DailyDose

సౌదీ అరేబియాలో దారుణం.. భారతీయుడిని హత్య చేసిన పాకిస్థానీ.. – TNI నేర వార్తలు

సౌదీ అరేబియాలో దారుణం.. భారతీయుడిని హత్య చేసిన పాకిస్థానీ.. – TNI  నేర వార్తలు

* ఉపాధి కోసం అతడు భార్యబిడ్డలను సొంత గ్రామంలో వదిలి.. ఏడాది దేశం పట్టాడు. ఏళ్లపాటు అక్కడే పని చేసిన అతడు.. కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి ఇంటికి వద్దామని భావించాడు. అయితే.. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. పాకిస్థానీ చేతిలో హత్యకు గురయ్యాడు. విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌‌లోని అమేతి జిల్లాకు చెందిన జాంగ్ బహదూర్.. ఉపాధి కోసం 2017లో సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ.. జీతంగా వచ్చే డబ్బును కుటుంబ సభ్యులకు పంపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 6న తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఆయన.. స్వగ్రామానికి రావాలనుకుంటున్నట్టు తెలిపాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వివరించాడు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. తనతోపాటు పని చేస్తున్న పాకిస్థాన్ పౌరుడి చేతిలో హత్యకు గురయ్యాడు. పని విషయంలో జరిగిన ఘర్షణలో ఆగ్రహానికి గురైన పాకిస్థానీ.. 43ఏళ్ల జాంగ్ బహదూర్ హత్య చేశాడు. కాగా.. అతడి మరణ వార్తని విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతేకాకుండా తమకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకెళ్లారు. జాంగ్ బహదూర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంతోపాటు.. ఈ ఘటనలో తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు.

*పశ్చిగోదావరి: జిల్లాలోని పాలకొడేరు, ఉండి, భీమవరంలలో దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నిందితులు నుంచి రూ.15 లక్షల విలువైన 38 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*కర్నూలు: జిల్లాలోని గూడూరు మండలం కె.నాగులాపురం సమీపంలో కంకర మిషన్ దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఢీకొన్న బొలొరో వాహనం ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు పులకర్తికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

* కావ‌లి ప‌ట్ట‌ణంలోని ముసునూరులో దారుణ హ‌త్య‌ జరిగింది. భర్తను భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కుటుంబ కలహాల కారణంగా భ‌ర్త‌ మాల్యాద్రిని రొక‌లి బండ‌తో తలపై మోది క‌త్తితో పొడిచి భార్య‌ పద్మ చంపేసింది. మాల్యాద్రి ప్రతిరోజూ ప‌ద్మ‌తో గొడ‌వ‌ ప‌డేవాడని పోలీసులు వెల్లడించారు. ప‌ద్మకి కొడుకు మ‌ధ‌న్, మామ శేష‌య్య‌ స‌హ‌క‌రించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
*భావితరాలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బాధితురాలి చేతికి ఇంజెక్షన్ గుచ్చి ఉండడం వల్ల ఆమె ఓవర్డోస్ ఇంజెక్షన్తో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్లో జరిగింది.

*ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కొత్తూరు వద్ద ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాలను ఢీట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 14 మంది సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. నిజామాబాద్ నుంచి నెల్లూరు జిల్లా వింజమూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి దాటిన తర్వాత.. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్లు సీట్లు మారుతున్న సమయంలో బస్సు అదుపుతప్పి.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు విద్యుత్ స్తంభాలతో పాటు.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదం నుంచి బస్సులోని 14 మంది ప్రయాణికులు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి.. డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు డ్రైవర్ మాత్రం.. గేదెను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పిందని చెప్పారు.

* అస్సాం రాష్ట్రంలోని కామరూప్‌ జిల్లాలో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.10 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఇందులో ఐదు కిలోల నల్లమందు కూడా ఉన్నట్టు చెప్పారు. డ్రగ్స్‌ తరలింపుపై సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రక్కులో తరలిస్తున్న డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఆ వాహనంపై ‘ఆన్‌ టెలికాం డ్యూటీ’ అనే స్టిక్కర్‌ ఉంది. వాహనంలోని మ్యూజిక్‌ సిస్టమ్‌, విడిగా ఉన్న టైరులో డ్రగ్స్‌ను దాచారు.

*ఉక్రెయిన్‌లో జనావాసాలపై రష్యా మరోసారి రాకెట్లను ప్రయోగించింది. శనివారం రాత్రి తూర్పు ఉక్రెయిన్‌ చాసివ్‌ యార్‌ పట్టణంలోని ఐదంతస్తుల భవనంపై రష్యా ఉరగన్‌ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. భవనం శిథిలాల్లో 20 మంది ఇరుక్కున్నారు. సమీపంలోని మరో ఐదంతస్తుల భవనంపైనా దాడి చేసినా.. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పశ్చిమ దేశాల ఆయుఽధాలు ఉక్రెయిన్‌ దళాలకు చేరేందుకు కీలక రవాణా కేంద్రం క్రమాటోర్స్క్‌కు చాసివ్‌ యార్‌ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా తాజాగా దాడి చేసినట్లు భావిస్తున్నారు. డాన్‌బా్‌సలోని రెండో భాగమైన డొనెట్స్క్‌నూ పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్‌ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, డొనెట్స్క్‌ రీజియన్‌లోని ఇంకొన్ని ప్రాంతాలపైనా మాస్కో సైన్యం గురి పెట్టింది. ఖార్కీవ్‌లోని నివాస ప్రాంతంపై శనివారం చేసిన దాడుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో ప్రజలు బయటకు రావొద్దంటూ సూచించారు.

*దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో సాయుధ దుండగులు కాల్పులకు తెగబడి 15మందిని బలితీసుకోవడం, దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జొహాన్నె్‌సబర్గ్‌లోని సొవెటో టౌన్‌షి్‌పలో ఉన్న బార్‌లోకి ప్రవేశించిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. దుండగులు మినీబ్‌సలో అక్కడకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

*దువ్వాడ రైల్వే స్టేషన్‌ నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసేందుకు సిద్ధంగా వున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది అరెస్టు చేశారు. వీరి నుంచి 38 కిలోల గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు, రూ.ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని గంజాయి రవాణా ముఠాకు చెందిన విశాల్‌కుమార్‌ సింగ్‌, నితీశ్‌కుమార్‌ పాండేలు దువ్వాడ రైల్వే స్టేషన్‌ నుంచి చెన్నైకు రైలులో గంజాయి తరలించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌పై గూడ్స్‌ రైలు ఢీకొన్న ఘటనలో ఆదివారం 55 గొర్రెలు మృతి చెందాయి. యజమాని స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. గ్రామానికి చెందిన లక్కం రాజం తన గొర్రెలను మేపేందుకు గ్రామ శివారులోని రైల్వే వంతెనపై నుంచిఅవతలి వైపు తరలిస్తున్నాడు. అదే సమయంలో జగిత్యాల నుంచికోరుట్ల వైపు వస్తున్న గూడ్స్‌ రైలు గొర్రెలను ఢీకొనడంతో 55 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 20 గొర్రెలకు గాయాలయ్యాయి. గొర్రెలను కాపాడే ప్రయత్నంలో రాజంకు స్వల్పగాయాలయ్యాయి. సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు రాజం తెలిపాడు. యజమాని రాజంను ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ పరామర్షించి ప్రభుత్వ పరంగా అదుకోవాలని ఆర్‌డీవో వినోద్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి కోరింది.

*విశాఖపట్టణం: స్థానిక కొత్త కరాసాలో జరిగిన ఓ భారీ దొంగతనం కేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్‌ విభాగం పోలీసులు 24 గంటలలోపే నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి అపహరించిన బంగారు ఆభరణాలు, డబ్బు, సెల్‌ఫోన్లు రికవరీ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. క్రైమ్‌ డీసీపీ డి.గంగాధరం, ఏసీపీ సీహెచ్‌.పెంటారావులు ఈ మేరకు కేసు వివరాలను వెల్లఢించారు. వివరాల్లోకి వెళితే… ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు తన ఇంట్లో చొరబడి, బీరువాలో దాచుకున్న 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు, 4 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు కొత్త కరాసాకు చెందిన విసరపు.నూక అప్పారావు 8వ తేదీ శుక్రవారం ఉదయం ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఇన్‌స్పెక్టరు బి.లూధర్‌బాబు, డిఎస్‌ఐ డి.కాంతారావు, పెందుర్తి డిఎస్‌ఐ ఎండి.సల్మాన్‌ బేగ్‌, సిబ్బంది సహకారంతో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, 28,000/- నగదు, 4 సెల్‌ ఫోన్లు స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు. పితాని.మణికంఠ, చెన్నా. కాళీచరణ్‌, వాసు ఉదయ్‌కిరణ్‌లను పట్టుకుని కోర్టులో విచారణ నిమిత్తం హాజరు పరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు జిల్లా టీడీపీ నేతలపై ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తితిలీ తుఫాన్ పరిహారంలో జరిగిన అవకతవకలపై ఈ నెల 8న కలెక్టర్‎కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* తిరుపత్తూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తాపడ్డ ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. మరో ముగ్గురు మెడికోలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తిరుపతికి చెందిన విద్యార్థిని షణ్ముఖిగా గుర్తించారు. తమిళనాడులోని యాలగిరి హిల్స్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్లు పోలీసుల ఛేజింగ్‌ నుంచి తప్పించుకుపోయారు. వారు వదిలిన వాహనాల నుంచి పోలీసులు 812 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై పోలీసులకు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలిసి పి.కె.పల్లి–ఆక్సాహేబుపేట ప్రాంతంలో నిఘా పెట్టారు.అదే సమయంలో రెండు కార్లు, ఒక బైకు అనుమానాస్పదంగా రావడంతో పోలీసులు వెంబడించారు. అయితే స్మగ్లర్లు అతి వేగంగా పోలీసులకు దొరక్కుండా కార్లు నడుపుతూ రోడ్డుకు ఎగువన ఉన్న ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి అందులో నుంచి దూకేసి పొదల్లో పరుగు తీసి తప్పించుకున్నారు. వాహనాల్లో 812 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. దీని విలువ రూ.16.24 లక్షలు ఉంటుందన్నారు.

*యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్‌కు వచ్చాడు.పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్‌ తీసుకునేందుకు బస్టాండ్‌ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్‌ చేస్తుండగా హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్‌ అలాగే ముందుకు పోనిచ్చాడు.అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ప్రాణాపాయం తప్పింది.

*తిరుపత్తూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తాపడ్డ ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. మరో ముగ్గురు మెడికోలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తిరుపతికి చెందిన విద్యార్థిని షణ్ముఖిగా గుర్తించారు. తమిళనాడులోని యాలగిరి హిల్స్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*ఎగ్మోర్‌ రైల్వే స్టేషనులో రద్దీ సమయాల్లో మొబైల్‌ ఫోన్లు చోరీ చేసే ఉత్తరాదికి చెందిన ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 47 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టేషన్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఏర్పడే రద్దీ సమయాల్లో మొబైల్‌ ఫోన్లు చోరీకి గురవుతున్నట్టు రైల్వే పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా వేశారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పొంతనలేకుండా సమాధానాలు ఇచ్చారు. చివరకు ఆ స్టేషన్‌లో తాము సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో ఒడిషా రాష్ట్రానికి చెందిన ప్రతాపన్‌ (23), సాయికుమార్‌ (25) అనే ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 47 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

*కావ‌లి ప‌ట్ట‌ణంలోని ముసునూరులో దారుణ హ‌త్య‌ జరిగింది. భర్తను భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కుటుంబ కలహాల కారణంగా భ‌ర్త‌ మాల్యాద్రిని రొక‌లి బండ‌తో తలపై మోది క‌త్తితో పొడిచి భార్య‌ పద్మ చంపేసింది. మాల్యాద్రి ప్రతిరోజూ ప‌ద్మ‌తో గొడ‌వ‌ ప‌డేవాడని పోలీసులు వెల్లడించారు. ప‌ద్మకి కొడుకు మ‌ధ‌న్, మామ శేష‌య్య‌ స‌హ‌క‌రించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

*ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్‌ నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు జిల్లా వింజమూరు వెళ్తుండగా జరిగిన ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్‌, ఏడు విద్యుత్‌ స్తంభాలు ధ్వంసం అయ్యాయి.

*అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం… రాజ‌మండ్రి వాసి సుధ మృతి__అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం చోటుచేసుకుంది. యాత్ర‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన రాజ‌మండ్రి వాసి సుధ మృతిచెందింది. సుధ మృత‌దేహాన్ని స‌హ‌చ‌రులు గుర్తించారు. మ‌రో మ‌హిళ కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి