Politics

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి…. – TNI రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి….  – TNI రాజకీయ వార్తలు

* వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరింత ఎక్కువగా ఓట్లు, సీట్లు గెలుస్తామని చెప్పారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన విజయ సాయిరెడ్డి ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటున్నారని ఆక్షేపించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరన్నారు. మరో 20, 25 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని.. ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలకు సంబంధించి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని… అవన్నీ తెదేపా నాయకులు చేసినవేనని….తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తలపై బురద జల్లుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

*కాంగ్రెస్ టిక్కెట్ దక్కాలంటే అక్కడకు వెళ్లాల్సిందే : రాహుల్ గాంధీ
సొంతపార్టీ నేతలకు రాహుల్ గాంధీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్.. వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్యే యుద్ధమని వెల్లడించారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెరాస, కాంగ్రెస్‌ మధ్యే యుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్… కేసీఆర్‌ వెనుక ధనం, పోలీసులు ఉన్నారు కానీ.. ప్రజలు లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మెరిట్‌ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని తెలిపారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేవారికే టికెట్‌ ఇస్తామని చెప్పారు.

*ఆ పుస్తకం తెదేపా వారికే వర్తిస్తుంది: హోంమంత్రి వనిత
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని హోంమంత్రి వనిత అన్నారు. విజయవాడ భవానిపురంలోని ఐరన్ హోల్‌సేల్‌ మార్కెట్‌లో నిర్మించిన రహదారలను ప్రారంభించిన ఆమె.. తెదేపా విడుదల చేసిన ‘ఊరికో ఉన్మాది’ పుస్తకం ఆ పార్టీ వాళ్లకే వర్తిస్తుందని అన్నారు.ఆ పుస్తకం తెదేపా వారికే వర్తిస్తుందితెలుగుదేశం నేతలు విడుదల చేసిన.. ‘ఊరికోఉన్మాది’ పుస్తకం ఆ పార్టీ వాళ్లకే వర్తిస్తుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ భవానిపురంలోని ఐరన్ హోల్‌సేల్‌ మార్కెట్‌లో నిర్మించిన రహదారలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఐరన్ హోల్సేల్ మార్కెట్గా పేరుగాంచిన భవానిపురం మార్కెట్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే రూ.5 కోట్ల వ్యయంతో మార్కెట్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశామన్నారు. తమ అభివృద్ధి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని హోంమంత్రి వ్యాఖ్యనించారు.

*టి.కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌గాంధీ మరోసారి వార్నింగ్‌
టి.కాంగ్రెస్‌ నేతలకు ఈ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీభవన్ కాంగ్రెస్ (Congress) నేతలతో ఆయన భేటీ అయ్యారు. పనిచేయకపోతే సీనియర్‌ నేతలకైనా టికెట్‌ రాదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కూర్చున్న వారికి టికెట్‌ రాదని, జనం మధ్య ఉండి కష్టపడేవారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కొందరు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆక్షేపించారు. మీడియాతో ఏదిపడితే అది మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుందామన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్‌గాంధీ సూచించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక బాగుపడింది సీఎం కేసీఆర్ (KCR) కుటుంబమేనని విమర్శించారు. భవిష్యత్‌లో ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవారితో పొత్తులు ఉండవన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ నష్టం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గర డబ్బు, అధికారం ఉందికానీ.. జనబలం లేదన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టీలో సమైక్యత అవసరమని రాహుల్‌ రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు.

*జగన్ ఏపీని మద్యాంద్రప్రదేశ్‌గా మార్చారు: కొల్లు రవీంద్ర
సీఎం జగన్ ఏపీని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను నవ విధాలా పిండుతున్నారని దుయ్యబట్టారు. పన్నులు, చార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాటు సారా తయారీ జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనను సమూలంగా తుడిచి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.

*రాజ‌కీయ ల‌బ్ధి కోసం యాదాద్రిపై విమ‌ర్శ‌లు స‌రికాదు:Indra karan reddy
ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం Yadadri శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యంలో భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌నుల‌పై శనివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. అర‌ణ్య భ‌వ‌న్ లో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆర్ & బీ ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డి, ఎస్ఈ వ‌సంత్ కుమార్, ఆల‌య ఇంచార్జీ ఈవో రామ‌కృష్ణ‌, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు. క్యూ కాంప్లెక్స్ లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడ‌టం, వాష్ రూమ్స్ లో ప‌రిశుభ్ర‌త‌, కొండ పైన‌ చ‌లువ పందిళ్ళు ఏర్పాటు, మురుగునీటి కాల్వ‌ల నిర్వ‌హ‌ణ‌, క్యూ కాంప్లెక్స్ లో ఫ్యాన్ల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉండేలా చూడ‌టం, వృద్ధులు, విక‌లాంగుల‌కు వీల్ చైర్ లు అందుబాటులో ఉండేలా చూడటం, కొండ కింద మొబైల్ టాయ్లెట్స్ ఏర్పాటు, ఇత‌ర వ‌స‌తులు ఏర్పాటు పై స‌మావేశంలో చ‌ర్చించారు. అకాల వ‌ర్షం వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన స‌మ‌స్య‌లు, పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌ల‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలపై ఆరా తీశారు. ఇలాంటి స‌మ‌స్య‌లు భవిష్య‌త్ లో పునరావృతం కాకుండా వ‌ర్ష‌కాలంలోగా వాటిని అధిగ‌మించేందుకు చర్య‌లు తీసుకోవాల‌న్నారు. మౌలిక వ‌స‌తుల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టాల‌ని, సామ‌న్య భ‌క్తుల‌కు శీఘ్ర‌ద‌ర్శ‌నం జ‌రిగేలా చూడాల‌న్నారు.ప్ర‌ధాన ఆల‌యంతో పాటు మిగితా నిర్మాణాలు నూత‌నంగా చేప‌ట్టినందు వ‌ల్ల కొన్ని రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌లో పురోగ‌తి చూపిస్తూ మందుకు వెళ్ళాల్సి ఉంటుంద‌ని, దీన్ని పెద్ద త‌ప్పిదంగానో లేదా పొరపాట్లుగా చూడాల్సిన‌ లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్దుబాటు స‌మ‌యంగా దీన్ని భావించి, అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి అద్భుత‌మైన వ‌స‌తులు క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాలలో భక్తులకు మంచినీరు అందించాల‌ని, అదేవిధంగా భక్తులు ఎండవేడిమి నుంచి సేద తీరేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి కల్పనలో ఆలస్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆల‌య పునర్నిర్మాణం చేశారన్నారు. స్వ‌యంభు ద‌ర్శ‌నాల ప్రారంభం త‌ర్వాత అక్క‌డ చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయని, ఒక్కొక్క‌టిగా వాటిని ప‌రిష్కరిస్తూ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని తెలిపారు. యాదాద్రికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుంగా ఆహ్లాద‌క‌ర‌, ప్ర‌శాంత వాతావ‌రణంలో స్వామివారిని ద‌ర్శించకుని వేళ్లేలా ఎల్ల‌వేళ‌ల కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

*చంద్రబాబు పర్యటనతో వైసీపీలో గుబులు మొదలైంది: మురళీమోహన్ర్కొ
న్నారు. విజ్ఞత కోల్పోయి మంత్రులు బాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రులకు కనీస అవగాహన లేదని… మంత్రి అప్పలరాజు గాలిలో గెలిచి మంత్రి అయ్యాడని మురళీమోహన్ పేర్కొన్నారు. స్థాయిని మరిచి మా అధినేతపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పాలసీలో వచ్చే ఎన్నికల్లో అప్పలరాజు గెలిచి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కారువయ్యిందన్నారు. హోం మంత్రికి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కనీస అవగాహన లేదన్నారు. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని మురళీమోహన్ తెలిపారు

*ycp పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది: అశోక్‌బాబు
వైసీపీ పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని టీడీపీ నేత అశోక్‌బాబు (Ashok Babu) విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1న జీతాలు ఇప్పించలేని ఉద్యోగ సంఘాల నేతలతో లాభమేంటి? అని ప్రశ్నించారు. ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తోంది? అని ప్రశ్నించారు. జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ఇబ్బందులున్నాయని సాకు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెండింగ్‌లో పెడుతున్నారని చెప్పారు. నవంబర్‌లో రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు కూడా డబ్బుల ఇవ్వలేదని తెలిపారు. మూడు నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేవని అశోక్‌బాబు చెప్పారు

*రాజ్‌థాకరేకు బయపడుతున్న ఉద్ధవ్: కాంగ్రెస్
లౌడ్ స్పీకర్ల వివాదంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీప్ రాజ్‌థాకరే (Raj Thackeray)కు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సారథ్యంలోని ప్రభుత్వం బయపడుతోందని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ (Sanjay Nirupam) ఆరోపించారు. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (MVA)లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండటం విశేషం.

*జగన్ ఏపీని మద్యాంద్రప్రదేశ్‌గా మార్చారు: కొల్లు రవీంద్ర
సీఎం జగన్ ఏపీని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను నవ విధాలా పిండుతున్నారని దుయ్యబట్టారు. పన్నులు, చార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాటు సారా తయారీ జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనను సమూలంగా తుడిచి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.

*మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది: Tulasi reddy
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరిత్రాళ్లు బిగించడమే అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

* జిల్లాల పర్యటనకు వస్తున్న ప్రజా స్పందన అద్భుతం: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జిల్లాల పర్యటనకు వస్తున్న ప్రజా స్పందన అద్భుతం అంటూ చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించింది. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో టీడీపీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయి. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే… ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

*కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సాధ్యం కానిది: మంత్రి Talasani
వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని Srinivas yadav అన్నారు. శనివారం TRSLP లో MLC ప్రభాకర్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా?, దేశానికి సంబంధించిందా స్పష్టత లేదని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ ఎంత? హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు.60 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారో చెప్పగలరా?నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.KCR నాయకత్వంలో ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలను రైతుల పోరాటంతోనే వెనక్కు తీసుకొంది.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది.ఢిల్లీ నుండి నేతలు రాష్ట్రానికి టూరిస్ట్ లుగా వచ్చి వెళుతున్నారు.వారితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు

*రాహుల్ బోగస్ మాటలను రైతులు నమ్మరు: మంత్రి Errabelli
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బోగస్ మాటలను రైతులు నమ్మే స్ధితిలోలేరని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు అనేక పధకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ సభలో Rahul చేసిన వ్యాఖ్యలపై శనివారం మంత్రి ఎర్రబెల్లి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..? మీరు అధికారం వున్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు..?అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధిహామీ పతాకాన్ని వ్యవసాయనాయికి ఎందుకు అనుసంధానం చేయలేదని అడిగారు. పంటలకు గిట్టుబాటు ధర మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు?మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు.చెరుకు పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..?పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే. ధరణి ఒక సక్సెస్ స్కీంఅని నకిలీ విత్తనాల సృష్టికర్తలే మీరేనని ఆరోపించారు. రైతులను మోసం చేసే బోగస్ సభ ఇది…సిగ్గులేకుండా రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు.ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.. మీ పతనం ఖాయం.మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని ఎవరు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదు.. కేవలం స్వతంత్రం తెచ్చిన కుటుంబమని మీకు పాలించే స్వేచ్ఛ ఇచ్చారు.తెలంగాణ కు స్వతంత్రం తెచ్చిన మహానుబావుడు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చచ్చు పడిందని,కాంగ్రెస్ మోసపు, బోగస్ హామీలు 70 ఏండ్ల పాటు రైతులను మోసం చేసిందని విమర్శించారు

*బాబు పర్యటనతో వైసీపీలో గుబులు మొదలైంది: మురళీమోహన్
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత వైసీపీలో గుబులు మొదలయ్యిందని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. విజ్ఞత కోల్పోయి మంత్రులు బాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రులకు కనీస అవగాహన లేదని… మంత్రి అప్పలరాజు గాలిలో గెలిచి మంత్రి అయ్యాడని మురళీమోహన్ పేర్కొన్నారు. స్థాయిని మరిచి మా అధినేతపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పాలసీలో వచ్చే ఎన్నికల్లో అప్పలరాజు గెలిచి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కారువయ్యిందన్నారు. హోం మంత్రికి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కనీస అవగాహన లేదన్నారు. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని మురళీమోహన్ తెలిపారు.

*రాష్ట్రాన్ని జగన్‌ వ్యాపారం కోసం వాడుకుంటున్నారు: సోమిరెడ్డి
సీఎం, ఎమ్మెల్యే పదవుల కోసం కాకుండా.. అంతా ఏపీ భవిష్యత్‌ కోసం కలిసి రావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సీట్ల గురించి చర్చ అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ వ్యాపారం కోసం వాడుకుంటున్నారన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని సోమిరెడ్డి తెలిపారు.

*సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ సదుపాయాలు : రాజ్‌నాథ్ సింగ్
దేశ సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ సమగ్ర రక్షణ వ్యూహంలో చాలా ప్రధానమైనది సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడమేనని చెప్పారు. దేశ భద్రత కోసం పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం పని చేసేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.దేశ సరిహద్దులను వీరు కాపాడుతున్నారని పేర్కొన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న బీఆరోఓను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిని ఉదాహరణగా చూపించారు. ఇది ఇప్పుడు దేశ సర్వతోముఖాభివృద్ధికి నూతన సింహద్వారంగా మారిందన్నారు. మానవ నాగరికత ప్రస్థానంలో రోడ్లకు గొప్ప ప్రాధాన్యం ఉందన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, ఆహార సరఫరా, వ్యూహాత్మక సైనిక అవసరాలు, పరిశ్రమలు, ఇతర సాంఘిక, ఆర్థిక ప్రగతి వంటివాటికి రోడ్లు చాలా ముఖ్యమని చెప్పారు. వీటిని సాధించాలంటే రోడ్లు, వంతెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు

*కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదు.. కొట్లాట సభ: Jeevan reddy
కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదని…కాంగ్రెస్ కొట్లట సభ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఆయన రాహుల్ గాంధీ కాదని…రాజరికపు గాంధీ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్ కాదు..ఫ్రస్టేషన్ అని అన్నారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అని తెలిపారు. ఢిల్లీ వాసి రాహుల్… గల్లీలో సన్నాసి రేవంత్‌ను ఏం మాట్లాడాలని అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు.. కేసీఆర్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులని చెప్పుకొచ్చారు. రాహుల్ ది ఐ రన్ లెగ్… ఆయన ఎక్కడ సభ పెట్టినా అక్కడ కాంగ్రెస్ ఔట్ అన్నారు. ‘‘రాహుల్ ఏ హోదాలో వచ్చావు… నువ్వు ఏమైనా కాంగ్రెస్ అధ్యక్షుడివా’’ అని ప్రశ్నించారు. రాహుల్ ఎలా డిక్లరేషన్ ప్రకటిస్తారని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి మీటింగ్ కు గైర్హాజరు అయ్యారన్నారు. రాష్ట్రానికి అనేక మంది టూరిస్టులు వస్తున్నారని….వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు గ్యారంటీ… వారంటీ రెండూ లేదన్నారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. ‘‘మీది మొబిలైజేషన్..మాది సోషలైజేషన్. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. సోనియా ప్రధాన మంత్రా…ఆమె తెలంగాణ ఇవ్వడానికి’’ అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

*కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉంది: బాల్క సుమన్
కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కొత్త థియేటర్‌లో పాత సినిమా లాగా ఉందన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉంటాడట అని ఎద్దేవా చేశారు. స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడన్నారు. బీజేపీ నడ్డా సభలో కూడా ఒక్కడు కూడా ఉద్యమంలో లేడన్నారు. బండి సంజయ్‌పై తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసైన ఉందా? అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ ఎవడికి తెలుసని బాల్క సుమన్ పేర్కొన్నారు

*తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు?: మంత్రి Niranjan
రాహుల్ గాంధీ ఎవరు తెలంగాణ నాయకులను క్షమించడానికి అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారన్నారు. రెండు పర్యాయాలు క్షమించకనే ఓడగొట్టారని అన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చితన్నారన్నారు. తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోందని తెలిపారు. రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతోందన్నారు. రాహుల్ ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారని మంత్రి నిలదీశారు. జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. తమరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదని, ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్ధించిందని అన్నారు. నిన్న మొన్న కాంగ్రెస్‌ను అమ్మానాభూతులు తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు

*మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది: Tulasi reddy
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరిత్రాళ్లు బిగించడమే అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

*తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు?: మంత్రి Niranjan
రాహుల్ గాంధీ ఎవరు తెలంగాణ నాయకులను క్షమించడానికి అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారన్నారు. రెండు పర్యాయాలు క్షమించకనే ఓడగొట్టారని అన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చితన్నారన్నారు. తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోందని తెలిపారు. రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతోందన్నారు. రాహుల్ ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారని మంత్రి నిలదీశారు. జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. తమరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదని, ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్ధించిందని అన్నారు. నిన్న మొన్న కాంగ్రెస్‌ను అమ్మానాభూతులు తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు

*కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉంది: బాల్క సుమన్
కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కొత్త థియేటర్‌లో పాత సినిమా లాగా ఉందన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉంటాడట అని ఎద్దేవా చేశారు. స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడన్నారు. బీజేపీ నడ్డా సభలో కూడా ఒక్కడు కూడా ఉద్యమంలో లేడన్నారు. బండి సంజయ్‌పై తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసైన ఉందా? అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ ఎవడికి తెలుసని బాల్క సుమన్ పేర్కొన్నారు

*గంజాయి అక్రమాలు బాబే చేయిస్తున్నారు: నాగార్జున
‘‘గుంటూరు, విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ వారే ఉన్నారు. పక్కాప్లాన్‌ ప్రకారం గుడ్డ కాల్చి జగన్‌ నెత్తిన వేయాలనే ఆలోచనతో టీడీపీ ఉంది. రానున్న రోజుల్లో టీడీపీ వేసే ప్లాన్‌లన్నీ బహిర్గతం అవుతాయి’’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ఒంగోలు ఎన్‌ఎ్‌సపీ అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి రవాణా, దొంగతనాలను బాబే చేయిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్‌ ఒక వీఽథి రౌడీలాగా మాట్లాడుతున్నారని నాగార్జున ధ్వజమెత్తారు. కాగా.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మండిపడ్డారు. సామాజిక వర్గాల సమీకరణాల కోసం బాలినేనిని మంత్రి పదవిని త్యాగం చేశారనే విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు.

*పాలన చేతగాక ప్రతిపక్షాలపై అపవాదా?: రామకృష్ణ
‘‘పాలన చేతగాక, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించలేక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షాలపై అపవాదులు వేస్తున్నారు. ఇది తగదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హోం మంత్రి మహిళ… మహిళలపై జరుగుతున్న దురాగతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకు తగదన్నారు. నిందితుడు సాధిక్‌ బాషాను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు.

*ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం వద్దు: జోగి
పేదల పక్కా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి అలసత్వమూ వద్దని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విజయవాడ నుంచి అన్ని జిల్లాల హౌసింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రూఫ్‌ లెవెల్‌ వరకూ వచ్చిన ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మూడో ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెల 31లోగా ప్రారంభించాలన్నారు.

*పవన్‌ వస్తున్నారని రైతులకు సాయమా?: నాదెండ్ల
జగన్‌ తన రాజకీయ మనుగడ కోసమే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని, పాలనలో సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8న పవన్‌ నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్న నేపథ్యంలో ఉన్నఫలంగా ఒక్కో రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయలు అందజేసి రచ్చబండ కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతు కుటుంబాలకు చేరాల్సిన రూ.7 లక్షలు అందజేయాలని డిమాండ్‌ చేశారు

*పాలకులకు బాధ్యత లేదు.. పోలీసులైనా శ్రద్ధ చూపాలి
రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి పాలకులు పట్టించుకోవడం లేదని, కనీసం పోలీసు ఉన్నతాధికారులైనా శ్రద్ధ చూపి ఇలాంటి ఘటనలను నివారించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. అత్యాచార ఘటనలపై శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని ఘటన, నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు.‘రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ ఇవ్వాలి. ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించాలి’ డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా పాలకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై సీఎం ఇంతవరకూ సమీక్ష కూడా చేయకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను హైకోర్టు సుమోటోగా తీసుకుని ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

*చంద్రబాబు, పవన్‌ పొత్తు ఊహించిందే: మిథున్‌రెడ్డి
‘‘చంద్రబాబు, పవన్‌ మధ్య పొత్తు మాకు ఆశ్చర్యమేమీ కాదు. మేం ఊహించినదే. దానికి మా వైసీపీ సిద్ధంగా ఉంది. మొదటి నుంచి పవన్‌.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడిచారు’’ అని ఎంపీ పెదిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు… వైసీపీది అరాచక పాలన అని విమర్శించారు కదా! అని అడిగితే… ‘‘ఏ ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్షాన్ని పొడగరు. చంద్రబాబు విమర్శిస్తే ఆశ్చర్యం లేదు. ఆయన పొగిడితే ఆశ్చర్యపోవాలి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.

*రోజా ఆంటీ… ఇది జబర్దస్త్‌ షో కాదు: అయ్యన్న
‘‘విశాఖ జిల్లాలో తాళ్లవలస అయితే శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస అంటోంది. జై బాబు అని జనం అంటుంటే.. జై జగన్‌ అన్నారని కోడికత్తి కతలు చెబుతోంది. అమీర్‌పేట ఎడిటింగులు.. మార్కాపురం మార్ఫింగ్‌లతో ఇంకెన్నాళ్లీ జగన్నాటకం!’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘రోజా ఆంటీ అరంగుళం మేకప్‌ వేసుకుని వచ్చేయడానికి ఇది జబర్దస్త్‌ షో కాదు. స్క్రీఫ్ట్‌ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకు జట్కా బండి కాదు. దొంగ పెట్టిన దొంగ చానల్‌. వాళ్ల స్క్రీఫ్ట్ పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్కయిపోతావు. రాసినోడంటే జగన్‌రెడ్డిలాగా పదో తరగతి పేపర్లు ఎత్తుకెళ్లి పాసైన బ్యాచ్‌ అనుకుందాం. చదివే యాంకరమ్మకైనా మతి ఉండాలి కదా?!’’ అని ట్వీట్‌ చేశారు.

*నడ్డావి అర్ధరహిత ఆరోపణలు: శ్రీనివాస్‌గౌడ్‌
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రూ.20 వేల కోట్లతో పూర్తయ్యేదని, టీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలు అర్థరహితమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఓ వైపు కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్న విషయం నడ్డాకు తెలియదా? అని ప్రశ్నించారు. శుక్రవారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. పులి లాంటి కేసీఆర్‌ను దెబ్బతీయాలని చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీ దెబ్బతినడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులను వాడు.. వీడు, అరేయ్‌.. ఒరేయ్‌ అంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అరేయ్‌ బండిగా.. ముందు సం స్కారం నేర్చుకో.. నీవెవనివిరా..? నాలుక చీరేస్తా.. అంటూ రాయలేని విధంగా సంజయ్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. గతంలో పనిచేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంతో సంస్కారంతో ఉండేవారని, వారిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సంజయ్‌ పాదయాత్ర చేస్తూ మరోవైపు కాంట్రాక్టర్లను డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు

* ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి
‘ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు పోబోతున్నాం..’అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘మేం (వైకాపా) బలోపేతమవుతున్నాం. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేసిన పథకాలు విజయవంతమయ్యాయి. ప్రజల్లో మా పట్ల ఆదరణ పెరిగింది. ఇది పొగరుగా కాదు… వినయంగానే చెబుతున్నాం…’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్నట్లు పార్టీలన్నీ కలిసి వస్తే వైకాపా ఎలా ఎదుర్కొంటుందని విలేకరులు అడగ్గా.. ‘గతంలోనూ వారంతా కలిసే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని వారంతా విడిపోయినట్లు చూపిస్తారు. అధికారంలో లేనప్పుడు కూటమిగా కలిసి బలం చూపించేలా ప్రయత్నిస్తారు. వారంతా కలిసినా…విడిపోయినా వారిది వాపు మాత్రమే బలుపు కాదు…’అని సజ్జల పేర్కొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విజయసాయిరెడ్డి, సజ్జల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనిపై విలేకరులు అడగ్గా.. సజ్జల స్పందిస్తూ..‘మా భేటీలో ప్రత్యేకతేమీ లేదు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, సీఎం ఆదేశాలను పాటిస్తుంటాం…’అని సమాధానమిచ్చారు.

*రాహుల్ అజ్ఞాని.. గాంధీ భ‌వ‌న్‌లో గాడ్సే : మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీకి వ‌త్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని రాహుల్ గాంధీ నిన్న‌టి వ‌రంగ‌ల్ స‌భ‌లో మాట్లాడిండు అని కేటీఆర్ గుర్తు చేస్తూ.. గాంధీ భ‌వ‌న్‌ను గాడ్సేకు అప్ప‌జెప్పావని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆర్ఎస్ఎస్ భావ‌జాలాన్ని న‌ర‌న‌రాన నింపుకున్న వ్య‌క్తికి అప్ప‌జెప్పావు. నీవు ఏం తెల్వ‌నోనివి. రాసిస్తే చ‌దివి పోయే వ్య‌క్తివి. అభం శుభం తెలియ‌ని అమాయ‌కుడివి అజ్ఞానివి.. అంత‌కే ఉంటే మంచిద‌ని రాహుల్‌ను కేటీఆర్ హెచ్చ‌రించారు.