DailyDose

టాటా స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు, ఇద్దరికి గాయాలు – TNI నేర వార్తలు

టాటా స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు, ఇద్దరికి గాయాలు – TNI  నేర వార్తలు

* జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శకటాల రంగంలోకి దిగి మంటలను అదుపు చేసిన్టటు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.

*విజయనగరం జిల్లాలో మరో అత్యాచారంజిల్లాలోని సచివాలయంలో మహిళా పోలీసుపై అత్యాచారంమహిళా పోలీసుపై ఇంజినీరింగ్ అసిస్టెంట్ అత్యాచారంశృంగవరపుకోట పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా పోలీసు కేసు నమోదు చేసిన శృంగవరపుకోట పోలీసులు పెళ్లికి నిరాకరించిన ప్రియుడుపై ఫిర్యాదు చేసిన ప్రేయసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, న్యూడ్ ఫొటోస్ ని సేకరించిన ప్రియుడు
అనంతరం ప్రేయసి తండ్రికి న్యూడ్ ఫొటోస్ పంపించిన ప్రియుడు ఫిర్యాదు చేసిన ప్రేయసి తల్లిదండ్రులు, ప్రేయసి శృంగవరపుకోట మండలం ముసిడిపల్లి సచివాలయంలో చోటుచేసుకున్న ఘటన మహిళా పోలీస్ గా పని చేస్తున్న ప్రేయసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియుడు రెడ్డి నవీన్(23) కేసు నమోదుచేసి రెడ్డి నవీన్ ను అదుపులోకి తీసుకున్న శృంగవరపుకోట పోలీసులు

*విజయవాడ ప్రకాష్ నగర్ లో మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవ కత్తితో దాడి చేసిన భార్య.భర్త కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..భర్త పై కత్తితో దాడి అనంతరం తనను తాను గాయాలు చేసుకున్న భార్య 108లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం నున్న పోలీసులు

*సెంట్రల్ హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన శక్తివంతమైన పేలుడులో 18 మంది మరణించారు. అనుమానాస్పద గ్యాస్ లీక్ వల్ల జరిగిన పేలుడులో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున జరిగిన పేలుడు కారణంగా గాలిలోకి దుమ్ము, పొగ వ్యాపించింది.పేలుడు కారణంగా హోటల్ భవనం ధ్వంసమైంది. కిటికీలు ఊడిపోయాయి. హోటల్ వెలుపల పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఫైవ్ స్టార్ హోటల్ మడోన్నా, బెయోన్స్, మిక్ జాగర్,రిహన్న వంటి ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చింది.ఈ పేలుడు ధాటికి సమీపంలోని బాప్టిస్ట్ చర్చి గోపురం కూడా కూలిపోయింది.పేలుడు సమయంలో హోటల్ లోపల ఉద్యోగులు దాని పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు. ఈ పేలుడులో విదేశీయులు గాయపడినట్లు లేదా మరణించినట్లు తమకు సమాచారం లేదని పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ గార్సియా గ్రాండా తెలిపారు.గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని హోటల్ యాజమాన్యంలోని రాష్ట్ర కంపెనీ గవియోటాకు చెందిన రాబర్టో కాల్జాడిల్లా చెప్పారు.అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ పునరావాస పనులు చేపట్టాయి.

*జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శకటాల రంగంలోకి దిగి మంటలను అదుపు చేసిన్టటు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.

* మద్యం వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావడంతో అబ్కారీశాఖకు రోజుకు వంద కోట్ల రూపాయలు నష్టం కలగనుందని అంచనా వేశారు. శుక్రవారం నుంచి ఆందోళన ప్రారంభమైంది. ఈనెల 19 వరకు నిరసన కొనసాగిస్తున్నట్టు మద్యం వ్యాపారులు ప్రకటించారు. 15 రోజులపాటు నిరసన కొనసాగితే ఏకంగా రూ. 1500 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలగనుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 176 తాలూకాల పరిధిలో గ్రామస్థాయి నుంచి నగరం దాకా రోజూ రూ. 100 కోట్లకుపైగా వ్యాపారాలు సాగుతాయి. రాష్ట్ర అబ్కారీశాఖ రూపొందించిన కొత్త పాలసీకి వ్యతిరేకంగా మద్యం వ్యాపారులు ఆందోళనకు దిగారు. మద్యం కొనుగోలు చేసేది లేదని వారు ప్రకటించడంతో నష్టం తప్పదనిపిస్తోంది. కలబురగిలో ప్రారంభమైన ఆందోళన హొస్పేట, బెళగావి, మైసూరు, బెంగళూరు, రామనగర, మండ్య, హాసన్‌, చామరాజనగర, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో కొనసాగింది. రాష్ట్రమంతటా తమ ఆందోళన కొనసాగనుందని రాష్ట్ర మద్యం వ్యాపారుల ఐక్య కూటమి ప్రధాన కార్యదర్శి గోవిందరాజ్‌ హెగ్డే ప్రకటించారు. కొత్త పాలసీని పాటించలేమని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే వ్యాపారాలు కొనసాగించలేమన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి నగర, జిల్లా, తాలూకాల స్థాయిలో శ్రీకారం చుట్టామని గ్రామస్థాయికి తమ ఆందోళన తీసుకెళతామన్నారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ సంబంధిత అధికారులు స్పందించడం లేదన్నారు. కొవిడ్‌ కాలంలో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడుతున్నాయని, కొత్త పాలసీతో వ్యాపారులను రోడ్డున పడేయాలనుకోవడం సరికాదన్నారు. అబ్కారీశాఖ మంత్రితోపాటు అధికారులు, సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* కడప: జిల్లాలోని బద్వేలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాతో పాటు విక్రయాలు సాగిస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 5 మందితో పాటు, అనకాపల్లికి చెందిన ఇద్దరు, ఇద్దరు కడప జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకుచ్చి ముఠా సభ్యులు ఇక్కడ విక్రయిస్తున్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరి వద్ద నుండి 10 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

*మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని స‌లీం న‌గ‌ర్‌లో శ‌నివారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఫ‌ర‌హ‌త్ ఆస్ప‌త్రి గేటు స‌మీపంలో మంట‌లు ఒక్క‌సారిగా చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది రోగుల‌ను వేరే భ‌వ‌నానికి త‌ర‌లించారు.

*రాజస్థాన్లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్కు గురిచేసింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీవా, ఒరిజినలా తెలియాల్సి ఉంది. రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో 2000 రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు.

*ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్‌ ప్రెస్‌ వేపై మథుర వద్ద వ్యాగనార్‌ కారు మరోఆ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను కష్టంగా కారులోనుంచి బయటకు తీశారు. మృతుల్లో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. నోయిడాలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.కాగా, యమునా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

*విరుదునగర్‌ జిల్లా సాతూర్‌ సమీపం ఒ.మేట్టుపట్టి తిరువేంగడం నుంచి సాతూర్‌కు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తిరువేంగడం, కరిసల్‌కుళం ప్రాంతాల నుంచి సుమారు 60 మంది విద్యార్థులతో శుక్రవారం ఉదయం పాఠశాల బస్సు సాతూర్‌కు బయల్దేరింది. తిరువేంగడంకు చెందిన గణపతి (63) డ్రైవర్‌. బస్సు మేట్టుపట్టి సమీపంలో వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన 21 మంది విద్యార్థులను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు విద్యార్థులను మదురై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. సాతూర్‌ తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు

*పల్నాడు జిల్లాలో మద్యం తాగి మరొకరు మృతి చెందారు. గురజాలకు చెందిన జెల్ది శ్రీహారి (26) మద్యం తాగి మృతి చెందాడు. ఇటీవలే చిలకలూరిపేటలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. తాజాగా గురజాలలో శ్రీహరి మృతి చెందాడు. ప్రభుత్వ మద్యం షాపులోనే మృతులంతా మద్యం తాగినట్టు తెలుస్తోంది.

*అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చనిపోతుందేమోనన్న భయం తో గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కనకల్‌ గ్రామానికి చెందిన కొమురయ్య (55) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. కొమురయ్యకు భార్య సత్తెమ్మ, కూతురు వెంకటలక్ష్మి ఉన్నారు. సత్తెమ్మకు పేగుల్లో ఫంగస్‌ రావడంతో ఏప్రిల్‌ 29న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. సత్తెమ్మను పరీక్షించిన వైద్యులు ఆమెకు అదే రోజు శస్త్రచికిత్స చేసి ఆరో అంతస్థులోని వార్డులోకి మార్చారు. భార్య వెంటే ఉన్న కొమురయ్య.. పక్క వార్డుల్లో ప్రతీ రోజు ఇద్దరు ముగ్గురు చ నిపోవడాన్ని గమనించాడు. తన భార్య కూడా అలానే చనిపోతుందేమోననే భ యంతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రి భవనం పైనుంచి కిందకి దూకి మరణించాడు.

*మెదక్‌ సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళపై కత్తితో దాడికి యత్నించిన కేసులో మెదక్‌లోని దాయరకు చెందిన నీలభేతి రాములు(42)ను రిమాండ్‌ ఖైదీగా సబ్‌ జైలుకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఫిట్స్‌ వస్తున్నాయని తోటి ఖైదీల ద్వారా తెలుసుకున్న జైలర్‌ సుధాకర్‌రెడ్డి ప్రథమ చికిత్స చేయించి, వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడిన పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, నీలబేతి రాములు సోదరుడి భూ వివాదంలో ఓ పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు మృతుడి భార్య సంధ్య ఆరోపించింది. అతడి ఒత్తిడి వల్లనే దారుణంగా కొట్టి కేసు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

*మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.శుక్రవారం అర్దరాత్రి నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న మల్టీ యుటిలిటీ కారు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.టవేరా వాహనం ఉమ్రేడ్ నుంచి నాగపూర్ వైపు వెళుతుండగా విహిర్ గావ్ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతులను ఇంకా గుర్తించలేదని డీసీపీ నూరుల్ హసన్ చెప్పారు.

*కూల్‌డ్రింక్‌ తాగేలోపు రూ.5లక్షల నగదు చోరీకి గురైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరులో చోటుచేసుకుంది. సీఐ నరసింహరాజు వివరాల మేరకు.. గిరింపేటకు చెందిన రామకుమార్‌ రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి. శుక్రవారం దర్గా వద్దనున్న ఓ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదును డ్రా చేసుకుని బయలుదేరారు. చౌడేశ్వరి ఆలయం వద్ద ద్విచక్ర వాహనం ఆపి.. షాపులో కూల్‌ డ్రింక్‌ తాగారు. వాహనం వద్దకు వచ్చి చూడగా నగదు బ్యాగు కనిపించలేదు. దీనిపై బాధితుడు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసున్నారు.

*ప్రేమ పేరిట పోలీసాయన మోసగించడంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు, అనంతపురం జిల్లా పామిడి మండలం జీఏ కొట్టాలకు చెందిన భీమ్లానాయక్‌, లాలెమ్మ దంపతుల కుమారుడు విజయ కుమార్‌ నాయక్‌ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో డిగ్రీ చదువుతున్న అదే గ్రామానికి చెందిన సరస్వతి, మరో యువతితో ఏకకాలంలో ప్రేమాయణం నడిపాడు. ఇది యువతులిద్దరికీ తెలియడంతో ఎస్‌ఐ వ్యవహారం బెడిసికొట్టింది. న్యాయం కోసం మరో యువతి దిశ పోలీసులను ఆశ్రయించిందని, దీంతో ఆమెను విజయ్‌ కుమార్‌ పెళ్లి చేసుకున్నాడని సరస్వతి సోదరుడు తెలియజేశాడు. దీంతో తన సోదరి తీవ్ర మనస్తాపానికి గురైందని అన్నాడు. తిరుపతి నుంచి మూడు నెలల క్రితం సరస్వతి సొంతూరుకు వచ్చింది.

*ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ వివాహితపై టీవీ మెకానిక్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించాడు. విశాఖపట్నం శివారు పెందుర్తిలో ఈ ఘటన జరిగింది. సీఐ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరవలో ఓ ప్రైవేటు ఉద్యోగి కుటుంబం (దంపతులు, ఇద్దరు పిల్లలు) నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం టీవీ మరమ్మతు రావడంతో గాజువాకకు చెందిన మెకానిక్‌ సతీశ్‌కుమార్‌(32)ను పిలిచారు. ఆ సమయంలో ఆయన భార్య (25)తో సతీశ్‌కుమార్‌ పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. శుక్రవారం ఆమె ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

*విశాఖ నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. రెల్లివీధికి చెందిన బాలుడు (17) ఇక్కడి ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం వన్‌టౌన్‌లోని ఓ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్‌ పరీక్ష రాసి ఇంటికి వెళ్లేందుకు మిత్రులతో కలిసి ఆటో ఎక్కుతుండగా నలుగురు కత్తులతో దాడి చేశారు. దీంతో బాలుడు సమీపంలోనే గల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి పరుగులు తీశాడు. అది చూసి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఏవీఎన్‌ కళాశాల ప్రాంతంలో దండుపాళ్యం ముఠాగా చెప్పుకుని తిరుగుతున్న బ్యాచ్‌కు చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఒక దాడి ఘటనలో ఈ బాలుడిపై హత్యాయత్నం కేసు ఉందని చెబుతున్నారు. కాగా.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాలుడు మీడియాతో మాట్లాడుతూ స్టేషన్‌ నుంచి తనను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి పంపకుండా ఆటో ఎక్కించి ఇంటికి పంపేశారని ఆరోపించాడు. దీనిపై వన్‌టౌన్‌ సీఐ వెంకటనారాయణను వివరణ కోరగా గాయాలతో వచ్చిన బాలుడిని హెడ్‌ కానిస్టేబుల్‌ సహాయంతో పంపించినట్టు తెలిపారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, పాత కక్షలతోనే దాడి జరిగి ఉండవచ్చని తెలిపారు.

*ఓ వివాహితకు వలంటీర్‌ మాయమాటలు చెప్పి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆమెను పెళ్లి చేసుకుని, తర్వాత ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఇప్పుడు మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురంలో ఓ వివాహిత ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిఠాపురం పట్టణ పరిధిలోనే నాగసురేశ్‌ కుమార్‌ వలంటీరుగా పనిచేస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఒప్పుకోకపోతే చనిపోతానని చెప్పి భర్తతో విడాకులు తీసుకునేలా చేశాడు. 2016, ఫిబ్రవరి 24న అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నాడు.

*ఇంటర్‌ పరీక్ష ఆరంభం రోజునే అపశ్రుతి చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడి ఇంటర్‌ విద్యార్థిని గాయపడిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని గోవిందాంబిక జూనియర్‌ కళాశాల(సాధన)లో శుక్రవారం ఇం టర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వభారతి జూనియర్‌ కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని హుస్సేన్‌బీ పరీక్ష రాస్తుండగా పైన తిరుగుతున్న ఫ్యాన్‌ ఊడి ఆమెపై పడింది. స్వల్పంగా గాయపడిన ఆమెను కళాశాల యాజమాన్యం వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది.

*తాపీ మేస్ర్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. నందిగామ పట్టణానికి చెందిన మేకపోతుల శివకుమార్‌ అలియాస్‌ శివ (41) తాపీ మేస్ర్తిగా పని చేస్తుంటాడు. భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం తనకు ఫోన్‌ రావటంతో ఇంటిలో కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పాతబైపాస్‌ వద్దనున్న ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ కార్యాలయం సమీపంలోని పంట పొలాల్లో మృతదేహాన్ని రైతులు గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ నాగేశ్వరరెడ్డి, సీఐ కనకారావు, ఎస్సై పండుదొర సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై బండరాళ్లు, సీసాలతో తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. బైకు సమీపంలోని డొంక రోడ్డులో పడి ఉంది. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

*కూల్‌డ్రింక్‌ తాగేలోపు రూ.5లక్షల నగదు చోరీకి గురైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరులో చోటుచేసుకుంది. సీఐ నరసింహరాజు వివరాల మేరకు.. గిరింపేటకు చెందిన రామకుమార్‌ రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి. శుక్రవారం దర్గా వద్దనున్న ఓ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదును డ్రా చేసుకుని బయలుదేరారు. చౌడేశ్వరి ఆలయం వద్ద ద్విచక్ర వాహనం ఆపి.. షాపులో కూల్‌ డ్రింక్‌ తాగారు. వాహనం వద్దకు వచ్చి చూడగా నగదు బ్యాగు కనిపించలేదు. దీనిపై బాధితుడు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసున్నారు.

* ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం దారుణమని మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో శుక్రవారం అత్యాచారానికి గురైన బాలికను ఆమె కేజీహెచ్‌లో పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విషయం తెలిసిన వెంటనే పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కొద్దిరోజుల కిందటే ఒక నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. అయినా ఈ తరహా ఘటనలు జరగడం బాధాకరం. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరి కాదు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. రమ్య కేసు స్ఫూర్తితో ముందుకువెళ్లి.. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేసేలా చూస్తాం’’ అని ఉషశ్రీ హామీ ఇచ్చారు.

*శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన 26 ఏళ్ల యువతి జోహన్నె్‌సబర్గ్‌ నుంచి దోహా మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఆమె లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. అందులో ఐదు లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగులు, రెండు ఫైల్‌ ఫోల్డర్లను గుర్తించారు. అనుమానం వచ్చి వాటిని విప్పి చూడగా, వివిధ అరల్లో దాచి ఉంచిన 14 హెరాయిన్‌ ప్యాకెట్లు కనిపించాయి. పట్టుబడిన డ్రగ్‌ 6.75 కిలోలు ఉంది. దాని విలువ రూ.54 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

*మెదక్‌ సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళపై కత్తితో దాడికి యత్నించిన కేసులో మెదక్‌లోని దాయరకు చెందిన నీలభేతి రాములు(42)ను రిమాండ్‌ ఖైదీగా సబ్‌ జైలుకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఫిట్స్‌ వస్తున్నాయని తోటి ఖైదీల ద్వారా తెలుసుకున్న జైలర్‌ సుధాకర్‌రెడ్డి ప్రథమ చికిత్స చేయించి, వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడిన పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, నీలబేతి రాములు సోదరుడి భూ వివాదంలో ఓ పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు మృతుడి భార్య సంధ్య ఆరోపించింది. అతడి ఒత్తిడి వల్లనే దారుణంగా కొట్టి కేసు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు

*ఆర్థిక ఇబ్బందులతో మరో రైతు బలవన్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పోచారంలో కాశిమళ్ల వీరయ్య(58) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తుండేవాడు. కుమారుడు సమ్మయ్య అనారోగ్యానికి గురవటంతో అప్పు చేసి చికిత్స చేయించినా కుమారుడు బతకలేదు. ఎకరం పొలం అమ్మి కుమారుడి చికిత్సకు చేసి అప్పు కొంత మేర తీర్చిన వీరయ్య తన ఎకరానికి తోడు మరోఎకరం కౌలుకు తీసుకుని మిర్చి వేశాడు. కానీ వైరస్‌ కారణంగా పంట చేతికి రాకపోవడం, గతంలో ఉన్న కొంత అప్పును తీర్చే దారి కనిపించకపోవడంతో గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.

*మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్‌ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది.

*కడప: జిల్లాలోని బద్వేలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాతో పాటు విక్రయాలు సాగిస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 5 మందితో పాటు, అనకాపల్లికి చెందిన ఇద్దరు, ఇద్దరు కడప జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకుచ్చి ముఠా సభ్యులు ఇక్కడ విక్రయిస్తున్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరి వద్ద నుండి 10 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

*పోచారం అభయారణ్యంలో వేటగాళ్ల కదలికలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని లింగంపేట మండలం కోమట్‌పల్లి సమీపంలో జింకలతో వేటగాళ్లు పట్టుబడ్డారు. శనివారం ఉదయం అభయారణ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కార్లలో జింకలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను సీజ్‌ చేశారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.