Movies

లండన్‌లో ‘పుష్ప’ సింగర్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

లండన్‌లో ‘పుష్ప’ సింగర్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్‌) అంటూ తన గాత్రంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో గ్రాండ్‌ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ సందడి చేసింది. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌, హీరోయిన్‌ కాజోల్‌ ముద్దుల తనయ నైసా దేవగన్‌ ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు హాజరైంది.
kanika-kapoor
తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న నైసా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్‌ పింగ్‌ డ్రెస్‌లో లైట్‌ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్‌లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్‌, తండ్రి అజయ్‌ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది.
kanika1
https://www.instagram.com/orry1/?utm_source=ig_embed&ig_rid=f3024a9c-cbdd-49eb-8c8a-0bd30cb7024b