Movies

వర్జీనియాలో అభిమానులతో రజనీ

వర్జీనియాలో అభిమానులతో రజనీ

ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో కొన్ని ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న అభిమానుల‌తో క‌లిసి ఉన్నారు. అమెరికాలోని వెస్ట్ వ‌ర్జీనియాలో అభిమానులను ఆయన కలుసుకున్నారు. మాయో క్లినిక్‌లో ఆరోగ్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజనీ ప్రస్తుతం అక్కడే పర్యటిస్తున్నారు. 2016లో ఆయన కిడ్నీ మార్పిడి చేసుకున్నప్పటి నుండి యూఎస్‌కు రెగ్యుల‌ర్‌గా వెళ్తున్నారు. జూన్ 19న భార్య ల‌త‌తో క‌లిసి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన ఈ సూప‌ర్‌స్టార్‌.. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారు. వెస్ట్ వర్జీనియా పర్యటనలో అభిమానుల‌తో ఆయన మాట్లాడి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలే ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.