Movies

బాబుతో పూజ

బాబుతో పూజ

మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాయికగా పూజాహెగ్డేని తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపిందట. స్క్రిప్టు విన్న పూజా సానూకూలంగా స్పందించిందట. త్వరలోనే మహేష్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.