92 వేల రూపాయలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు.సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అసలు కానీ వడ్డీ చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు సుమారు నూజివీడులోని 150 నుండి 200 మంది కట్టినట్టుగా తెలుస్తోంది దీంతో మొత్తం 50 లక్షల వరకూ డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక ఎస్ఐ గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ పిల్లర్లకు ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందే కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. దట్టమైన పొగ చుట్టూరా కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పొగ కారణంగా చుట్టు ప్రక్కల ప్రాంతాలోని కొందరు స్థానికులు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అగ్ని ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సబంవించినట్లు తెలస్తోంది.

* గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారి పై హోలిక్రాస్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనిఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.సమాచారం మేరకు తడ శ్రీసిటీ సెజ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న దేవిరెడ్డి నర్సింహులు కలువాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.మరో మృతుని సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ. కాసుల శ్రీనివాసులు తెలిపారు.

* గుండెపోటుతో కండక్టర్ మృతి విసన్నపేట స్థానిక విజయవాడ బస్టాండ్ నుండి కుదప,మాధవరం వయా విజయవాడ వెళ్ళు బస్సు లో ఇ సి హెచ్ కృష్ణయ్య గుండెపోటు రావడంతో మైలవరం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన మరణించినట్లు ఆర్టీసీ వర్గాలు ధ్రువ పరిచాయి. శుక్రవారం ఉదయం బాడవ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.