Movies

సూక్తులు చెప్తున్న శిల్పా

సూక్తులు చెప్తున్న శిల్పా

బాలీవుడ్ భామ శిల్పాశెట్టి చాలా రోజుల త‌ర్వాత తిరిగి సూప‌ర్ డ్యాన్స‌ర్-4 రియాలిటీ షో సెట్స్‌లో అడుగుపెట్టింది. దాదాపు ఓ నెల రోజులుగా త‌న భ‌ర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్ర‌ఫీ కేసు కార‌ణంగా ఆమె సూప‌ర్ డ్యాన్సర్-4 సెట్స్‌కు రాలేదు. తాజాగా ఈ సూప‌ర్ డ్యాన్స‌ర్‌-4 రియాలిటీ షో త‌ర్వాత ఎపిసోడ్‌కు సంబంధించిన‌ షూటింగ్ జ‌రిగింది. దానికి సంబంధించిన ఫొటోషూట్ పిక్చ‌ర్స్‌ను శిల్పాశెట్టి త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో శిల్పాశెట్టి నీలం-ఊదా రంగుల క‌ల‌బోత‌తో ఉన్న చీర‌లో మెరిసిపోతున్న‌ది. ఈ ఫొటోతోపాటు శిల్పాశెట్టి ఒక ప‌వ‌ర్‌ఫుల్ సందేశం కూడా ఇచ్చింది. దేర్ ఈజ్ నో ఫోర్స్ మోర్ ప‌వ‌ర్‌ఫుల్ దేన్ ఎ విమెన్ డిట‌ర్మైండ్ టు రైజ్ అంటే ఎద‌గ‌ద‌ల్చుకున్న మ‌హిళ కంటే బ‌ల‌మైన శ‌క్తి మ‌రేది లేద‌ని త‌న పోస్టుకు క్యాప్ష‌న్ ఇచ్చింది. సోనీ టీవీ కూడా ఇటీవ‌ల త‌మ సూప‌ర్ డ్యాన్స‌ర్-4 రియాలిటీ షోకు సంబంధించిన త‌ర్వాత ఎపిసోడ్ ఫొటోల‌ను ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండిల్‌లో పెట్టింది.