Politics

ఏపీలో అధికారం కోసం  కలలు  కంటున్న భాజపా

ఏపీలో అధికారం కోసం  కలలు   కంటున్న భాజపా

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం అంటే.. దూరదర్శన్ స్టుడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించినంత ఈజీ అని బీజేపీ అనుకుంటున్నట్టుగా ఉంది. ఏపీలో వైసీపీపోయి బీజేపీ సర్కారు రావాలని ప్రగల్భాలు పలుకుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నయాపైసా మేలు చేయకపోగా.. ఈ రాష్ట్ర ప్రజలు తమ కమలం గుర్తుపై ఓటు వేస్తారని బీజేపీ ఎలా అనుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఆంధ్రదేశపు ప్రజానీకం మరీ అంత పిచ్చిగా వారికి కనిపిస్తున్నారేమో తెలియడం లేదు. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వైసీపీ జగన్ తో లాలూచీ రాజకీయాలు తెరవెనుక నడుపుతూ ఉంటారు. మరోవైపు వైసీపీ పాలన రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేసిందంటూ ఉత్తుత్తి విమర్శలు కురిపిస్తూ ఉంటారు. పేరుకు జనసేన- పవన్ తో మైత్రీ బంధం కొనసాగిస్తూ.. పవన్ తీవ్రస్థాయిలో తూలనాడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు మద్దతు కోసం ఆరాటపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రజలు అమాయకంగా లేరు. కమలం డ్రామాల్లాంటివి చాలా చాలా చూస్తున్నారు. కమల నేతలు రంకెలు వేసినంత మాత్రాన ఓట్లు రాలవు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ లాంటి అనేకానేక విషయాల్లో వారి అంతిమనిర్ణయం ఏమిటో తేల్చి చెబితే తప్ప.. ప్రజలు ఎన్నటికీ క్షమించరు.