DailyDose

అక్కడ గంజాయి తినొచ్చు.. తాగొచ్చు..

అక్కడ గంజాయి తినొచ్చు.. తాగొచ్చు..

 గంజాయిని తీసుకోవడం చట్టరీత్యా నేరం. అందులో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఆ పంట వేయడం కూడా మన దగ్గర నిషేధం. మరి అలాంటి గంజాయి కలిపిన కాఫీలూ, శాండ్విచ్లూ, లస్సీ, ఇతర పానీయాలూ అందిస్తోంది పుణెలోని’ ది హెంప్ కెఫెటేరియా’. అమృత ఏర్పాటు చేసిన ఆ కెఫే ప్రభుత్వ అనుమతితోనే నడుస్తోంది. అంతేకాదు, తినుబండారాల్లో కలిపే గంజాయి పొడిని భంగ్ అంటారు. దాన్ని లేలేత గంజాయి ఆకులూ మొగ్గలూ, పువ్వుల నుంచి తయారుచేస్తారు. ఉత్తరాఖండ్లో గంజాయి సాగుకి అనుమతి ఉండటంతో అక్కడి నుంచి భంగ్ని కొనుగోలు చేస్తుంది అమృత. అలానే, ఉత్తరాదిన హోలీ వేడుకల్లో భాగంగా చాలామందికి భంగ్తో చేసిన పానీయాన్ని తీసుకోవడం ఆనవాయితీ. అది ఆ ఒక్కరోజునే చేస్తారు. చిన్నతనం నుంచీ ఆ పానీయాన్ని తీసుకోవడంతోపాటు అందులో ఔషధ గుణాలున్నాయని తెలుసుకున్న అమృత కెఫే ఏర్పాటు చేసి భంగ్ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ముందుకొచ్చింది. నాలుగేళ్లనుంచీ ఈ కెవేని నడుపుతున్న ఆమె కాపీలూ,శాండ్ విష్ లతో పాటు భాంగ్ పానీయాన్ని కూడా ఏడాదంతా విక్రయిస్తోంది.