Health

ఒత్తిడిని తగ్గించే పనస విత్తనాలు!

ఒత్తిడిని తగ్గించే పనస విత్తనాలు!

పనస పండు చూడటానికి పెద్దగా ఉంటుంది. మనదేశంతో పాటు శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌లో విపరీతంగా కాసే ఈ పనసపండును ‘విజిటబుల్‌ మీట్‌’ అని కూడా ముద్దుగా పిలుస్తారు. పండు సైజులానే ప్రొటీన్లు, న్యూట్రిన్లు పుష్కలం. ఈ తీపి పండులో ఉండే విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. పనసపండు లోపలి విత్తనాలకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది. వీడిని పొడి చేసి పిండిని అమ్ముతుంటారు. ఈ పొడిలో థయామిన్‌, రైబోఫ్లోవిన్‌ పుష్కలం. ఊరగాయల్లో, పొడి రూపంలో తీసుకున్న వెంటనే సత్వర శక్తి వస్తుంది. జీర్ణాశయంలోని ఆహారం త్వరగా అరగడానికి ఉపయోగపడుతుంది. చైనాలాంటి దేశాల్లో పనసపండు విత్తనాల పొడిని జీర్ణాశయ సంబంధ వ్యాధులను క్యూర్‌ చేయటానికి ఉపయోగిస్తారు.పనసపండు విత్తనాలను ఆవుపాలు లేదా గేదెపాలలో (అవి కూడా పచ్చిపాలు ఉండాలి) రెండు స్పూన్లు వేసి విత్తనాలను చూర్ణం చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రొటీన్లు, మైక్రో న్యూట్రిన్లు అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి. జుట్టు బాగా పెరుగుతుంది కూడా.ఇందులో ఐరన్‌శాతం ఎక్కువ. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. జాక్‌ఫ్రూట్‌ సీడ్స్‌ తింటే గుండెకు మంచిది. ఈ విత్తనాల్లో ఎ-విటమిన్‌ ఉండటం వల్ల కంటికి మంచిది.ప్రొటీన్లు పుష్కలం కాబట్టి కండరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇన్ని సహజగుణాలు వీటిలో ఉన్నాయి కాబట్టి.. పనసపండు విత్తనాలు ఇటు ధరలోనూ, అటు ఉపయోగంలోనూ ఆల్మండ్స్‌తో పోటీకి వస్తాయి.