Movies

బాలయ్య చేతుల మీదగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించనున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్నో కోట్ల మంది మదిలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 28న ఉదయం నిమ్మకూరులో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున మధ్యాహ్నం గుంటూరు, సాయంత్రం తెనాలిలో జరగనున్న కార్యక్రమాలకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకల నిమిత్తం ఆయా ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇక, ఈ ఏడాది పొడవునా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగనున్నాయి.