DailyDose

TNI నేటి తాజా వార్తలు 2-Dec-2021

* వనపర్తి జిల్లా:

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ జాతీయ రహదారి 44 పై గల పంట పొలాలు ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గద్వాల్ నుండి హైదరాబాద్ వెళ్ళు మార్గంలో రంగాపూర్ గ్రామం వద్ద కాసేపు ఆగి మినుము వేరుశనగ పంట రైతులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలు వెయ్యాలని సూచన. వరి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాగిస్తే ఆశించిన లాభాలు ఉంటాయన్న ముఖ్యమంత్రి. ఈ సందర్శనలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్, రెడ్డి శ్రీనివాస్ గౌడ్, వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష జిల్లా అధికారులు ఉన్నారు.

* జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ 95 రైళ్లు రద్దు

నేటి నుంచి మూడు రోజుల పాటు కోస్తా రైల్వే రద్దు చేసిన రైళ్ల

12508 సిల్చర్-త్రివేండ్రం సెంట్రల్
12509 బెంగుళూరు కంటోన్మెంట్-గౌహతి
22641 త్రివేండ్రం-షాలీమార్
15905 కన్యాకుమారి-దిబ్రుఘర్
12844 అహ్మదాబాద్-పూరి

03.12.2021 తేదీన రద్దైన రైళ్లు:

18417 పూరి-గుణుపూర్
20896 భువనేశ్వర్-రామేశ్వరం
12703 హౌరా-సికింద్రాబాద్-ఫలక్ నుమా
22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్
12245 హౌరా-యశ్వంత్ పూర్-దురంతో
11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్
22605 పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్
17479 పురీ-తిరుపతి
18045 హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్
12841 హౌరా-చెన్నై కోరమండల్
22817 హౌరా-మైసూర్ వీక్లీ
22807 సంత్రగాచ్చి-చెన్నై
22873 డిగా-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్
12863 హౌరా-యశ్వంత్ పూర్
12839 హౌరా-చెన్నై మెయిల్
22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్
17244 రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్
20809 సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్
18517 కొర్బా-విశాఖ
13351 ధన్ బాద్-అలిప్పీ
12889 టాటా-యశ్వంత్ పూర్
12843 పూరీ-అహ్మదాబాద్
18447 భువనేశ్వర్-జగదల్పూర్
12842 చెన్నై-హౌరా
18046 హైదరాబాద్-హౌరా
12829 చెన్నై-భువనేశ్వర్
12246 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో
12704 సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా
17480 తిరుపతి-పూరీ
12864 యశ్వంత్ పూర్-హౌరా
17016 సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌
12840 చెన్నై-హౌరా
18048 వాస్కో-హౌరా
12664 తిరుచురాపల్లి-హౌరా
18464 బెంగళూర్-భువనేశ్వర్
11019 ముంబై-భువనేశ్వర్
18518 విశాఖ-కొర్బా
18528 విశాఖ-రాయగఢ్
17243 గుంటూరు-రాయగఢ్
18448 జగడల్ పూర్-భువనేశ్వర్
20838 జునాఘర్ రో డ్-భువనేశ్వర్

4వ తేదీన రద్దైన రైళ్లు:

18463 భువనేశ్వర్-ప్రశాంతి నిలయం
18637 హాటీయా-బెంగుళూరు
22819 భువనేశ్వర్-విశాఖ
17015 భువనేశ్వర్-సికింద్రాబాద్
18418 గుణపూర్-పూరీ
12807 విశాఖ-నిజాముద్దీన్-సమత ఎక్స్ ప్రెస్
18551 విశాఖ-కిరండోల్ ఇలా.. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

* భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్ అక్కడే రెండు కేసులు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో వెలుగుచూసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని, ఆ రెండూ కర్నాటకలో నమోదు అయినట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త వేరియంట్ గతవారం దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలో 29కి పైగా దేశాలకు వ్యాపించింది.

* దక్షిణభారత నటి సిల్క్ స్మిత గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం.

జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో
గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో

మోమటుదాచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ఈవేళ
మరియాదకు విరిపనుపు సవరించవేమిరా

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నారతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

సాహిత్యం… వేటూరి
సంగీతం…. ఇళయరాజా
గానం…… జిక్కి
చిత్రం…… ఆదిత్య 369

విజయలక్ష్మి 1960, డిసెంబరు 2 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. ‘స్మిత’ అని తెరపేరు ధరించింది. సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం).

* నేనున్నాను ధైర్యంగా ఉండండి: వరద బాధితులతో జగన్‌

కడప: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో బాధితులతో సీఎం మాట్లాడారు. గ్రామంలో తిరుగుతూ వారిని పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జగన్‌ను వేడుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ‘నేనున్నాను.. ధైర్యంగా ఉండండి’ అని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన రూ.90వేల సాయం సరిపోదని.. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత నాది.. అన్ని విధాలుగా ఆదుకుంటానని జగన్‌ వారికి చెప్పారు. అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.

* న్యూఢిల్లీ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటం అయినా చేసిందా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా పోరాడుతున్నారని, ఏపీ సమస్యలను వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

* పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

అమరావతి :

డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్‌ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది. మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్‌ చేసి చలాన్‌ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్‌పీని ఆదేశించింది.

తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్‌ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్‌ పెట్టుకోలేదని, సెల్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్‌ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్‌ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్‌ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్‌ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్‌ చేస్తూ చలాన్‌ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.