NRI-NRT

అరుదైన కళాఖండాలను భారత్ కు అప్పగించిన ఆస్ట్రేలియా

అరుదైన కళాఖండాలను భారత్ కు అప్పగించిన ఆస్ట్రేలియా

భారత్‌ ఆస్ట్రేలియా మధ్య వర్చువల్‌ శిఖరాగ్ర వర్చువల్‌ సమావేశం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇరు దేశాల ప్రధానులు ఈ సమావేశంలో భేటి అయ్యారు. ఈ వర్చువల్‌ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘నమస్కార్’తో అభినందించారు. ఈ సమావేశంలో ఆయన ఆస్ర్టేలియాలోని ప్రధాన నగరాలైన క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్‌లో సంభవించిన వరదల కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణా నష్టాలపై మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలించిన 29 భారతీయ కళాఖండాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఆస్ట్రేలియా అధినేతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

పైగా మీరు పంపిన పురాతన వస్తువులలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలకు సంబంధించిన వందల ఏళ్ల నాటి కళాఖండాలు, ఫోటోలు ఉన్నాయని చెప్పారు. భారతీయులందరి తరపున తాను ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. గత వర్చువల్‌ సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యనికి ఒక రూపాన్ని ఇవ్వగలిగాం. ఈ రోజు దాన్ని నిజం చేస్తూ ఇరుదేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నందుకు తాను సంతోషిస్తున్నాను అని చెప్పారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్మాణాత్మక వ్యవస్థను సిద్ధం చేస్తుందన్నారు.

గత కొన్ని ఏళ్లుగా ఇరుదేశాల సంబంధాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్ అండ్‌ టెక్నాలజీ తదితర అన్ని రంగాలలో ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. ఈ మేరకు సమావేశంలో ఆస్ట్రేలియ ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ…రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గుర్తించి ప్రస్తావిస్తూ… ప్రాంతీయ సహకార ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పారు. మా ప్రాంతంలో వస్తున్న వేగంవంతమైన మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడిన ఎదుర్కొంటున్నాం. మా క్వాడ్ నాయకులు ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి గురించి చర్చించే అవకాశం ఇచ్చారనే నేను భావిస్తున్నాను. ఇండో-పసిఫిక్‌లోని మా స్వంత ప్రాంతానికి ఎదురైన భయంకరమైన సంఘటనే ఈ దురాక్రమణ. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎదువుతున్న సంక్షోభం, పరిణామాలు తదితర సమస్యల పై చర్చించడమానికి మాకు అవకాశం వచ్చింది.” అని మోరిసన్ చెప్పారు. ఈ మేరకు ఈ వర్చువల్‌ సమావేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.