NRI-NRT

మే 27, 28,29 తేదీలలో ఘనంగా ‘తానా’ గేయ తరంగాలు

మే  27, 28,29 తేదీలలో  ఘనంగా ‘తానా’ గేయ తరంగాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని ” తానా గేయ తరంగాలు” పేరుతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ గేయ కవిసమ్మేళనం” నిర్వహిస్తుంది. మే 27,28,29 వ తేదీల్లో జూమ్ సమావేశం లో జరగబోయే కార్యక్రమం లో మొత్తం 81 మంది కవులు గేయ గానం చేస్తారు. వీరితో పాటు దేశ విదేశాల అతిథులు , పెద్దలు సందేశాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముందు పలు సామాజిక అంశాలపై తానా ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ స్థాయిలో గేయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలలో ఎంపికైన కవులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారతదేశ సమగ్రత, రక్షణ, దేశభక్తి, మత సామరస్యం, రైతులు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, యువశక్తి, సాంకేతిక సంచలనాలు, సామాజిక స్పృహ, భవిష్య భారతం, మానవీయ విలువలు వంటి అంశాల పై కవిత్వం ద్వారా చైతన్యం కలిగించటానికి, తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం మరియు కవులను ప్రోత్సహించడం కోసం ఈ మూడు రోజుల బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగిందని తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు, ప్రచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు. అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే
ఈ “తానా గేయ తరంగాలు” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది.
283809611-10217330789821710-7717478861972810590-n
283964662-10217330789981714-1558014611038873446-n
283973427-10217330790221720-3445311688833848590-n
283998731-10217330786301622-4151203813514854505-n
284285290-10217330790141718-3877255564243412197-n