DailyDose

వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. కారు ధ్వంసం

వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. కారు ధ్వంసం

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని చెప్పారు.మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
14vh-brk-2