Devotional

పద్మావతీ దేవీ పాహిమాం – TNI ఆధ్యాత్మికం

పద్మావతీ దేవీ పాహిమాం  – TNI ఆధ్యాత్మికం

1.లియుగ దైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వతంత్ర లక్ష్మిగా పూజలందుకుంటోంది. తన పతిౖయెన శ్రీవారి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవా లను జరిపించుకుంటూ, నిత్యకల్యాణం… పచ్చ తోరణంలా భాసిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో రెండు ఉపాలయాలున్నాయి. ఒకటి శ్రీ కృష్ణ బలరామ ఆలయం, రెండవది శ్రీసుందరరాజ స్వామి ఆలయం. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధి చివర్లో అప్పట్లో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో నిర్వహించే వారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పుర వీధుల్లో నిర్వహించేవారని వినికిడి.
**అమ్మవారి ఆవిర్భావం
పద్మపురాణం, వేంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం, స్కందపురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ వివరాలు వివరించి ఉంది. వాటిలోని సారాంశం… తాను నివాసముండే విష్ణు వక్షస్థలంపై భృగుమహర్షి తన్నినా విష్ణువు అతన్ని క్షమించడాన్ని జీర్ణించుకోలేక శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. అలా శ్రీమహాలక్ష్మి ముందుగా కొల్హాపురం (మహారాష్ట్రలోని కొల్హాపూర్‌) చేరుకుంటుంది. లక్ష్మీ విరహితుడైన స్వామి వారు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుంటాడు. ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించదు. ఆ సమయంలోనే స్వర్ణముఖి నదీ తీరంలో కొలను తవ్వి, అందులో తామర పుష్పాలు వేసి పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే మహాలక్ష్మి కటాక్షిస్తుందని అశరీరవాణి పలుకుతుంది. దీంతో స్వామివారు ఇప్పుడున్న పుష్కరిణిని కుంతాయుధంతో తవ్వి బంగారు తామర పుష్పాలను వేసి, తామర పుష్పాలు విచ్చుకోవడానికి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి 12 ఏళ్లు తపస్సు ఆచరిస్తాడు. స్వామి వారి తపస్సుకు మెచ్చిన శ్రీమహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి, శుక్రవారం రోజున బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది. పద్మం నుంచి ఆవిర్భవించడంతో పద్మావతీదేవి అయ్యింది. శ్రీనివాసుని హృదయేశ్వరిగా ఉంటూ శుకమహర్షి ప్రార్థన మేరకు శ్రీపద్మావతి అమ్మవారు పద్మాసనంపై భక్తులను అనుగ్రహిస్తోంది
**స్వతంత్ర లక్ష్మిగా పద్మావతీ దేవి
గ్రామం ఏర్పడక మునుపే శ్రీపద్మావతి అమ్మవారు వెలియడంతో స్వతంత్రలక్ష్మి అయింది. గ్రామం ఏర్పడక మునుపు ఆలయం నిర్మితమైతే అది స్వతంత్ర, గ్రామం ఏర్పడిన తరువాత ఆలయ నిర్మాణమైతే అది పరతంత్ర అని పురాణాలు చెబుతున్నాయి. ఈ లెక్కన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారు స్వతంత్రలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారు వెలసిన తరువాత నిత్య ధూపదీప నైవేద్యాల కోసం శుకమహర్షి అగ్రహారాన్ని నిర్మించి, వంద వైష్ణవ కుటుంబాలకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుకమహర్షి పేరుతో అప్పట్లో తిరుశుకనూరుగా పిలిచేవారు. అదే
తిరుచానూరుగా మార్పు చెందింది. స్వతంత్ర లక్ష్మి అయిన శ్రీపద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోను ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఏటా వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కల్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి సోమవారం అష్టదళ పాద పద్మారాధన, ప్రతి నెల మొదటి బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం ఉదయం మూలమూర్తికి అభిషేకం, మధ్యాహ్నం ఉద్యానవనంలో ఉత్సవవర్లకు అభిషేకం, సాయంత్రం వీధోత్సవం, శనివారం పుష్పాంజలి సేవ జరుగుతాయి.
*పంచమీతీర్థం విశిష్టత.
కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పద్మ సరోవరం(పుష్కరిణి)లో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహిస్తారు. పంచమీతీర్థం రోజున పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తన పట్టపురాణి పద్మావతి అమ్మవారికి నిర్వహించే చక్రస్నానానికి తిరుమల నుంచి ముల్తైదువు సారెను శ్రీవారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది.
*లక్ష కుంకుమార్చన… పుష్పయాగం
కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లోక కల్యాణార్థం అష్టోత్తర శత నామావళిని లక్ష మార్లు స్తుతిస్తూ కుంకుమతో అమ్మవారిని ఆలయ అర్చకులు, వేద పండితులు అర్చిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో అలిసిన అలమేలు మంగమ్మను సేదదీర్చడానికి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు సాయంత్రం ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది

2. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో నిర్మించనున్న ధ్యానమందిరానికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.కోట్ల విరాళంతో ఎకరాల విస్తీర్ణంలో మంది భక్తులు కూర్చుని ధాన్యం చేసుకునేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్టు వెల్లడించారు.

3. తిరుమలలో ఎలక్ర్టిక్‌ బస్టాండ్‌!
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలో శనివారం జరుగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో దాదాపు 64 అంశాలతో రూపొందించిన అజెండాపై సభ్యులు చర్చించనున్నారు. ప్రధానంగా తిరుమలలో 2.86 ఎకరాల్లో ఎలక్ర్టిక్‌ బస్టాండ్‌ ఏర్పాటుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎలక్ర్టిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాట్లుపై కూడా చర్చించనున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో తిరుమలలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. తిరుమలవాసుల సమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. దుకాణాలు, ఇళ్లు లీగల్‌హైర్‌, కొనుగోలు చేసిన వారి లైసెన్స్‌ల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.చాలా ఏళ్లుగా వివాదంలో ఉన్న 84వేలం షాపుల సమస్య పరిష్కారంపై చర్చ జరుగనుంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పాకశాస్త్ర విద్యార్థులకు టీటీడీలో ఇంటర్న్‌షిప్‌ ఇచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. తిరుమలలో ఆప్కో మెగా షోరూమ్‌ ఏర్పాటు, పలు కొనుగోళ్లు, ఇంజనీరింగ్‌ పనులకు ఆమోదం తెలుపనున్నారు. తిరుమలలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ-లాబీ ఏర్పాటు అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. వారపు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.టైంస్లాట్‌ సర్వ దర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించే అంశం, శ్రీవాణి ట్రస్టుల విరాళాలతో నూతన ఆలయాల నిర్మాణాలకు నిధుల కేటాయింపుపై చర్చ జరుగనుంది. అన్నమయ్య మార్గంలో నడకదారి, రోడ్డు మార్గం ఏర్పాటుపై అటవీశాఖ ఇచ్చిన వివేదికపై చర్చించనున్నారు. టీటీడీలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను కార్పొరేషన్‌ ఉద్యోగులకు కేటాయింపు, క్వార్ట ర్స్‌ మరమ్మ తులు, దేశవాళీ గోవుల సేకరణ , అటవీశాఖ సిబ్బందికి టైంస్కేల్‌ వర్తింపు వంటి అంశాలపై కూడా సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. టేబుల్‌ అజెండాగా మరికొన్ని అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డు సమా వేశాన్ని గతంలోలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయరని సమాచారం.

4. తిరుమల….టిటిడి పాలకమండలి నిర్ణయాలు
సామాన్య భక్తులుకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్లాట్ బుకింగ్ విధానం,నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తాం. టిటిడికి మహరాష్ర్టా ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఏకరాల స్థలాని ముంబాయిలో కేటాయించింది. మహరాష్ర్టా ప్రభుత్వం కేటాయించిన భూమి విలువ 500 కోట్లు వుంటుంది….త్వరలోనే భూమి పూజ నిర్వహించి….ఆలయ నిర్మాణం ప్రారంభిస్తాం. ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు. మే 5వ తేది నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులును అనుమతిస్తాం. శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహసనాలు తయ్యారి చేస్తాం. పద్మావతి మెడికల్ కాలేజిలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి…మే 5వ తేది సియం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తాంరోండోవ దశ పనులుకు 100 కోట్లు కేటాయించాం….మార్చి 2023 కి పనులు పూర్తి చేస్తాం. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రోండు దశలలో 36 కోట్లు కేటాయింపు. వసతి గదులు మరమత్తులుకు 19 కోట్లు కేటాయింపు. బాలాజినగర్లో 2.86 ఏకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం. ఆస్థాన సిద్దాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్దాంతిని నియమించాం.437 ఉద్యోగులు క్వార్టర్స్ మరమత్తులుకు నిర్ణయం. వస్తూ రుపేణా విరాళాలు అందించిన భక్తులుకు ప్రివిలేజస్ అందజేస్తాం.టిటిడి ఉద్యోగులుకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే పూర్తి చేస్తాం.

5. హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ శ‌నివారం ఉద‌యం యాదాద్రి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా శ్రీల‌క్ష్మీ నార‌సింహ స్వామిని మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం మేయ‌ర్‌ను ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

6. అమర్‌నాథ్‌ యాత్రికులకు మెడికల్‌ సర్టిఫికెట్లు
అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ సర్టిíఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమర్‌నాథ్‌ 2022 యాత్ర జూన్‌ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్లేందుకు నిర్దేశించిన మెడికల్‌ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, ఆధార్‌ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్‌లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులతో కూడిన మెడికల్‌ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది

7. ముంబైలో శ్రీవారి ఆలయం.. 10 ఎకరాలు కేటాయించిన ఠాక్రే సర్కార్‌
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్‌ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం తిరుమలకు వచ్చిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్యా ఠాక్రే.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమి పత్రాలను వైవీసుబ్బారెడ్డికి ఠాక్రే అందజేశారు.నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ భూమి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశానికి ముందుగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర పాలకమండలి సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర మంత్రి ఠాక్రే సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఠాక్రే, సంజీవ్‌ సరిన్‌ను సుబ్బారెడ్డి ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ ఆలయం నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరించేందుకు సిద్ధమని రేమాండ్‌ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియా చెప్పారని ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ సరిన్‌ తెలిపారు. ముంబైలోని అత్యంత విలువైన భూమిని శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయం నిర్మాణం వ్యవయం భరించేందుకు ముందుకు వచ్చిన రేమాండ్ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియాకు కూడా సుబ్బారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.