NRI-NRT

‘ఆటా’కు ఆప్టా మద్దతు

‘ఆటా’కు ఆప్టా మద్దతు

వచ్చే జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు ఆటా 17వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనిలో భాగంగా వాషింగ్టన్ హిల్టన్ హోటల్ లో శనివారం నాడు కర్టెన్ రైజర్ పేరుతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటా కార్యవర్గ సమావేశంలో మూడు రోజుల పాటు నిర్వహించే మహాసభల కార్యక్రమాలపై చర్చించారు ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది అనంతరం సాయంత్రం పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అమెరికాలో మరో ప్రముఖ తెలుగు సంఘం APTA కార్యవర్గ సభ్యులు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు తమ సంఘం తరఫున ఆట ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి సహకారం అందిస్తామని ప్రకటించారు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ చందు మాట్లాడుతూ ఆట ఉత్సవాలకు తమ సంఘం నుండి లక్ష డాలర్లు విరాళంగా అందిస్తామని ప్రకటించారు తమ సంఘం నుండి వెయ్యి మంది ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు ఈ వేడుకలకు సంబంధించిన చిత్రాలు ఇవి

Whats-App-Image-2022-03-13-at-16-58-00-3
Whats-App-Image-2022-03-13-at-16-58-00-4
Whats-App-Image-2022-03-13-at-16-58-00-5
Whats-App-Image-2022-03-13-at-16-58-00-6
Whats-App-Image-2022-03-13-at-16-58-00-8
Whats-App-Image-2022-03-13-at-16-58-00-9
Whats-App-Image-2022-03-13-at-16-58-00
Whats-App-Image-2022-03-13-at-16-58-28
Whats-App-Image-2022-03-13-at-16-58