NRI-NRT

అమెరికాలో లైంగిక దాడి కేసు. జీవితాన్ని నాశనం చేసుకున్న తెలుగు వ్యక్తి దుర్బేసుల శివ.

అమెరికాలో లైంగిక దాడి కేసు. జీవితాన్ని నాశనం చేసుకున్న తెలుగు వ్యక్తి దుర్బేసుల శివ.

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన దుర్బేసుల శివకుమార్(29)కు నార్త్ కరోలినా కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు, విడుదల అనంతరం 10ఏళ్ల పర్యవేక్షణ, 5వేల డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2019 మార్చిలో న్యూయార్క్ సబ్‌వేలో ఒక రైలులో యువతిపై లైంగిక దాడి చేసి పారిపోతుండగా ఆమె వీడియో తీసి పోలీసులకు అందజేసింది. ఆ కేసు విచారణలో ఉండగానే మూడు నెలల అనంతరం జూన్ 2019లో చికాగో నుండి దక్షిణ కరోలినాలోని మర్టిల్ బీచ్‌కు విమాన ప్రయాణం సందర్భంగా మరో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ రెండు కేసులను విచారించిన ఉత్తర కరోలినా కోర్టు అతడికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. న్యూయార్క్‌కు చెందిన జొరియా హౌజింగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా శివ పని చేసేవాడు.

Official Justice Department Statement: https://www.justice.gov/usao-wdnc/pr/man-convicted-abusive-sexual-conduct-aboard-airplane-sentenced-two-years-prison