Devotional

వెంకన్న సన్నిధిలో ” కొప్పెర ” అంటే ఏంటో తెలుసా..?

వెంకన్న సన్నిధిలో ” కొప్పెర ” అంటే ఏంటో తెలుసా..?

కేవలం తెలుగు రాష్ట్రాలు, భారత దేశ నలుమూలల నుండి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించేందుకు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ఆయన దర్శనం చేసుకుంటారు.మనలో చాలా మంది సంవత్సరంలో ఒక్కసారైనా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలని అనుకునేవారు ఎందరో.తిరుమలలో ప్రతి చోట ఒక విశేషం దాగి ఉంటుంది.ఇందులో స్వామి వారి గుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.నిజానికి తిరుమలలో కొన్ని పలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.అందులో చాలావాటికి మనకు సరిగా అర్థం కూడా తెలియదు.ఇందులో ప్రముఖంగా స్వామి వారి సన్నిధిలో అప్పుడప్పుడు “కొప్పెర” అనే మాట వినబడుతుంది.అసలు ఈ ” కొప్పెర ” అంటే ఏమిటి.? అసలు ఎందుకు ఆ పేరు వచ్చిందనేది ఒక సారి చూద్దాం…అసలు కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపు పాత్ర అని అర్థం.అది ఎలా అంటే మనం తిరుమలకి వెళ్ళినప్పుడు స్వామి వారి హుండీ ని చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

స్వామివారి ఆలయంలో ఉన్న హుండీని ఎన్నిసార్లు మారుస్తుంటారో అందరికీ తెలిసిందే.కాబట్టి ఓ పెద్ద గంగాళాన్ని తీసుకువచ్చి దానిని హుండీగా ఉంచి ఆ పై తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచి ఆ గుడ్డను భక్తులు కానుకలను సమర్పించడానికి వీలుగా ఉండే విధంగా దానిని తయారుచేస్తారు.ఇకపోతే స్వామి వారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా ఉపయోగిస్తారు.భక్తులు వారి మొక్కులను తీర్చుకోవడానికి వీలుగా సమర్పించే కానుకలను ఈ శ్రీవారి హుండీలో వేస్తారన్నా విషయం అందరికీ తెలిసిందే.ఇక పొతే తిరుమలకు ప్రతి రోజు ఎంత మంది భక్తులు వస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా భక్తులు వేస్తున్న కానుకలతో నిండిన హుండీని ప్రతిసారి అక్కడ ఉన్న టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు.

నిండిన హుండీలను వెంటనే అక్కడ సహాయకులతో కలిసి మోసుకొని తిరుపతిలోని హది రాంజీ మఠానికి తీసుకు రావడం జరిగేది.ఇదివరకు ఈ కాలంలో ఈ కానుకలను లెక్కించేందుకు కు టిటిడి నిర్వాహకులైన మహంతులు ఉండేవారు.ఇలా శ్రీవారి హుండీ ని లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును “పరకామణి” అని పిలుస్తారు.ఇక ప్రస్తుత కాలంలో ఈ హుండీ లెక్కింపు మొత్తం గుడి ఆవరణంలోనే ఒక వైపు జరుగుతుంది.ఇందుకు గాను ప్రస్తుతం సేవా కార్యక్రమం ద్వారా వచ్చిన భక్తులను ఈ హుండీ లెక్కింపును చేపడుతున్నారు.ఇక రాత్రి సమయంలో అక్కడే ఉన్న హుండీని “తోకముల్లే “ అని పిలుస్తారు.ఇక స్వామివారికి కానుకలు వేసే భక్తులు కొప్పెర లో అనేకమంది డబ్బులతో పాటు బంగారం, వెండి, ఇంకా స్వామి వారికి ఏదైనా సమర్పించాలని అనుకున్న వాటిని వేయడమే కాకుండా విదేశీ కరెన్సీ కూడా అప్పుడప్పుడు హుండీ లో వస్తూనే ఉంటుంది.