Business

TNI నేటి వాణిజ్య వార్తలు నష్టాల్లో మార్కెట్లు 29-Nov-2021

TNI నేటి వాణిజ్య వార్తలు నష్టాల్లో మార్కెట్లు 29-Nov-2021

* ముంబయి: కొవిడ్‌-19 వేరియంట్‌ (ఒమిక్రాన్‌)పై భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 233 పాయింట్లు నష్టపోయి 56,874 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91.50 పాయింట్ల నష్టంతో 16,935 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.86గా ఉంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, హీర్‌ మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, ఎం అండ్‌ ఎం నష్టాలను చవిచూస్తున్నాయి.

* Bitcoin: దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని ఆమె హౌస్‌లో వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ. రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలోనే సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. ఒకవైపు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ను భారత ప్రభుత్వం నిషేధించబోతోందని చర్చ జరుగుతుండానే. మరోవైపు సింగపూర్-బెస్ట్ వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఎక్స్‌చేంజ్ పేరు కాయిన్‌స్టోర్ తన వెబ్, అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

* మమ్మల్ని ‘విలన్లు’గా చూస్తే ఎలా?

వివిధ దేశాలపై దక్షిణాఫ్రికా మండిపాటు

జోహెన్నెస్‌బర్గ్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయంతో.

తమ దేశం నుంచి ప్రయాణాలపై 18 దేశాలు నిషేధం విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ (సామా) తప్పుపట్టింది. ఈ చర్యను ‘అనాలోచిత ప్రతిస్పందన’ అంటూ మండిపడింది. ప్రపంచం కీలకమైన వైద్య సమాచారాన్ని ‘పారదర్శకం’గా తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి విధానాలను మానుకోవాలని సూచించింది. ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలోనే బయటపడటంతో పాటు, దీన్ని ‘ఆందోళనకర రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై వివిధ దేశాలు నిషేధం విధించాయి. దీనిపై సామా ఛైర్‌పర్సన్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ స్పందిస్తూ ఓ టీవీ ఛానెల్‌తో ఆదివారం మాట్లాడారు. కొత్త వేరియంట్‌ నుంచి ముప్పు ఏస్థాయిలో ఉందన్న విషయమై ఇంతవరకు తగినంత సమాచారమేదీ లేకుండానే 18 దేశాలు నిషేధం విధించాయని. ఈ రకాన్ని కనుగొన్న తమను ‘విలన్లు’గా చూడటం సరికాదని, ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రకటించినందుకు తమ దేశాన్ని ప్రశంసించాలి తప్ప. ఇలా వ్యవహరించరాదని అన్నారు.
”మా శాస్త్రవేత్తలు అత్యంత అప్రమత్తంగా ఉండటంతో పాటు విస్తృతంగా జన్యుక్రమ పరిశీలన జరపడంతోనే ఇది బయటపడి ఉండొచ్చు. ఐరోపా దేశాలు దీన్ని గుర్తించలేకపోవచ్చు. ఒమిక్రాన్‌ లక్షణాలు డెల్టా వేరియంట్‌ మాదిరిగా కాకుండా. బీటా రకంలా ఉన్నాయి. ఒక్కసారిగా యువతలో. ప్రత్యేకించి పురుషుల్లో తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు సమస్యలు వంటి కొత్త లక్షణాలను గుర్తించడంతో వారికి పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది.