ScienceAndTech

రొమ్ము క్యాన్సర్‌కు కొత్త ఔషధం

రొమ్ము క్యాన్సర్‌కు కొత్త ఔషధం

రొమ్ము క్యాన్సర్‌ పేషెంట్లలో హెర్‌2(హ్యూమన్‌ ఎపిడెర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 2) ప్రొటీన్‌ స్థాయులు తక్కువగా ఉండేవారికి అద్భుతంగా పనిచేసే ఎన్‌హెర్టు అనే సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇది ఆస్ట్రాజెనెకా, డాయిచి సాంక్యో కంపెనీల తయారీ. రొమ్ము క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయనప్పటికీ కీమోథెరపీతో పోలిస్తే క్యాన్సర్‌ వృద్ధిని, మరణించే ముప్పును ఈ ఔషధం 50ు తగ్గిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. రొమ్ము క్యాన్సర్‌ పేషెంట్లలో శరీరంలోని కణితిలో హెర్‌ 2 ప్రొటీన్‌ 3 కన్నా ఎక్కువగా ఉంటే ‘హెర్‌ 2 పాజిటివ్‌’గా, ఒకటి కన్నా తక్కువగా ఉంటే ‘హెర్‌ 2 నెగెటివ్‌’గా వర్గీకరించి అందుకు తగినట్టుగా చికిత్స చేస్తారు. ఈ రెండింటికీ మధ్య తక్కువ స్థాయిలో (హెర్‌ 2 వన్‌+ నుంచి హెర్‌ 2 టూ + దాకా) ఉండేవారిపై ఇన్‌హెర్టు పనిచేస్తుందని.. దీన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పేషెంట్లలో హెర్‌ 2గా పేర్కొంటారని ఉత్పత్తిదారులు వెల్లడించారు. నెలకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఈ ఔషధానికి నియంత్రణ సంస్థల అనుమతి రావాలి.