DailyDose

లాబీయింగ్ కోసం తిరుమల లడ్డూలను పెద్ద ఎత్తున తరలించిన ధర్మారెడ్డి

లాబీయింగ్ కోసం తిరుమల లడ్డూలను  పెద్ద ఎత్తున తరలించిన ధర్మారెడ్డి

ఢిల్లీలో ఎక్స్టెన్షన్ కోసం లాబీయింగ్ కి తిరుమల శ్రీవారి 300 కల్యాణోత్సవం పెద్ద లడ్డూలు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎవరు తరలించారు? ఎందుకు తరలించారు? ఎవరి ఖాతాలో నుంచి టీటీడీకి డబ్బు జమ అయింది?

టీటీడీకి సంబంధించిన ధర్మా రెడ్డి ఢిల్లీలో ఎక్స్టెన్షన్ కోసం లాబీయింగ్ లో భాగంగా ఏకంగా 300 కల్యాణోత్సవం పెద్ద లడ్లు తీసుకుని మరీ తిరుపతి నుంచి ఢిల్లీకి విమానంలో నిన్న వెళ్లడం జరిగినది.

ఆ 300 కళ్యాణోత్సవం పెద్ద లడ్లు టీటీడీ ఖాతాలో నుంచి జమ అయినట్లు సమాచారం.టీటీడీలో ఏ ఒక్క ఉద్యోగి అయిన ఐదు చిన్న లడ్లు తీసుకుంటేనే రాద్దాంతం చేసే ఆ అధికారి ఏకంగా 300 కల్యాణోత్సవం పెద్ద లడ్లు తీసుకుని వెళ్లడం.

అంత బరువుని తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది అనుమతించుటకు అంగీకరించకపోగా మరో ఎయిర్క్రాఫ్ట్ లో సిఫార్సు చేయించుకుని మరీ తీసుకుని వెళ్లిన ఆ టీటీడీ ఉన్నతాధికారి.