Health

జూన్ చివర వరకు లాక్‌డౌన్-TNI కోవిద్ బులెటిన్

జూన్ చివర వరకు లాక్‌డౌన్-TNI కోవిద్ బులెటిన్

* జూన్ చివరివరకు లాక్ డౌన్ పెట్టాలని రాష్టాలకు సూచించిన కెంద్రం.

* దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా రెండులక్షల లోపు కొత్తకేసులు వెలుగుచూశాయి. 44 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు కనిష్ఠానికి చేరుకున్నారు. రెండోరోజు మరణాలు నాలుగువేల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల కేసులు తగ్గుతూ, రికవరీ రేటు మెరుగుపడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
* థాయ్ లాండ్ నుండి తెలంగాణ కు దిగుమతి అవుతున్న క్రయోజనిక్ ట్యాంకర్లు

* కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పలు ఆస్పత్రులు కనీస మానవత్వం మరిచి కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తప్పు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీచేయడం, జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే, ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

* నేడు ఏపీ లో నమోదైన మొత్తం కరుణ కేసులు 14429