DailyDose

రేపు తిరుపతికి జగన్ – TNI తాజా వార్తలు

రేపు తిరుపతికి జగన్ –  TNI  తాజా వార్తలు

* సీఎం జగన్‌ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 11.15 – 11.45 గంటల మధ్య వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని, హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ భూమి పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్ద వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

*యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్‌ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది.ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

*రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అనిల్ కుర్మాచ‌లం, రాష్ట్ర రెడ్కో చైర్మ‌న్‌గా వై స‌తీష్ రెడ్డి నియామ‌కం అయ్యారు. స‌తీష్ రెడ్డి ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ఇంచార్జిగా కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రూ త‌మ ప‌ద‌వుల్లో మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

*ప్రేమ‌కు హ‌ద్దులు లేవు.. ప్రేమించుకోవ‌డానికి స‌రిహద్దులు లేవు.. ఇంకేముంది.. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువ‌తి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌కుడి ప్రేమ‌లో ప‌డిపోయింది. మ‌న‌సారా ప్రేమించుకున్న ఆ ప్రేమికులిద్ద‌రూ జీవితంలోనూ ఒక్క‌ట‌య్యారు.

* సీఎం జగన్‌తో సీఎస్, డీజీపీ, మంత్రి విశ్వరూప్ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, తీసుకున్న చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కోనసీమకు అంబేద్కర్ పేరుపై చర్చిస్తున్నట్లు తెలిసింది. కోనసీమ అంబేద్కర్ నోటీఫికేషన్‌పై అభ్యంతరాల గడువు పూర్తైంది. కోనసీమ అంబేద్కర్ పేరుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

*వరంగల్: జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే భూమి తమదంటూ అక్కడి స్థానికులు గుడిసెలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కర్రలతో పరస్పరం దాడులకు యత్నించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

*ఖైతాలాపూర్ ఫ్లైఓవర్ప్రా రంభోత్సవంలో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సభా ప్రాంగణం వద్ద ‘మంత్రి కేటీఆర్ని రుద్యోగ భృతి ఎక్కడా?.. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడా? అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. బల్దియా సిబ్బంది వాటిని తొలగించింది.

*ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తలసాని తెలిపారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. విశ్వవ్యాప్తమైన తెలంగాణ బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని తెలిపారు.

*కోనసీమ: జిల్లాలోని ఆలమూరులో పంట నష్ట పరిహారం బీమా చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తోన్నాయి. అసలు రైతులకు కాకుండా నకిలీలకు అధికారులు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీమా చెల్లింపుల్లో అవకతవకలపై టీడీపీ ఆధ్వర్యంలో రైతులు ఆలమూరు వ్యవసాయ కార్యాలయం ముట్టడించారు. ఆలమూరులోనే రూ.10లక్షల వరకు బీమా సొమ్ము పక్కదారి పట్టినట్లు ఆరోపణ ఉంది. సూర్యరావుపేట సర్పంచ్ భర్త చింతపల్లి నాగేశ్వరరావు పేరిట రూ.8లక్షల చెల్లింపు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

*గుడివాడ రూరల్ మండలం, రామనపూడిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి.. ఆ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ఫో టో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ సచివాలయంలో ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. గ్రామస్తుల ఆందోళనలతో, సీఎం జగన్ ఫోటో తీసివేసి తిరిగి యధాస్థానంలో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేశారు. ఐదేళ్లకోసారి మారే ముఖ్యమంత్రి ఫోటో కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు ఖండించారు.

*ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ యధేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘిస్తోంది. మర్రిపాడు మండలం, నందవరం గ్రామంలోని గ్రామ సచివాలయ కార్యాలయంలో వైసీపీ నాయకులు బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీకే ఓటు వేయాలని గ్రామ ప్రజలచే స్థానిక వైసీపీ నాయకులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అక్కడున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.కాగా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పటికీ వైసీపీ నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా ఒక్కో ఓటరకు రూ. 5 వందల నుంచి రూ. 2వేల వరకు పంపిణీ చేస్తోంది. వైసీపీ డబ్బుల పంపిణీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

*ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు )లో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ లోని రాజీవ్‌ స్వగృహ కు ఇచ్చిన భూమి వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్‌ స్వగృహాకు ఇచ్చిన భూమిలో ఏపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. రాజీవ్‌ స్వగృహ భూముల వేలానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 25 ఎకరాలు అమ్మాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు తరుఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. మధ్యతరగతి వారి ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని.. వేలం వేయడమేంటని లాయర్‌ అశ్వినీకుమార్ ప్రశ్నించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్లాట్లు వేలం వేయడానికి వీలు లేదని హైకోర్టు స్టే విధించింది.

*గన్నవరం ఎయిర్‌పోర్ట్ రన్‌వే నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని 400 మందికి పైగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రన్‌వే విస్తరణలో ప్రైవేట్ వెంచర్లు, ఫ్లాట్స్‌ కోల్పోయిన బాధితులు ఉన్నారు. తమకు పరిహారం ఇవ్వకుండా అధికారుల ఇళ్ల కోసం.. తమ స్థలాల నుంచి దారులు వేయడం దారుణమని నిర్వాసితులు వాపోతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాలకు వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని నిర్వాసితులు చెబుతున్నారు.

*సీఎం జగన్కు తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. మైనార్టీల అభివృద్ధి కోసం తెదేపా హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆపేయడం దారణమని మండిపడ్డారు. వైకాపా పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. తక్షణమే ఆ పథకాలను పునరుద్ధరించి మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ చర్యలతో మైనారిటీలు మరింత పేదరికంలోకి వెళ్లిపోయారన్నారన్న అనగాని.. వైకాపా పాలనతో వారికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడారని దుయ్యబట్టారు. మూడేళ్లుగా యువతకు ఉపాధి కరువైందని.. ఉన్నత విద్య, విదేశీ విద్య నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు చేపట్టారన్నారు. జగన్‌ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. ముస్లిం ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.

*శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం మళ్లీ మొదలైంది. సరిహద్దు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తాయోనని వణుకుతున్నారు. 14 ఏళ్లుగా గజరాజులు అటూఇటూ తిరుగుతూ నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. భామిని, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల పరిధిలోని గ్రామాల్లోనే తిష్ఠవేసి సంచరిస్తూనే ఉన్నాయి.

*వరంగల్: జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే భూమి తమదంటూ అక్కడి స్థానికులు గుడిసెలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కర్రలతో పరస్పరం దాడులకు యత్నించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని కిడిసింగిలోని గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కిడిసింగిలో రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న జరిగిన ఘటనతో వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ టీం.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ బెళగావిలో నిరసనకు దిగిన 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కడా లేకున్నా బెళగావిలో మాత్రం మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. సోమవారం కోటెకెరె ప్రాంగణంలో ఆందోళన చేసేందుకు సిద్ధమైన వారంతా ఆర్టీసీ బస్సుల్లో వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వందమందిని అదుపులోకి తీసుకుని కేఎస్ఆర్‌పీ గ్రౌండ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి బసవేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయం నిండిపోవడం, మరింత మంది అక్కడికి చేరడంతో రిజర్వు పోలీస్‌ బెటాలియన్‌ సభాభవనానికి తరలించారు. ఆందోళనకారుల చెంతకు మీడియాను అనుమంతించలేదు. సెంట్రల్‌ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, అశోక్‌ సర్కిల్‌, రాణి చెన్నమ్మ సర్కిల్‌, మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌, బస్టాండ్‌తోపాటు పలు ప్రాంతాలలో యువకులు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు ఆందోళన జరగకుండా కట్టడి చేశారు. బెళగావి నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం బోరలింగయ్య స్వయంగా నగర వ్యాప్తంగా పర్యటించారు

*kadapa నగరంలోని తిలక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతను బాధితులతో కలిసి CPI నేతలు అడ్డుకున్నారు. JCB యంత్రానికి అడ్డుగా నిలబడి ఎమ్మార్వోను బాధితులు నిలదీశారు. ముందు నగరంలో జలమమయ్యే ప్రాంతాల్లో కాల్వ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాధితులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దౌర్జన్యంగా గుడారాలు కూల్చి వేయడం తగదని సీపీఐ నేతలు హెచ్చరించారు. అధికార పార్టీ నేతలెవరైనా ఓట్లు అడగటానికి వస్తే తమ సత్తా చూపిస్తామని బాధితులు పేర్కొన్నారు.

*ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పటికీ వైసీపీ నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా ఒక్కో ఓటరకు రూ. 5 వందల నుంచి రూ. 2వేల వరకు పంపిణీ చేస్తోంది. వైసీపీ డబ్బుల పంపిణీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

* చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ ఆమంచికి నోటీసు ఇచ్చారు. సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద నోటిసు ఇచ్చిన సీబీఐ… రేపు విచారణకు హాజరుకావాలంటూ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు ఆమంచి కృష్ణ మోహన్ హాజరైన విషయం తెలిసిందే.

*దేశంలో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి.నాలుగురోజుల క్రితం తగ్గిన బంగారం ధర మళ్లీ మంగళవారం పెరిగింది. డాలర్ తగ్గుదలతో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి.22 క్యారెట్ల బంగారం ధర మంగళవారం 100రూపాయలు పెరిగి రూ.47,750రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేర పెరిగి రూ.52,080కు చేరుకుంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నై నగరంలో రూ.47,850, ముంబైలో రూ 47,750, ఢిల్లీలో రూ.47,780, కోల్‌కతాలో రూ. 47,780, బెంగళూరులో రూ.47,780, హైదరాబాద్ నగరంలో రూ.47,550 ధరకు పెరిగింది.

*యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిక్రిందాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం అన్నారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు.

*ఇండో టిబెట‌న్ బోర్‌్ర్ పోలీసులు ఇవాళ యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. హిమాల‌య శ్రేణుల్లో త‌మ ఆస‌నాల‌తో యోగా డేలో పాల్గొన్నారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని గ‌త 8 ఏళ్ల నుంచి ఐటీబీపీ ప్ర‌మోట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ల‌డాఖ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, సిక్కిమ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఐటీబీ పోలీసులు యోగాస‌నాల‌తో త‌మ శ‌రీర ధారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. యోగా దినోత్సవం సంద‌ర్భంగా ఐటీబీపీ ఓ పాట‌ను రాసి పాడారు.

*హైదరాబాద్‌ నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌తో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.!నేడు శ్రీవారి దర్శనం కోసం 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 76,597 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 37,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

*అదో ప్రైవేట్ ఆసుప‌త్రి. ఖ‌రీదైన వైద్యం అందిస్తూ కూడా ఆస్తి ప‌న్నుకు సంబంధించి త‌ప్పుడు లెక్క‌లు చూపింది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ ఆసుప‌త్రికి త‌గిన గుణ‌పాఠం చెప్పారు. త‌ప్పుడు లెక్క‌లు చూపిన కార‌ణంగా ఆ ఆసుప‌త్రికి ఏకంగా రూ.24 కోట్ల జ‌రిమానా విధించారు. ఇదేదో ఎక్క‌డో విదేశాల్లోనో, మ‌న దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లోనో చోటుచేసుకున్న ఘ‌ట‌న కాదు. మ‌న భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాద్ శివారు నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ ప‌రిధిలోని బాచుప‌ల్లిలో చోటుచేసుకున్న ఘ‌ట‌నే ఇది. బాచుప‌ల్లి ప‌రిధిలో ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి పేరిట ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి వైద్య సేవ‌లందిస్తోంది. ఏటా స‌ద‌రు ఆసుప‌త్రి ఆస్తి ప‌న్నును మునిసిపల్ కార్పొరేషన్ కు క‌ట్టే క్ర‌మంలో ఆస్తి ప‌న్ను మ‌దింపున‌కు సంబంధించి అధికారుల‌కు త‌ప్పుడు లెక్క‌లు చెప్పారు. త‌క్కువ ప‌న్నే క‌ట్టారు. ఈ విష‌యాన్ని గుర్తించిన నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు… ఆ ఆసుప‌త్రికి ఏకంగా రూ.24 కోట్ల జ‌రిమానాను విధించారు.

*కర్నూలు ఆదోని పట్టణం మాతా శిశు ఆస్పత్రి వద్ద 108 అంబులెన్స్ డ్రైవర్, టెక్నిషియన్ పై గౌళీ పేట చెందిన యువకుల దాడి….తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్, టెక్నీషియన్ ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలింపు… ఘర్షణ కారణం అంబులెన్స్ కు అడ్డుగా ఉన్న స్కూటర్ తీయలంటూ డ్రైవర్ అడగటంతో దాడి చేసిన యువకులు… సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు…

*ఉద్యోగమే వద్దంటూ చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్. పంటల బీమా విషయంలో రైతులు నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గ్రామ వాలంటీర్ తన చెప్పుతో తానే కొట్టుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటుచేసుకుంది. రామదాస్ నాయక్ తండాకు చెందిన నగేష్ నాయక్ అనే వాలంటీర్ గ్రామంలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే.. ఒక్క రైతుకే పంట బీమా అందింది. అయితే పంటల బీమా రాలేదంటూ మిగిలిన రైతులు నిలదీసి.. వాలంటీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని, ఊళ్లోకి వెళ్తే రైతులు చెప్పుతో కొట్టేలా ఉన్నారని.. తన చెప్పుతో తాను కొట్టుకోవడం మేలంటూ చెప్పుతో కొట్టుకున్నాడు. వలంటీర్ ఉద్యోగమే తనకు వద్దని.. రాజీనామా చేస్తానన్నారు.

* బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు ఆయన బేగంబజార్‌ డివిజన్‌లోని సీసీ రోడ్డు, స్టోమ్‌ వాటర్‌ పైప్‌లైన్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

*‘ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారు. ఆయన పాదయాత్ర చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని బీజేపీ నాయకత్వానికి భయం పట్టుకుంది. అందుకే ప్రజల దగ్గరకు రాహుల్‌ వెళ్లకుండా ఈడీ సాయంతో అడ్డుకుంటున్నారు. విచారణ పేరుతో గంటలకొద్దీ కార్యాలయంలో కూర్చోపెట్టి అవమానిస్తున్నారు’’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాతతో కలిసి ఆయన మాట్లాడారు.

*రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌-22 దరఖాస్తుల గడువును జూన్‌ 27వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్‌-22 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి తెలిపారు. జూలై 11 వరకు రూ.250 అపరాధ రుసుముతో, జూలై 18 వరకు రూ.500తో, జూలై 23 వరకు 1000 అపరాధ రుసుముతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అడవుల్లో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా ఉనికి చాటుకున్నారు. చర్ల మండలం గోరుకొండ అటవీ ప్రాంతంలో ట్రెంచ్‌ పనులు చేస్తున్న అటవీశాఖకు చెందిన ఒక ప్రొక్లెయినర్‌ను ఆదివారం సాయంత్రం తగలబెట్టారు. ఓ ఎక్స్‌కవేటర్‌ను అపహరించారు. తోగ్గూడెం సీఆర్‌పీఎఫ్‌ 151 బెటాలియన్‌ క్యాంపునకు కూతవేటు దూరంలో వారు ఈ చర్యలకు పాల్పడ్డారు.

*రాష్ట్రంలో సోమవారం 246 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో సింహ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వచ్చే పాజిటివ్‌లలో 75 శాతం రాజధానిలోనే నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 20,507 పరీక్షలు చేయగా, 246 మందికి కొవిడ్‌ నిర్థారణ అయింది. ఇందులో 185 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే వచ్చాయి. మేడ్చల్‌లో 14, రంగారెడ్డిలో 19, యాదాద్రిలో 6 కేసులు నమోదయ్యాయి.

* ఈ నెల 22న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 24వ తేదీకి వాయిదా పడింది. సోమవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖలకు యూవో నోట్‌ విడుదల చేశారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగుతుందని సీఎస్‌ నోట్‌లో వెల్లడించారు.

*ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌, సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీపీఎస్సీ సెక్రెటరీ, చైర్మన్‌, సభ్యులకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్‌ పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌, న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

*ఎన్టీఆర్‌ ట్రస్టు చైర్మన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. పార్టీ నేతలు కేకులు కట్‌చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువత ఆధ్వర్యంలో భువనేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కేక్‌ కట్‌ చేయించిన పార్టీ నేతలు ఆయనను సత్కరించారు.

*తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోలీసు వలయాన్ని తప్పించుకుని చాకచక్యంగా నర్సీపట్నం చేరుకున్నారు. నర్సీపట్నం వెళ్లేందుకు అనిత కారులో బయలుదేరగా.. మాకవరపాలెంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ముఖానికి వస్త్రం కట్టుకుని, ద్విచక్ర వాహనం నడుపుకుంటూ అయ్యన్నపాత్రుడి ఇంటికి చేరుకున్నారు.

*ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు నెలకు 200 యూనిట్లు పైబడి వాడినా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించినా ఉచిత విద్యుత్‌ పథకానికి అనర్హులని ఇంధన శాఖ వెల్లడించింది. సోమవారం కథనంలో ప్రచురించిన లెక్కలు తప్పంటూ పేర్కొంది. అయితే ఈ ఏడాది మార్చి 29వ తేదీన సీపీడీసీఎల్‌ సీఎండీ పేషీ జారీ చేసిన అంతర్గత మెమో 852పై వివరణ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకానికి ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల 22,31,549 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఇంధన శాఖ వివరణ ఇచ్చింది. ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లోనూ, వెలుపలా నివసించే కుటుంబాలకూ ఈ పథకం వర్తింపచేస్తున్నామని పేర్కొంది. అదేవిధంగా సీపీడీపీసీఎల్‌ పరిధిలో 1,29,584 కుటుంబాలను తొలగించలేదని ఇంధన శాఖ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్‌ నంబరుతో విద్యుత్‌ సంస్థలు, గ్రామ సచివాలయ అధికారులను కలవాలని సూచించింది. కాగా అనర్హత పేరిట లబ్ధిదారులను తొలగించకుంటే ప్రత్యేకంగా ఆధార్‌ నంబరుతో విద్యుత్‌ సంస్థలు, సచివాలయ అధికారులను కలవాల్సిన అవసరం ఏమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలన్నింటికి 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చాయని గుర్తు చేస్తున్నాయి.

*సత్యం కంప్యూటర్స్‌ (ప్రస్తుతం టెక్‌ మహీంద్రా), సత్యం కంప్యూటర్స్‌ పూర్వ చైర్మన్‌ రామలింగరాజు తదితరుల మధ్య నెలకొన్న సివిల్‌ వివాదాన్ని ఆరునెలల్లో పరిష్కరించాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రామలింగరాజు తదితరుల చర్యల వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెక్‌ మహీంద్రా సిటీ సివిల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై పదేళ్లయినా ఎటువంటి పురోగతి లేకపోవడంతో టెక్‌ మహీంద్రా హైకోర్టును ఆశ్రయించింది.

*ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జున రెడ్డికి, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ విజయానందరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ కేటగిరి కింద కేబినెట్‌ హోదా ఖరారుతోపాటు, సాధారణ పరిపాలన శాఖ 17 మే 2022న జారీ చేసిన జీవో 36 ప్రకారం నిబంధనలు వర్తిస్తాయి.

* రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎ్‌ససీఈఆర్‌టీ) కార్యాలయాన్ని విజయవాడకు మార్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఇప్పుడు విజయవాడ మహానాడు రోడ్డులోని స్వామి మ్యాన్‌షన్‌కు మార్చినట్లు ఎస్‌సీఈఆర్‌టీ ఒక ప్రకటనలో తెలిపింది.

*కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.91.78,779 వచ్చింది. సోమవారం ఆలయ ఆస్థాన మండపంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు నేతృత్వంలో హుండీ కానుకలను లెక్కించారు. 130 గ్రాముల బంగారు, కేజీ మూడు వందల గ్రాముల వెండి, 594 యూఎ్‌సఏ, 300 సింగపూర్‌, 65 ఆస్ర్టేలియా డాలర్లు, 5 మలేషియా రింగిట్స్‌ సమకూరాయి. 17 రోజులలో ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో పాలక మండలి సభ్యులు నరసింహులుశెట్టి, మారుతీశ్వరరావు, కాంతమ్మ, సుశీల, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు ప్రసాద్‌ శ్రీధర్‌బాబు,కోదండపాణి, యూనియన్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

*బయోకాన్‌ బయోలాజిక్స్‌ డయాబెటీస్‌ ఇంజెక్షన్‌ ‘ఇన్సులిన్‌ అస్పార్ట్‌’కు మూడో దశ క్లినికల్‌ ట్రయల్‌ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా జాయింట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఎస్‌.ఈశ్వర రెడ్డి సోమవారం సీబీఐకి పట్టుబడ్డారు. కిరణ్‌ మజుందార్‌ షా నేతృత్వంలోని బయోకాన్‌ అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్స్‌ తరఫున సినర్జినెట్‌ నెట్‌వర్క్‌ ఇండియా డైరెక్టర్‌ దినేష్‌ దువా లంచం ఇస్తుండగా అతనితోపాటు సీడీఎ్‌ససీవో హెడ్‌క్వార్టర్‌్ంలో పనిచేస్తున్న రెడ్డిని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.

*మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అమెజాన్‌ చైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ బాటలోనే మరో కుబేరుడు భార్యతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆరో వ్యక్తి, ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌.. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడైన సెర్గే బ్రిన్‌(48) తన భార్య నికోల్‌ షానాహన్‌కు విడాకులు ఇవ్వనున్నారు. మూడేళ్ల తమ వివా హ బంధాన్ని రద్దు చేసుకోవాలని ఈ నెలలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచాలని కోర్టును బ్రిన్‌ కోరారు. బ్రిన్‌, నికోల్‌ దంపతులకు ఓ కొడుకు(3) కూడా ఉన్నాడు. బ్రిన్‌ సంపద విలువ దాదాపు రూ.73 లక్షల కోట్లు. తన మొదటి భార్య అన్నే వోజికీకి బ్రిన్‌ 2015లో విడాకులిచ్చారు.

*వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు రెండు నుంచి మూడు గంటలు, స్వామివారి దర్శనానికి రెండు గంటల మేరకు సమయం పట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను నియంత్రిస్తూ ఏర్పాట్లు చేశారు. సుమారు 20 వేల మందికి పైగా భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని, దాదాపు 20 లక్షల మేరకు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం సైతం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకున్నారు.

*అపోలో ఆస్పత్రి మూడు స్టేజ్‌ 6 అక్రిడిటేషన్లను సాధించినట్లు హెల్త్‌కేర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ సొసైటీ (హెచ్‌ఐఎంఎ్‌సఎస్‌) సోమవారం ప్రకటించింది. డిజిటల్‌ ఇమేజింగ్‌ అడాప్షన్‌ మోడల్‌ (డీఐఎఎం), ఔట్‌ పేషంట్‌ ఎలకా్ట్రనిక్‌ మెడికల్‌ రికార్డ్‌ అడాప్షన్‌ మోడల్‌ (ఓఈంఆర్‌ఎఎం), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడాప్షన్‌ మోడల్‌ అనే మూడు డిజిటల్‌ మెచ్యూరిటీ మోడల్స్‌లో ఇవి లభించాయి. స్టేజ్‌ 6 సాధించిన ఆస్పత్రులలో అపోలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మొదటిదని, ప్రపంచంలో రెండవదని సొసైటీ ఆసియా-పసిఫిక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సైమన్‌లిన్‌ తెలిపారు. తమ ఆస్పత్రి నిబద్ధతకు, నిర్వహణాసామర్థ్యానికి ఇవి నిదర్శనంగా అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి పేర్కొన్నారు.

*పెన్‌గంగా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన చనాకా-కొరాటా బ్యారేజీ, కెనాల్‌ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖలోని పర్యావరణ నిపుణుల కమిటీ(ఈఏసీ) ఇటీవల సమావేశమై తెలంగాణ ప్రభుత్వ దరఖాస్తును ఆమోదించింది. పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి ఈఏసీ సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ఈఏసీ పలు షరతులు విధించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలు వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలని తెలిపింది. ప్రాజెక్టు ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత ప్రాజెక్టుల వల్ల పర్యావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం చేయాలని, స్వతంత్ర ఏజెన్సీ అధ్యయనాన్ని నిర్వహించాలని షరతు విధించింది. ఇక గోదావరిపై సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలపై తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించిన టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(ఆర్‌ఏఆర్‌)కు ఈఏసీ అనుమతి ఇచ్చింది. సీతమ్మ బ్యారేజీతో పాటు 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్‌ కేంద్రాన్ని కడుతున్నారు. సీతమ్మ బ్యారేజీలో 130.71 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతుండటంతో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

*వడగండ్ల వాన గురించి తరచూ వింటుంటాం. కానీ, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో సోమవారం చేపల వాన కురిసింది. అవును.. ఈ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ వర్షం కురువగా.. నింగి నుంచి చినుకులతో పాటు చేపలు కూడా పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలంతా నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. కాళేశ్వరం మీదుగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసిన తర్వాత నేలపైన చిన్నచిన్న చేపలు కనిపించాయి. దీంతో అవాక్కయిన ప్రజలు అవి స్థానికంగా లభించే చేపలు కాకపోవడంతో ఎక్కడి నుంచి వచ్చాయోనని చర్చించుకున్నారు. చేపల వర్షంపై మత్స్యశాఖ అధికారులను వివరణ కోరగా.. వానాకాలంలో సముద్రాలు, నదులు, చెరువుల్లో సుడిగాలులు సంభవించినప్పుడు నీటిలోని చేపలు గాలిలోకి ఎగిరి మేఘాలలో చిక్కుకుంటాయని, అక్కడే ఘనీభవించి కొద్దిదూరం ప్రయాణిస్తాయని చెప్పారు. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేలమీద పడతాయని వివరించారు.

*నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తుండడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, మాల్స్‌, సినిమా థియేటర్లు, ఇతర బహుళ అంతస్తుల భవనాల్లో సాగుతున్న పార్కింగ్‌ దందాపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. ‘సీహెచ్‌ మదన్‌ మోహన్‌ వర్సెస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ కేసులో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ భారీగా వసూలు చేస్తున్నారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన ధర్మాసనం వినియోగదారులకు పార్కింగ్‌ సౌకర్యం కాల్పించాల్సిన బాధ్యత భవనాల యజమానులపై ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఎందుకు అమలు చేయడంలేదో వివరించాలని ఆదేశాలు జారీచేసింది.

*స్వీయ ఆస్తిపన్ను మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉన్నాయంటూ.. బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి యాజమాన్యానికి నిజాంపేట మునిసిపల్‌ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. వారం రోజుల్లోగా రూ.24,04,96,100 కట్టాలని సోమవారం నోటీసులు జారీ చేశారు. లేదంటే మునిసిపల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ మునిసిపల్‌ యాక్ట్‌ 2019 నిబంధనల ప్రకారం అంతర్జాలం ద్వారా ఇంటి యజమానులు స్వీయమదింపు చేసి, ఆస్తిపన్ను కట్టడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, స్వీయ మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే.. ఆస్తి విలువకు 25 రెట్ల జరిమానా విధిస్తారు. ఆ నిబంధన ప్రకారమే ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి జరిమానా విధించినట్టు సమాచారం. నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌ ప్లస్‌ తొమ్మిది అంతస్తులకు అనుమతి ఉంది. ఈ మేరకు ఆస్పత్రి నిర్మాణం పది లక్షల చదరపుటడుగుల్లో ఉండగా, కేవలం 4 అంతస్తుల్లో 32,300 చదరపు అడుగులే ఉన్నట్టు పేర్కొంటూ ఇటీవల యాజమాన్యం స్వీయ ఆస్తిపన్ను మదింపు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన నిజాంపేట్‌ నగరపాలక సంస్థ అధికారులు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 23వ తేదీన తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదిన ఉదయం గన్నవరం నుంచి విమానంలో బయల్దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో తిరుపతి రూరల్‌ మండలం పేరూరు వద్ద నిర్మితమైన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేరూరు నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వెళతారు. ఇనగలూరు వద్ద రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అపాచి పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఆ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆపై హెలికాప్టర్‌లో తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గాన విమానాశ్రయం పక్కనే శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌-1ను సందర్శిస్తారు. ఆ ప్రాంగణంలో టీసీఎల్‌ పరిశ్రమకు సంబంధించిన అనుబంధ యూనిట్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ ముగించుకుని తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంలో గన్నవరం బయల్దేరి వెళతారు.

*తాడికొండ లో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశం కావడం కలకలం రేపింది. ఎమ్మెల్యే శ్రీదేవి ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తాడికొండలో నిర్వహించే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి కనీసం జడ్పీటీసీ , ఎంపీటీసీ , సర్పంచ్ లకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే తీరుకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యలు పరిష్కారంకాలేదన్నారు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తాడికొండ మండలంలో గడపగడపకు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

*ఆన్లైన్‌లో టిక్కెట్ల విక్రయంపై ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సినిమా థియేటర్లు, ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాల కోసం ఎంవోయూ‌పై సంతకాలు చేయాలని ప్రభుత్వం ఎగ్జిబిటర్‌లపై ఒత్తిడి చేస్తుంది. అయితే టికెట్ విక్రయాల డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియకుండా.. సంతకాలు చేయమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆన్లైన్ విక్రయ సంస్థల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటు సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా చిలకలూరిపేట‌లో ఐదు ఏసీ థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై కోర్టుకు వెళ్లడం లేదా థియేటర్లను మూసివేయడమే తమ ముందున్నమార్గమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

*ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తప్పనిసరిగా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా దినోత్సవ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. తమ ఆదాయంలో శాతాన్ని ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. యోగాను అందరూ అలవరుచుకోవాలని పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే మైసూర్‌లో ప్రధాని మోదీ.. కోయంబత్తూరులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటున్నారని తెలిపారు.