Politics

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి.

Auto Draft

బెజవాడలో జగన్ కు చిరంజీవి సన్మానం..చిరంజీవి, రాం చరణ్ నటించిన ఆచార్య సినిమా, ఈ నెల 27న రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఈ నేపధ్యంలోనే, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో చేయటానికి, చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడ సిద్ధర్దా గ్రౌండ్స్ లో, ఈ నెల 23 నిర్వహించటానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు అనూహ్యంగా ముఖ్య అతిధిగా జగన్ మోహన్ రెడ్డిని పిలవాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోవటంతో, దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ లోనే, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేయాలని, చిరంజీవి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమా టికెట్ల అంశం పై, చిరంజీవి పలు మార్లు జగన్ తో భేటీ అయ్యారు. ఇతర హీరోలని కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ తరువాత సినిమా టికెట్ ధరలు పెంచారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేయాలని, చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆచార్య సినిమా నిర్మాత కూడా, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చూసే లాయర్ గా, ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ఉన్నాడు. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా, మొదటి నుంచి ఈ సినిమా పై ఇంట్రెస్ట్ తో ఉన్నారు.ముఖ్యంగా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి, జగన భేటీకి, నిరంజన్ రెడ్డి చొరవ చూపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జగన్ తమకు సానుకూలంగా స్పందించారని చెప్పిన ఆచార్య చిత్ర యూనిట్, చిరంజీవితో, జగన్ మోహన్ రెడ్డికి ఘన సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా, పొలిటికల్ టచ్ తో, ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్ళుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండటంతో, ఈ ఈవెంట్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. అయితే ఈ పరిణామం మాత్రం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు జగన్ ఆడనివ్వకుండా చేస్తున్నారు. ఇక పవన్ కూడా, జగన్ ని గెలవకుండా చూడటానికి వైసీపీ వ్యతిరేకత ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు సొంత అన్న, జగన మోహన్ రెడ్డిని పొగుడుతూ సన్మానం చేస్తే, ఆ పరిణామం , పవన్ కళ్యాణ్ కు ఇబ్బందిగా మారుతుంది. మరి ఈ అంశం పై, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.