NRI-NRT

ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీల్లు ఆగడం లేదు – బిల్‌గేట్స్‌

ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీల్లు ఆగడం లేదు – బిల్‌గేట్స్‌

వారిద్దరు ప్రపంచ కుబేరులు. ఒకే సమయంలో ‍వ్యాపార సామ్రాజ్యంలో పోటీ పడ్డారు. వారిలో ఒకరు వారెన్‌ బఫెట్‌ అయితే, మరొకరు బిల్‌గేట్స్‌. సంప్రదాయ వాణిజ్యం, స్టాక్‌మార్కెట్‌లో వారెన్‌ బఫెట్‌ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే.. టెక్నాలజీ బాట పట్టి మైక్రోసాఫ్ట్‌తో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు బిల్‌గేట్స్‌. వ్యాపారంలో ఇద్దరి దారులు వేరైనా వాటి ద్వారా వచ్చిన సంపద ఖర్చు పెట్టడంలో ఇద్దరూ ఒక్కటే. తమ దగ్గరున్న సంపదను సేవా కార్యక్రమాలను వెచ్చించడంలో వీళ్లద్దరూ ఎప్పుడూ ముందుంటారు.ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ధనవంతుడిగా వెలుగొందుతున్న కాలంలో మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ గేట్స్‌ – మిలిండా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆహారం, విద్యా, వైద్యం మొదలు వ్యాక్సిన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిల్‌గేట్స్‌ ఉద్దేశాలు నచ్చి వారెన్‌ బఫెట్‌ సౌతం గేట్స్‌ – మిలిందా ఫౌండేషన్‌కి భారీ ఎత్తున విరాళం అందిస్తున్నాడు.

తాజాగా గేట్స్‌ – మిలిందా ఫౌండేషన్‌కి నాలుగు బిలియన్‌ డాలర్లు అందించాడు వారెన్‌ బఫెట్‌. దీంతో ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్‌కు వారెన్‌ బఫెట్‌ అందించిన సాయం ఏకంగా 36 బిలియన్‌ డాలర్లకు చేరింది. కీర్తి కోసం పాకులాడకుండా తన మిత్రుడు నడిపిస్తున్న స్వచ్చంధ సంస్థకు వారెన్‌ బఫెట్‌ భారీగా విరాళం అందిస్తున్నాడు. దీంతో మంచి పనులు చేసేందుకు సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు వారెన్‌ బఫెట్‌ అందిస్తున్న సహకారం చూస్తుంటే తన కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ గేట్స్‌ పేర్కొన్నారు.