DailyDose

TNI నేటి నేర వార్తలు 7-Dec-2021

TNI నేటి నేర వార్తలు 7-Dec-2021

* ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతు పంటను కొనుగోలు చేయకుండా యాసంగి లో ఓరి వేసుకునే అవకాశం కల్పించకుండా రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే పంటను కొనుగోలు చేయాలని యాసంగి వరి పంట వేసుకునే విధంగా అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చెశారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై ఇరోజు నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

* ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని,పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల నాయకులు రైతులు పాల్గొన్నారు.

* మాకు న్యాయం కావాలి, మా పాఠశాలకు వెంటనే నీళ్ళు రావాలి, మాకు న్యాయం జరిగే వరకు పారోటం ఆగదు అంటూ చిన్న పిల్లలు ధర్నా చేసిన వింత ఘటన ఇది గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వారం రోజులుగా పాఠశాలలో కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాథిరెడ్డిపెల్లి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల దుస్థితి ఇది. ఈ పాఠశాల లో దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు చదువుతూ, వసతి ఉంటున్నారు. కాగా వారం రోజులుగా ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్‌లో కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి కూడా నీరు లేకపోవడంతో తల్లిదండ్రులను రప్పించి బట్టలను ఇంటికి పంపుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అధికారుల నిర్లక్ష్యం వలన పొందలేక పోతున్నామని విద్యార్థులు ఆవేధన వ్యక్తం చేశారు.

ఆశ్రమ పాఠశాలలో ఉండే విద్యార్థుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. వసతి గృహాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ప్రభూత్వం చెబుతుందని, కానీ అధికారులకు సదరు హాస్టల్లో తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంపాండ్ వాల్ లేకుండా, ఊరి కి చివరన ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విద్యార్థులకు, కనీసం వౌలిక సదుపాయాలు కూడా అందించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వెంటనే నీటి వసతి కల్పించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

బైట్స్

ఆగబోయిన రవి (తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు)

కుంజా నర్సింహరావు అదీవాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు)

జాన్ (విద్యార్థి)

జగన్ (విద్యార్థి)

అరవింద్ (విద్యార్థి)

* సర్పంచ్ ముందుండి దాతల నుండి ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం ఇప్పించిన ప్పటికీ పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టించుకోవడంలేదని ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకోవడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదని స్థానిక సర్పంచ్ గురిజాల శ్రీ రామ్ రెడ్డి విమర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామెర మండలం ఏర్పడి ఐదు సంవత్సరాలు అయ్యింది గ్రామపంచాయతీ అద్దె భవనంలో కొనసాగుతుంటే ఎంపీడీవో కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ స్టేషన్ తాసిల్దార్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతుంది.

నూతన మండలం ఏర్పడ్డాక ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు చల్ల ధర్మారెడ్డి స్థలం లేదని తప్పించుకున్నాడు నేను ముందుపడి రెండు ఎకరాల స్థలాన్ని దాత ద్వారా ఇప్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటి వరకు నూతన భవనాలను నిర్మించే పరిస్థితి ఎమ్మెల్యే గారికి లేకపోవడం సిగ్గుచేటన్నారు మా ఎమ్మెల్యే కు కాంట్రాక్టు పనులు చేయడం దాచుకోవడం తెలుసు తప్ప అభివృద్ధి చేయడం మర్చిపోయారు అన్నారు నేటి వరకు దామెర లో అభివృద్ధి అనేది శిలాఫలకలకు పరిమితమయ్యాయి అని దుయ్యబట్టారు నాడు హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గొప్పలు చెప్పి ప్రగల్బాలు

పలికిన చల్ల మీ సొంత నియోజకవర్గం దామెర మండలా అభివృద్ధి కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం కష్టాలు పడి అప్పులు తీసుకోవచ్చు అభివృద్ధి కోసం పాటు పాడుతు అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే మూడు నెలల నుండి ఒక్క చెక్కు రిలీజ్ కావడం లేదు గ్రామ అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు రెండుసార్లు ఎమ్మెల్యేలగా గెలిపించిన దామెర ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన ప్రభుత్వ భవనాలకు శ్రీకారం చుట్టాలని సర్పంచులు అప్పుల బాధతో ఉరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సకాలంలో చెక్కులు రిలీజ్ అయ్యేలా చొరవ తీసుకోవాలని దామెర మండల అభివృద్ధికి పాటు పడాలని డిమాండ్ చేశారు.

బైట్ గ్రామ సర్పంచ్ గురిజాల శ్రీ రామ్ రెడ్డి

* పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం తో 7 వ తరగతి విద్యార్థిని జ్వరం తో మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహం తో పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ జిల్లా లో జరిగింది.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బానోతు నందిని అనే 14 సంవత్సరాల బాలిక ఏడవ తరగతి చదువుతోంది. 10 రోజుల నుండి తీవ్ర జ్వరం తో ఇబ్బందులు పడుతున్నా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురు అనారోగ్యానికి గురైన విషయాన్ని తమకు ఉపాధ్యాయులు ఆలస్యంగా తెలిపారన్నారు. తీవ్రంగా అస్వస్థత గురైన నందిని ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అప్పగించటం తో వారు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలింంచారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందటం తో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం తోనే నందిని మృతి చెందిందని మృత దేహం తో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

* విశాఖ:

ఏపీ ఎన్ జీ వో రాష్ట్ర అద్యక్షుడు బండి శ్రీనివాస్ కామెంట్స్…

13 లక్షల ఉద్యోగులు, పెన్షనర్ల 71 డిమాండ్ లకు సంబంధించి దఫ దఫాలుగా చీఫ్ సెక్రటరీ ని కలవడం జరిగింది.

తిరుపతి లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పీ ఆర్ సీ పై హామీ ఇవ్వడం సంతోషం.

మేము 71డిమాండ్ లు ఇస్తే వీటిపై క్లారటీ లేదు. ముఖ్యమంత్రి ప్రకటన కంటే ముందే మా కార్యాచరణ ప్రకటించాం.

రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి ఉద్యమం. విశాఖ జిల్లా నుండి ఉద్యమం ప్రారంభం చేయడం అదృష్టం గా భావిస్తున్నాను.

సజ్జల రామకృష్ణ రెడ్డి అక్టోబర్ నెలాఖరు నుంచి పీ ఆర్ సీ అమలు అని చెప్పి, ఇవ్వలేదు.

జీతాలు సక్రమంగా రావడం లేదు. పెన్షనర్ల కు కూడా రెండు నెలలు గా మాత్రమే పడుతున్నాయి.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో పీ ఆర్ సీ నివేదిక ఇవ్వలేదు. ఎందుకు నివేదిక దాస్తున్నారు అర్థం కావడం లేదు.

యాబై శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేశాం. అనేక డిమాండ్ లకు సంబంధించి అశోక్ మిశ్రా ఎంత శాతం ఇచ్చారో తెలపాలీ.

ప్రధాన నగరాలలో ఉద్యోగులు కు 30శాతం హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఇప్పటికి నివేదిక ఇవ్వలేదు.

జీపీఎఫ్, ఏపీ జి యల్ ఏ బిల్లుల పెండింగులో వున్నాయి 1600కోట్లు రూపాయలు వరకూ.

కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేశాం. ప్రభుత్వానికి మా పై కనికరం లేదనేది కనిపిస్తుంది.

10వ తరగతి చదివిన ఏ ఎన్ ఎం కి ట్యాబ్ ఇచ్చి, ఫీల్డ్ వర్క్, హాజరు పట్టి లో బయో మెట్రిక్ తదితర ఇబ్బందులు.

143 జీవో ప్రకారం వైద్య శాఖ ఉద్యోగులు ని సరెండర్ చేస్తూ న్నారు. వీరిని ఏం చేస్తారో తెలియదు.

ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధికారులు పని చేసేలా చేయాలని.

4వ తరగతి ఉద్యోగులు వయోపరిమితి 62 కి పెంచాలి.

కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్. సీపీయస్ రద్దు చేయాలని డిమాండ్.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ను అక్టోబర్ లో రెగ్యులర్ చేస్తామని చేయలేదు కారణం తెలపాలి.

అయిదు వేల మంది వరకు కోవిడ్ సమయంలో చని పోయారు.

1వ తారీఖు జీతాలు ఇవ్వడం లేదు. సి ఎఫ్ ఎమ్ ఎస్ వలన తీవ్ర ఇబ్బందులు. గత ప్రభుత్వ విదానాలను రద్దు చేయాలి.

ఔట్ సోర్సింగ్ వారికి ఉద్యోగం భద్రతా లేదు. జీతం పెరగడం లేదు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లు కు అందరు ఉద్యోగులు సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదములు.

పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ లు నెరవేర్చాలి.

కొన్ని చానల్స్ లో వక్రీకరించి,ప్రభుత్వం ని గద్దె దించుతామని చెప్పిన మాటలు అంతర్ఘత సమావేశంలో మాట్లాడిన మాటలను ట్రోల్ చేయడం దారుణం.

ముఖ్యమంత్రి పీ ఆర్ సీ పై తిరుపతి లో మాట ఇచ్చారు అంటే మా పై సానుకూలంగా వున్నారనే బావిస్తున్నా.

అమరావతి జేఏసీ అద్యక్షుడు ఫణి పేర్రాజు కామెంట్.

రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం తీవ్ర తరం.

ఉద్యమాన్ని ఏ పరిస్థితి లలో చేస్తున్నాం అనేది ప్రభుత్వం తెలుసుకుంది. ఉద్యమం తరువాత మాత్రమే గవర్నమెంట్ లో మాట్లాడుతున్నారు.

మూడు మీటింగ్ లు పెట్టారు తప్ప చర్చలు జరగడం లేదు.

ప్రభుత్వం స్పందించకపోతే, రెండవ స్థాయి ఉద్యమాలు తప్పవు.

గవర్నమెంట్ కి ఫేవరనో, ప్రతి పక్షాలు కి ఫేవరనో బావించవద్దు.

గొంతెమ్మ కోర్కె లు కాదు. ఇక్కడ జేఏసీ చైర్మన్ గా చేసిన గోపాల్ రెడ్డి స్టేట్ మెంట్ హాస్యాస్పదం.

మీటింగ్ లో అధికారులు చెప్పారు ఒకటో తేదీన ఇస్తామని హామీ ఇచ్చారు అంటే సరి గా రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు పంచి ఊడగొడతాం అని గోపాల్ రెడ్డి అనలేదా దాచుకున్న డబ్బులు అడిగితే ఇవ్వలేక పోతున్నారు.

పీ ఆర్ సీ పై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ 71 డిమాండ్ లలో ఇది ఒక డిమాండ్ మాత్రమే.

22సంవత్సరాల గా కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు. తక్షణమే పర్మినెంట్ చేయండి.

కార్యచరణ ప్రకారం ఉద్యోగులు అంతా ఉద్యమం లో పాల్గొనాలి.

సెక్రటేరియట్ ఎంప్లాయిస్, రెవెన్యూ, ఏపీ జేఏసీ, గతంలో ఇవన్నీ ఒకే జేఏసీ గా వుండేవారు. అప్పటి నేత పై బేదాబి.

106 సంఘాలు, అమరావతి జేఏసీ లో 90 వున్నారు.

పేపర్ స్టేట్ మెంట్ లు ఇచ్చే కొన్ని సంఘాలు వున్నాయి.

* ఫ్లాష్ ..ఫ్లాష్ …ఫ్లాష్.

శ్రీకాళహస్తి…. బ్రేకింగ్.

? చిత్తూరు జిల్లా ప్రవేశించిన అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర .

?శ్రీకాళహస్తి రూరల్ మండలం జగ్గారాజు పల్లి వద్ద చిత్తూరు జిల్లాలో కి ప్రవేశం

?పాదయాత్రకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన టిడిపి నాయకులు.

? గుంటూరు ,ప్రకాశం ,నెల్లూరు, జిల్లాలలో 36 రోజులు పాదయాత్ర ముగించుకుని 37వ రోజు చిత్తూరు జిల్లాకు…..

? ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సహకరించండి అంటూ ఫ్లెక్సీలతో తిరుపతి అర్బన్ పోలీసులు

? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్న శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ ధర్మారెడ్డి సిబ్బంది.

* 16 మంది మావోయిస్టులు లొంగుబాటు.

లొంగిపోయిన మావోయిస్టులతో ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌, పోలీసు అధికారులు.

దుమ్ముగూడెం:- ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా కిరండూల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొట్రెం గ్రామానికి చెందిన 16 మంది మావోయిస్టులు శనివారం జిల్లా ఎస్పీ డా.అభిషేక్‌ పల్లవ్‌ ఎదుట లొంగిపోయారు.

అడవి బాట పట్టిన మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు లోన్‌వర్త్‌ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఉద్యమంపై విరక్తి చెందిన 16 మంది మావోయిస్టులు పోలీస్‌ అధికారుల ఎదుట లొంగిపోయారు.

వీరంతా దండకారణ్య ప్రాంతంలో జరిగిన అనేక విధ్వంసక, హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. వీరికి ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించడంతోపాటు ప్రోత్సాహక నగదు అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు.

మావోయిస్టు పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వారోత్సవాలు జరుగుతున్న సమయంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఉద్యమానికి ఎదురుదెబ్బగా పోలీసువర్గాలు భావిస్తున్నాయి.

* అంగన్వాడీ కోడి గుడ్డు..
గుడ్డులో  పిల్లా….
ఉడికించరా…?
మారేడు బాక లో ఘటన…
చిన్నారులకు బాలింతలకు పంపిణీ…

మండపేట:- అంగన్ వాడి లో సరఫరా అయ్యే కోడిగుడ్ల నాణ్యత పై ఎన్నో ఆరోపణలు వస్తూఉంటాయి. వీటిని సరఫరా చేసే కమిషన్ ఏజెన్సీ ల నిర్వాకం ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనారోగ్యం కలగజేస్తుంది. ఏకంగా ఉడకబెట్టి ఇచ్చిన గుడ్డు లో కోడి పిల్ల ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారులు పత్తా లేకపోవడం గమనార్హం. ఈ గుడ్లు ఘటన మండపేట మండలం మరేడు బాక పరిధిలో పార్వతి నగర్ లో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు ప్రభుత్వం అంగన్ వాడి పరిధిలో చిన్నారులతో బాటు గర్భిణీ, బాలింత లకు ప్రతి రోజు ఉడకబెట్టిన కోడి గుడ్లు అందిస్తుంది. పౌష్టికాహారం గా పేదలకు ప్రభుత్వం ఇది అందిస్తుంది. దీనికి సంబంధించి ఏజెన్సీ లు గుడ్లు సరఫరా చేస్తాయి.

ఈ నేపథ్యంలో మండపేట మండలం మరేడు బాక పంచాయితీ పరిధిలోని పార్వతి నగర్ ఏరియా పెట్రోల్ బంక్ వెనుక వీధిలో సుమారు 30 మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇంటింటికి వెళ్లి అంగన్ వాడి టీచర్ గుడ్లు అందజేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాటిని తీసుకున్న వారు ఆ గుడ్డు పై పెంకు తీస్తే లోపల ఉడికి పోయిన కోడి పిల్ల కనిపించింది. దీంతో తక్షణమే టీచర్ ను నిలదీశారు. దీంతో వెంటనే ఆమె అందరి నుండి గుడ్లు వెనక్కి తీసుకున్నట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. దీనిపై స్థానిక పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా నిల్వ గుడ్లు కావడం తో పిండం మాంసం రూపంలో తయారై పిల్ల గా మారిందని వైద్యులు చెబుతున్నారు. నిల్వ గుడ్లు తింటే పౌష్టికాహారం మాట అటుఉంచితే లేనిపోని రోగాల బారిన పడటం ఖాయమని పేర్కొన్నారు.

వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై వివరణ కు ప్రయత్నం చేయగా సంబంధించిన ఐ సి డి ఎస్ ప్రాజెక్టు(కపీలేశ్వరపుం) అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధించిన అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

* ?ప్లాష్.. ?ఫ్లాష్..?

?విద్యుత్ ఘాతంతో ఏనుగు మృతి.
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, వేపనపల్లి గ్రామ చెరువు సమీపంలో ఉన్న పొలంలో అమర్చిన విద్యుత్ కంచె తగిలి ఏనుగు మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు.

ఐరాల సుబ్రమణ్యం అనే రైతు పొలం సమీపంలో సంఘటన జరిగిందని గ్రామస్థులు చెప్పారు.

* వరంగల్ ఖిలా వరంగల్ అగడ్త చెరువు రాతి కోట సమీపంలో వేపపుల్ల విరుస్తున్న క్రమంలో రాతికోట పై నుండి ప్రమాదవశాత్తు కిందపడ్డ వాకర్స్. విశ్రాంత ఉద్యోగి ( ఫైర్ మెన్ ) సొమప్ప మృతి. లక్ష్మీ నారాయణ అనే మరో వ్యక్తి కి గాయాలు అయిన వ్యక్తిని ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న ఫైర్ సిబ్బంది.

* తిరుపతి:

రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ.

52 గ్రాముల బంగారం, లక్షకుపైగా వెండి సామాగ్రి అపహరణ .

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ తేజశ్రీ అపార్ట్మెంట్ 505 లో ఘటన.

ప్రసన్న కుమార్ తన భార్యతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లి నేడు తిరుపతికి రాక.

తలుపులు బద్దలుకొట్టి బీరువా తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు .

సంఘటనా స్థలానికి తిరుచానూరు పోలీసులు క్లూస్ టీం చేరుకొని ఆధారాల సేకరణ.

అపార్ట్ మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల నిక్షిప్త హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లిన దొంగలు.

పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు ఎస్ ఐ రామకృష్ణారెడ్డి.