Agriculture

తెలంగాణాలో అమూల్ ₹500కోట్ల పెట్టుబడి

పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతిగాంచిన అమూల్‌ సంస్థ తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలోని స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లో మొదటి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.