Health

రోగ నిరోదక శక్తిని పెంచే గోధుమనార రసం

రోగ నిరోదక శక్తిని పెంచే గోధుమనార రసం

 ఆధునిక జీవనంలో ప్రధాన భాగమైపోయిన పిజ్జాలు, బర్గర్ల నుంచి, సూప్స్, కూల్ డ్రింక్స్ దాకా…. అన్నీ ప్రాణాల్ని హరింపచేసేవే తప్ప వీటిల్లో ఏ ఒక్కటికి కూడా ప్రాణాల్ని నిలబెట్టే శక్తి లేదు. వేల సంవత్సరాల క్రితమే కొందరు మహర్షులు అద్భుతమైన ప్రకృతి చికిత్సా విధానాలెన్నో సూ చించారు. వాటిల్లో ఏ కొన్ని పాటించినా, మాన వ శరీరాలు ఇంతగా రోగగ్రస్థమయ్యేవే కాదు. ప్రస్తుతానికి గోధుమ నారు (గోధుమ గడ్డి) రసం, లేదా పొడినే తీసుకుంటే.. మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవశక్తిని పదిం తలు చేయడంలో దాని పాత్ర ఎంతో కీలకమని చెప్పే పలు శాస్త్రీయ విశ్లేషణలు మన ముందు న్నాయి.మన శరీరానికి అవసరంగా, మనసుకు ఆసక్తికరంగా అనిపించేవే కావచ్చు. వాటిల్లో అన్నింటికి అన్నీ మేలు చేసేవిగా ఏమీ ఉండవు. మనకు అందుబాటులో ఉన్న ఏ పదార్థంలో నైనా, శరీరానికి మేలు చేసేవాటితో పాటు కీడు చేసేవీ ఉంటాయి. అయితే, ప్రకృతి సిద్ధమైన వాటిల్లో ప్రత్యేకించి గోధుమ నారులో మాత్రం, ఆరోగ్యదాయకమైనవే తప్ప వాటిల్లో ఏ ఒక్క అంశమూ హానికారకమైనవి కావు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ గోధుమ గడ్డి రసం లేదా చూర్ణం, ఒక ఔషధంగా ఆదరణ పొందుతోంది.
***ఎలా తీసుకోవాలి?
గోధుమ గడ్డిలో విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒకే పదార్థంలో ఇవన్నీ ఉండడం వల్ల ఒకుమ్మడిగా వాటన్నింటినీ తీసుకోవడంలో మొదట మన శరీరం కొంత ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మన శరీరంలో మలినాలు బాగా పేరుకుపోయి నప్పుడు వాటిని స్వీకరించడానికి శరీరం ఇష్టపడ దు. అందువల్ల ముందు బాగా విరేచనం అయ్యే లా చూసుకోవాలి. నాలుగు రోజుల పాటు ఘనా హారం ఏమీ తీసుకోకుండా, వెచ్చని నీరు, పండ్ల రసం తీసుకోవాలి. చాలా స్వల్పంగా ఉడికించిని కాయగూరలు తీసుకోవచ్చు. ఇలా నాలుగు రోజులు గడిపాకే గోధుమ నారు రసంగానీ, చూర్ణం గానీ తీసుకోవాలి. గోధుమ నారు రసం లో పీచుపదార్థం ఉండదు. కాబట్టి చూర్ణాన్ని నీళ్లల్లో కలుపుకుని తీసుకోవడమే ఉత్తమం. ఈ రసాన్ని తయారు చేసుకున్న వెంటనే తాగెయ్యాలి. చాలా సేపు అలాగే ఉంచితే అందులోని ఔషధ గుణాలు తగ్గుతాయి. ఒకవేళ ఈ రసం వగరుగా, ఘాటుగా అనిపిస్తే, కొంచెం తేనె కలిపి తాగవచ్చు.