Politics

ఏపీలో ఆ మూడు పార్టీలు విషకూటములు – TNI రాజకీయ వార్తలు

ఏపీలో ఆ మూడు పార్టీలు విషకూటములు  – TNI  రాజకీయ వార్తలు

* ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా మూడుపార్టీలు పనిచేస్తున్నాయని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నాయకులు విషకూటమిలా ఏర్పడి ఏపీ సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో అధికార పీఠంపై ప్రజలే కూర్చున్నారన్న విషయం తెలుసుకుంటే మంచిదని వారికి సూచించారు.టీడీపీలో శాశ్వత అధ్యక్షుడిగా చంద్రబాబు పేరు పెడితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరని అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని బలపరచాలని దేశ ప్రధాని మోదీ, అమిత్‌షా స్వయంగా ఫోన్ చేసి కోరారని తెలిపారు. రాష్ట్రంలో పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విమర్శించారు. తానో వీకెండ్‌ లీడర్‌ అని విమర్శించారు.అసెంబ్లీకి రానియకుండా జగన్‌ కుట్రపూరితంగా అడ్డుకుంటునారని పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పకొట్టారు. ప్రజలే ఆయనను అసెంబ్లీ గేట్‌ను తాకనీయడం లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసన పవన్‌ను అసెంబ్లీ గేట్‌ తాకకుండా ప్రజలే అడ్డుకున్నారని అన్నారు. ఇందులో జగన్‌కు ఏం సంబంధమని,ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న జగనే పవన్‌కు ప్రత్యర్థిగా కనబడుతున్నారని ఆరోపించారు.

*జనవాణికి వినతుల వెల్లువ : పోతిన వెంకట మహేష్
విజయవాడలో తమ పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయని జనసేన పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్ తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వినతులు ఇచ్చేందుకు జనం తరలివచ్చారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతోనే బాధితులు వాటిని పవన్ దృష్టికి తీచ్చారని పేర్కొన్నారు. జగన్ వైసీపీ ప్లీనరీ పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

*బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారు: మాగంటి గోపీనాథ్తె
లంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు.వర్షాకాలం రావడంతో నగర ప్రజలు సంజయ్ ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్ సమయంలో చెప్పినట్టుగా జీహెచ్ఎంసి పరిధిలో విపత్తుల సమయంలో 25వేలు, బండి పోతే బండి ఇస్తారా ఇప్పుడు అని ప్రశ్నించారు.మతాల పేరుతో రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.శ్రీలంక లో పట్టిన గతే బీజేపీ నేతలకు పడుతుందన్నారు.మీ రాష్ట్రాల్లో దళిత బందు ఇవ్వండని సవాల్ విసిరారు.మీకంటే ముందే రజాకార్ల సినిమా నేను తీస్తాను.అసలు నిజాం గురించి మీకు తెలుసా? అన్నారు.బండి సంజయ్ ఓ వెధవ, సీఎం తో పోల్చొద్దని అన్నారు.

*పేదవాడి కోసమే టీడీపీ: కేశినేని నాని
తెలుగుదేశం పార్టీ పెట్టింది పేదవాడి కోసమని టీడీపీ నేత కేశినేని నాని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రామారావు మంచి మార్పుతో పాటు సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. తెలుగువాడి ఆత్మగౌరం కోసం పెట్టింది….. పేదవాడి ఆకలి తీర్చడానికి చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టారని పేర్కొన్నారు.

*వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించం: సోమిరెడ్డి
వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తమ పార్టీ వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా..రైతులకి రూ.300 కోట్ల బకాయిలు చెల్లించకపోగా.. 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ఆరోపించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులంతా వైసీపీ ప్లీనరీ సేవలో తరించారని విమర్శించారు. మహానాడుకి ఒక్క బస్సు కూడా ఇవ్వని ఆర్టీసీ అధికారులు వైసీపీకి వందల సంఖ్యలో ఇచ్చారని గుర్తు చేశారు.

*ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవం: JD laxmi narayana
దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణస్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్లీనరీ(YCP Plenary) తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ముమ్మరమైందన్నారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.వైసీపీకి ఇది సరైన సమయం….రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీ(BJP)కి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ(YCP) మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు వైసీపీకి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని జేడీ లక్ష్మీ నారాయణ చెప్పుకొచ్చారు.

* KCR మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి: బండి సంజయ్
అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. ఏ పథకం తెచ్చినా కేసీఆర్ కుటుంబం బాగు కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ధరణిలో కబ్జా కాలం ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అసలు ధరణి వల్ల ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. అడవి బిడ్డలను కేసీఆర్ గోస పెడుతున్నారన్నారు. గిరిజనుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ , ప్రగతి భవన్ అడగడం లేదు కదా అని పేర్కొన్నారు.

*తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదు: కేఏ పాల్‌
రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశాడని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కూడా కట్టలేకపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తనతో కలిసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, అమిత్‌ షాకు లేఖలు ఇచ్చినా.. తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదన్నారు.

*తక్షణమే పయ్యావులకు గన్‌మెన్లను కేటాయించాలి: Lokesh
టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ కు భద్రతను తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్క‌సుతో ప‌య్యావుల కేశ‌వ్ సెక్యూరిటీ తొల‌గించేశారని మండిపడ్డారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌రెడ్డి ఆర్థిక ఉగ్ర‌వాదాన్ని గ‌ణాంకాలతో స‌హా వెల్ల‌డించిన కేశ‌వ్‌ త‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరితే.. ఉన్న సెక్యూరిటీ తొల‌గించేశారన్నారు. ఈ క‌క్ష‌సాధింపుల‌తో వైసీపీ స‌ర్కారు వేల‌కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్న‌ట్టే అని అన్నారు. త‌క్ష‌ణ‌మే కేశ‌వ్‌ అద‌న‌పు గ‌న్‌మెన్ల‌ను కేటాయించి సెక్యూరిటీ పున‌రుద్ధ‌రించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

*తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు: ఎంపీ GVL
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ (GVL) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్లీనరీ(YCP Plenary)లో వారి నాయకుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని తెలిపారు. ఇటువంటి వింత పోకడలను వైసీపీ మానుకోవాలని హితవుపలికారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP)లో బానిసత్వ ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. కుటుంబ పాలన వ్యవస్థ దేశానికి ముప్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు.

*సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను: లక్ష్మీనారాయణ
2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు పనిచేస్తున్నాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని ప్రకటించారు. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని, పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని లక్ష్మీనారాయణ చెప్పారు.

*జగన్‌ చేతకాని సీఎం: కేఏ పాల్‌
జగన్‌ చేతకాని సీఎం అని, రాష్ట్రానికి ప్రత్యామ్నాయం ప్రజా శాంతి పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ను అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్‌రెడ్డి అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని అన్నారు. 2019లో బాధ్యతలు చేపట్టిన జగన్‌ చేతకాని సీఎంగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. రానున్న రెండేళ్లు ప్రజల మధ్యే ఉంటానని అందుకే ‘పాల్‌ రావాలి.. పాలన మారాలి’ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు.

*పులివెందులలో గెలిస్తే అదే గొప్ప: తులసిరెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 సీట్లూ గెలవాలని జగన్మోహన్‌రెడ్డి ప్లీనరీలో చెప్పడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు దేవుడెరుగు సొంత నియోజకవర్గం పులివెందులలో గెలిస్తే అదే గొప్ప అని ఎద్దేవా చేశారు.

*తల్లిని గెంటేయడానికే ప్లీనరీ: బొండా
‘‘రాష్ట్రానికి చేసిన మంచి, అభివృద్ధి, రానున్న కాలంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చెప్పుకోవటానికి రాజకీయ పార్టీలు ప్లీనరీని నిర్వహిస్తాయి. కానీ జగన్‌రెడ్డి తన తల్లిని పార్టీ నుంచి గెంటేయడానికే ప్లీనరీ నిర్వహించారు’’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ‘‘తాను రానని చెప్పినా.. బలవంతంగా విమానంలో ఎక్కించి, తీసుకొచ్చి.. రాసుకున్న స్ర్కిప్టును చదివించి, పార్టీ నుంచి తల్లిని గెంటేశాడు. తల్లినే గెంటేసిన వైసీపీకి ఇదే ఆఖరి ప్లీనరీ’’ అని ని బొండా ఉమ ధ్వజమెత్తారు.

*జగన్‌రెడ్డి, విజయసాయి బినామీలతో లిక్కర్‌ దందా: ఆనం
జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో సాగిస్తున్న లిక్కర్‌ దందా బయటపడిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు. ‘‘విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస కాశీచైనులు అనే వ్యక్తి అదాన్‌ డిస్టలరీకి డైరెక్టర్‌గా ఉన్నాడు. అదాన్‌కి సొంత డిస్టిలరీ లేదు. సబ్‌ లీజుకు డిస్టలరీలు తీసుకుని, విజయసాయిరెడ్డి విషపు మద్యం తయారు చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అదాన్‌ డిస్టలరీలకు సంబంధించిన పూర్తి వివరాలను టీడీపీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. 2019 డిసెంబరు 2న ఏర్పడిన అదాన్‌ డిస్టలరీకి ఎవరు అనుమతిచ్చారు? కంపెనీ పెట్టిన రెండున్నరేళ్లకే రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారో చెప్పాలి’’ అని ఆనం డిమాండ్‌ చేశారు.

*తల్లి, చెల్లి, ఆత్మ, నీడ… వారే నమ్మకుంటే… జనమెందుకు నమ్మాలి?: సోమిరెడ్డి
‘‘దివంగత రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన నమ్మి తన వెంట ఉంచుకొన్న వారు… ఎవరూ ఇప్పుడు జగన్‌ పక్కన లేరు. జగన్‌ వారిని దూరంగా తోసేశారు లేదా వారే ఆయనను వెలివేశారు. వారే నమ్మని జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ వదిలిన బాణం అని చెప్పుకొన్న షర్మిల నువ్వు చేసిన మోసానికి బాధపడి పొరుగు రాష్ట్రం వెళ్లిపోయారు. తల్లి విజయమ్మతో బలవంతంగా పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా ఇప్పించావు. వైఎ్‌సఆర్‌ ఆత్మ కేవీపీ రామచంద్రరావు… నీ పార్టీని వద్దనుకొని జన్మనిచ్చిన పార్టీలో ఉండిపోయారు. రాజశేఖర్‌రెడ్డి నీడ… సూరీడు నీ నీడలోకి రాకుండా వెళ్లిపోయాడు. మరో చెల్లి సునీత నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. తల్లి… చెల్లి… ఆత్మ… నీడ… ఎవరూ నిన్ను నమ్మడానికి, నీతో నడవడానికి ఇష్టపడకపోతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఎందుకు నమ్మాలి? నీతో ఎందుకు నడవాలి?’’ అని జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు

*ఇలాంటి ప్లీనరీని ఎప్పుడూ చూడలేదు: టీడీపీ నేత
వైసీపీ ప్లీనరీ అంతా ఆత్మస్థుతి.. పరనింద మాత్రమేనని టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు అన్నారు. మీడియాను తిట్టడానికే ప్లీనరీ పెట్టడం ఎప్పుడూ చూడలేదన్నారు. కుడి చేత్తో రూ.10 ఇచ్చి.. ఎడమ చేత్తో రూ.100 దోచుకుంటున్నారని ఆరోపించారు. అమ్మఒడితో రూ.13 వేలు అందించి.. నాన్న బుడ్డీతో రూ.45 వేలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

*కేసీఆర్‌ ఉపన్యాసం.. పొలిటికల్‌ విద్యార్థులకు ఉపయోగం: కేటీఆర్‌
రాజకీయాల పట్ల అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌ చేసిన ఉపన్యాసం పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగమని, రాజకీయ విధానాలపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఎనిమిదేళ్లయినా ఒక్కసారి కూడా ఇటువంటి ప్రెస్‌మీట్‌ను ఎదుర్కోలేనివారు మరికొందరుంటారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

*తెలంగాణలో 80 సీట్లు గెలుస్తాం: ఠాగూర్‌
కాంగ్రెస్‌లోకి త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ 70- 80 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రె్‌సలోకి ఇటీవలి కాలంలో చేరికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎర్రశేఖర్‌తో పాటుగా పలువురు నేతల చేరికపైన ఇటీవల పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి బోసురాజుతో పాటుగా ఠాగూర్‌ వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సహచర ఎంపీ వెంకట్‌రెడ్డి తమను లంచ్‌కు ఆహ్వానిస్తే వచ్చామన్నారు. ఈ సందర్భంగా చేరికలు సహా చాలా అంశాలపైన చర్చించినట్లు చెప్పారు. ఎంపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మంచి వారిని చేర్చుకోవాలని, ఎన్నికల ముందే అభ్యర్థులను నిర్ణయించాలని, అన్ని సామాజిక వర్గాల వారికీ టికెట్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. తాను రేవంత్‌రెడ్డితో కలిసే పనిచేస్తున్నట్లు చెప్పారు.

*లంగాణ రైతులను అవమానించేలా గోయల్ వ్యాఖ్యలు: కేసీఆర్
తెలంగాణ రైతులను అవమానించేలా పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.తెలంగాణ రైతులను నూకలు తినమంటారా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పంటలకు సంబంధించి కేంద్రానికి విధానం ఏమైనా ఉందా?అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.ఎంతోమంది రాక్షసులు పోయారు. మీరు అంతకంటే గొప్పవాళ్లా?వాణిజ్య, వ్యవసాయశాఖలకు సమన్వయం లేదని వాళ్లు చెబుతున్నారు.ప్రముఖ విలేకరులను నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఏక్‌నాథ్‌షిండేలను సృష్టిస్తామని బహిరంగంగా చెబుతారా? కోర్టులు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు అంటే గౌరవం లేదని కేసీఆర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి ఓ పాలసీ అంటూ ఏమీ లేదని సీఎం స్పష్టం చేశారు.

*కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:Tarun chug
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్అ న్నారు. ఈనెల21 నుంచి పల్లె ఘోస- బీజేపీ భరోసా పేరుతో యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన వివరించారు.వచ్చేఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని బిజెపి నిర్ణయించిందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.మూడో విడతలో బండి సంజయ్‌ 20 రోజుల పాదయాత్ర చేస్తారని తరుణ్‌చుగ్ తెలిపారు.

*మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి: సీఎం కేసీఆర్
భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌.. విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవు అని ప్రశ్నించారు. ఒక్క బ్యాంకు దోపిడీదారుడినైనా ఎందుకు తీసుకురాలేదు. దేశంలో అమాయకులపైనే మీ ప్రతాపమా.?. దోపిడీదారులకు మాత్రం లక్షలకోట్లు దోచిపెడుతున్నారు. 12 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో మోదీ వాటా ఎంతో చెప్పాలి.తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని మాట్లాడాతారా. ఏకానాథ్‌ షిండేలను సృష్టాస్తామని బాహాటంగా చెబుతున్నారు ఇలాదే మీ సంస్కారం. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బీజేపీ గుర్తుంచుకోవాలి. పార్టీలను భయపెడతారు.. నాయకులను భయపెడతారు.. ఇదేం ప్రభుత్వం..?. ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ న్యాయమూర్తులకు సెల్యూట్‌ చేస్తున్నాను. నూపురు శర్మ వ్యాఖ్యలను తప్పుపడితే సుప్రీంకోర్టుపైనా లేఖలు రాయిస్తారా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరిస్తున్నారు.. ఇది కరెక్టేనా..?. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని కండకావరమా బీజేపీ..?. జడ్డీలను కూడా ట్రోలింగ్‌ చేస్తారా..?. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కోర్టులు, జర్నలిస్టులు అంటే కేంద్రానికి గౌరవం లేదు. మేకిన్‌ ఇండియా పథకం అట్టర్‌ ప్లాప్‌ అయింది. పెట్టుబడిదారుల కోసం పీఎం సెల్స్‌మెన్‌గా మారారు.మన జాతీయ జెండాలు చైనా తయారు చేయడం మేకిన్‌ ఇండియానా..?. పతంగులు, దారాలు కూడా మనం తయారు చేయాలేమా..?. దేశంలో రైతులకు సబ్సిడీ ఇవ్వరు. బీజేపీ నేతలు ప్రజా హంతకులు కారా..?. బీజేపీ కండువా కప్పుకోగానే కొందరు అవినీతికి పాల్పడిన నేతలకు నోటీసులు ఆగిపోయాయి. వారంతా బీజేపీలోకి వెళ్లగానే వారంతా పవిత్రం అయిపోతారా..?. చివరకు దేశ సైన్యం విషయంలో కూడా ఉన్మాదంతో ప్రవర్తిస్తారా..?. మీ వికృత రాజకీయాల కోసం కశ్మీర్‌ పండిట్లను బలి తీసుకుంటారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.