Movies

మహాత్ముని కూడా వదలని కంగనా

మహాత్ముని కూడా వదలని కంగనా

‘జాతిపిత తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరుతెచ్చుకున్నారు. తన భార్య అతిధుల మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు ప్రస్తావనలు ఉన్నాయి. అయినప్పటికి గాంధీజీ జాతిపిత అయ్యారు. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయిన ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అంటూ కంగనా ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇది వరకు కంగనా సాధారణ వ్యక్తులను సినీ, రాజకీయ ప్రముఖలను మాత్రమే టార్గెట్‌ చేయడంతో అంతా ఆమె తీరు ఇంతెనంటూ ఉరుకునేవారు. కానీ ఈసారి గాంధీపై ఆమె విమర్శ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు కంగనాపై మండిపడుతున్నారు. కంగనా మితిమీరి ప్రవర్తిస్తోందని, ఇలాగే వదిలేస్తే ఆమె మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.