Movies

అఖండ క్లైమాక్స్ రెడీ

అఖండ క్లైమాక్స్ రెడీ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ కోసం చిత్రబృందం లొకేషన్స్‌ వేటలో పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో క్లైమాక్స్ చిత్రీకరణ చేసేందుకు నిర్ణయించుకుంది. కాగా, శుక్రవారం ఉదయం క్లైమాక్స్‌ షూట్‌ షురూ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ఫొటోని అందరితో పంచుకుంది. ఇందులో బాలయ్యకు సీన్‌ వివరిస్తూ బోయపాటి కనిపించారు. స్టంట్‌ మాస్టర్‌ శివ నేతృత్వంలో జరగనున్న ఈ షూట్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన వేరియేషన్స్‌లో కనిపించనున్నారు.