DailyDose

ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ‘రక్తదానం’

ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ‘రక్తదానం’

ప్రతి ఏడాది రక్తం సరైన సమయంలో దొరకక కొన్ని వేల ప్రాణాలు పోతుంటాయి. రక్తం యొక్క ప్రాధాన్యాత తెలిపేందుకు, రక్తదానంపై అవగాహనా పెంచడానికిగానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సకాలంలో మీరు చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాల్ని కాపాడుతుంది. రక్తదానంతో కొన్ని సందర్భాలలో తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలు దక్కుతాయి.

వరల్డ్ బ్లడ్ డోనర్ డే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా 2004లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించింది. అయితే జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. రక్తవర్గాలను కనిపెట్టిన కార్ల్ లాండ్‌స్టీనర్ 1868లో ఇదే రోజున జన్మించారు. ఏబీఓ రక్తగ్రూపుల వ్యవస్థను ఆయన కనిపెట్టినందుకుగానూ, ఆయన సేవలకు గుర్తింపుగా నోబెల్ బహుమతి అందుకున్నారు.

ప్రాముఖ్యుత
ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి మూడు నుంచి నెలల మధ్య కాలంలో రక్తదానం చేయాలని అందుకోసం ప్రత్యేకమైన రోజును డబ్ల్యూహెచ్‌వో తీసుకొచ్చింది. కొందరిలో అధిక రక్తపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ ఏడాది థీమ్
ప్రతి ఏడాది ఏదైనా ఒక థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. ఈ ఏడాది రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనే థీమ్‌ను ప్రకటించింది. కనుక ఎవరికైనా అవసరం ఉందని తెలిస్తే కచ్చితంగా రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని, ఆ అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఇటలీ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2021ను నిర్వహిస్తోంది. నేషనల్ బ్లడ్ సెంటర్ కేంద్రగా ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసి రక్తం ప్రాధాన్యత, రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తుంది.