Politics

రజనీకాంత్ పార్టీ రద్దు-తాజావార్తలు

రజనీకాంత్ పార్టీ రద్దు-తాజావార్తలు

* రజనీ మక్కల్ మండ్రం రద్దు.తాను రాజకీయాల్లోకి రావట్లేదని మరోసారి స్పష్టం చేశారు సూపర్​స్టార్ రజనీకాంత్.అలాగే రజనీ మక్కళ్​ మండ్రం(ఆర్ఎంఎం)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఆర్ఎంఎం నిర్వాహకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశమయ్యారు.అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.రజనీ అభిమాన సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తలైవా వెల్లడించారు.రజనీ మక్కళ్​​ మండ్రం సభ్యులూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను.

* ఉత్తర భారతంలో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి.ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 68 మంది మృతి చెందినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.ఈ ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే జీవనాధారమైన పశుసంపదను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.మధ్యప్రదేశ్‌లో కూడా పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రాజస్థాన్‌లో 20 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

* భారత్​లో కరోనా కేసులు ఆదివారంతో పోల్చితే భారీగా తగ్గాయి.కొత్తగ 37,154 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారిన పడి 724 మంది ప్రాణాలు విడిచారు.కొత్తగా 39,649 మంది వైరస్​ను జయించారు. రికవరీ రేటు 97.22 శాతానికి చేరుకుంది.మొత్తం కేసులు:3,08,74,376 మొత్తం మరణాలు: 4,08,764 కోలుకున్నవారు: 3,00,14,713 యాక్టివ్​ కేసులు: 4,50,899 దేశంలో ఇప్పటివరకు 37,73,52,501 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.ఆదివారం ఒక్కరోజే 12,35,287 డోసులు అందించినట్లు తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,73,711 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 6,508 మంది చనిపోయారు.కాగా 3,55,037 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 187,620,804గా ఉంది.అమెరికా – 34,732,753 బ్రెజిల్​ – 19,089,940 ఫ్రాన్స్​ – 5,812,639 రష్యా – 5,783,333యూకే-5,121,245

* మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోనున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేలం పాట కోసం శనివారం అప్పు మొత్తాన్ని నోటిఫై చేసింది.ఈ నెల 13న వేలం జరగనుంది. 30 ఏళ్ల దీర్ఘకాలిక రుణం కింద రూ.2,000 కోట్లు తీసుకోనుంది.

* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు.

* పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన భాజపా నేతల బృందం. పోలవరం ప్రాజెక్ట్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బృందం సందర్శించింది. ప్రాజెక్ట్‌ వివరాలు అందించిన అధికారులు నీటిమట్టం ఏ మేరకు పెరిగితే ముంపు ప్రాంతాలపై వరద ప్రభావం ఉంటుందో సోమువీర్రాజు బృందం అధికారులతో చర్చించింది.

* వి.హెచ్ కు వెంకయ్యనాయుడు ఫోన్..మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హెచ్ ను ఫోన్ చేసి పరామర్శించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు..అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న వి. హెచ్..ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెకుసుకున్న వెంకయ్య నాయుడు..డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పిన వెంకయ్య నాయుడు..ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని చెప్పిన వెంకయ్య నాయుడు.తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపిన వి.హెచ్..మీ పరామర్శతో నాకు చాలా ఉత్సాహం వచ్చిందని చెప్పిన వి.హెచ్.

* ఎంపీ రఘురామ పై వైకాపా ఎంపీలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ మీద లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్ బిర్లా స్పందించారు.పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందన్నారు.నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.

* జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు.

* ఏఐసీసీ పిలుపు మేరకు నేడు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు .