Movies

ప్రేమిస్తే అంతే మరి!

ప్రేమిస్తే అంతే మరి!

ప్రేమించిన జంటలో ఒకరి సంతోషం మరొకరిది అవుతుంది. నమ్మకాల్ని, సంప్రదాయాల్ని, ఇష్టాల్ని పరస్పరం గౌరవించాల్సి ఉంటుంది. శృతిహాసన్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే అగ్ర నాయికగా తీరిక లేనంత పనిలో ఉన్నా…ప్రియుడి కోసం సమయం కేటాయిస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’ చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 107వ సినిమా, చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నాయికగా నటిస్తున్నది శృతి. ఇవన్నీ రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉండటం వల్ల ఈ తారకు విరామమే లేదు. అయినా ప్రియుడు శంతను హజారికా కోసం ఓ షార్ట్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంది. అదీ అతని సొంతూరు అస్సాంలోని గుహవాటికి. అక్కడ ఏటా వైభవంగా జరిగే రొంగాలీ బిహు అనే ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్నది శృతి. ఈ నెల రెండో వారంలో జరిగే బిహు ఉత్సవాలు అస్సాంలో పెద్ద వేడుకలు. వీటినే బొహాగ్‌ బిహు అని కూడా పిలుస్తుంటారు. ఈసారి బిహు ఉత్సవాల్లో ప్రియుడితో కలిసి శృతి పాల్గొనడం వేడుకలకు ప్రత్యేకత తీసుకురానుంది.